ఆర్థిక మంత్రిత్వ శాఖ

వినియోగ వ్యయం ఉద్దీపనకు రూ. 73వేల కోట్లతో చర్యలు కోవిడ్ పై పోరులో వ్యూహం : కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన

2018-21లో ఒక ఎల్.టి.సి.కి బదులు అర్హతలకు తగినట్టు నగదు చెల్లింపు, సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయం

ఒకసారి చెల్లింపు ప్రాతిపదికపై పండుగ ప్రత్యేక అడ్వాన్స్ పథకం పునరుద్ధరణ
గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు వర్తింపు

రూ. 12,000 కోట్లమేర పెట్టుబడి వ్యయంకోసం 50ఏళ్ల గడువుతో రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు

పెట్టుబడి వ్యయంకోసం రూ. 25,000కోట్ల అదనపు బడ్జెట్ 2020-బడ్జెట్లో ఇచ్చిన రూ. 4.13లక్షల కోట్లకు ఇది అదనం

Posted On: 12 OCT 2020 5:06PM by PIB Hyderabad

  కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కారణంగా మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను చైతన్యపరిచే ప్రయత్నంలో భాగంగా కొన్ని ఉద్దీపన చర్యలను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఢిల్లీలోప్రకటించారు. వినియోగ వ్యయాన్ని ఉత్తేజితం చేసేందుకు రూ. 73,00కోట్ల రూపాయల మేర చర్యలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేబాశీస్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ సమక్షంలో మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.

  ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ,. “ప్రభుత్వ ఉద్యోగులు, సంఘటిత రంగం ఉద్యోగుల   పొదుపు మొత్తాల పరిమాణం పెరిగిందనే మాకు సూచనలు అందాయి. తక్కువ అవకాశాలు మాత్రమే అందుకున్న అలాంటి వారికి తగిన ప్రయోజనం కలిగించే ప్రోత్సహకాలను ఇవ్వాలని మేం సంకల్పించాం.”అని అన్నారు. ఈ రోజు తాము ప్రకటించిన ఉద్దీపన చర్యల ఆధారంగా గిరాకీ పెరిగిన పక్షంలో, కోవిడ్-19 వైరస్ కారణంగా దెబ్బతిన్న వారిపై దాని ప్రభావం ఉంటుందని, తమ కార్యకలాపాలు, వాణిజ్యం ఎప్పటిలా ముందుకు సాగాలని వారు కోరుకుంటూ ఉంటారని ఆమె అన్నారు. ఈ రోజు ప్రకటించిన పరిష్కారం రేపటి సమస్యగా పరిణమించరాదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తలెత్తబోయే ద్రవ్యోల్బణం సామాన్య పౌరులపై ఏ మాత్రం భారం కాకూడదన్నదే ప్రభుత్వ అభిమతమని, ప్రభుత్వ రుణ పరిస్థితి అస్థిరమైన పంథాలో సాగకుండా చూడాలన్నది ప్రభుత్వ సంకల్పమని అన్నారు.

  వినియోగ వ్యయానికి ఉద్దీపన కలిగించేందుకు ఈ రోజు ప్రకటించిన చర్యలను ద్రవ్యపరంగా వివేకవంతమైన పద్ధతిలో రూపొందించామన్నారు. ఈ చర్యల్లో కొన్ని వ్యయాన్ని ప్రోత్సహించేవి కాగా, మరికొన్ని నేరుగా స్థూల స్వదేశీ ఉత్పత్తిని (జి.డి.పి.ని) పెంచడానికి ఉద్దేశించినవవి అన్నారు. కోవిడ్-19 సంక్షోభం సృష్టించిన ఆర్థిక మందగమన పరిస్థితిని ఎదుర్కొనేందుకు, ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుందనడానికి ప్రస్తుత ఉద్దీపన చర్యలే తార్కాణమని కేంద్రమంత్రి అన్నారు.

ఉద్దీపన ప్యాకేజీ వివరాలు, ఈ కింది విధంగా ఉన్నాయి.: -

  కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలు ఇక్కడ చూడవచ్చు.

 



(Release ID: 1663820) Visitor Counter : 298