ఆయుష్

చర్మ వ్యాధులకు హోమియోపతి చికిత్స స్పర్శ

Posted On: 12 OCT 2020 11:15AM by PIB Hyderabad

చర్మ సంబంధిత వైరల్ వ్యాధుల విషయంలో హోమియోపతి అద్భుతాలు చేయగలదని ధ్రువీకరించేవారు ఎంతో మంది ఉన్నారు. షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద  హోమియోపతి రీసెర్చ్ జర్నల్ ‘ఆయుహోమ్‌’ ఇటీవల ప్రచురించిన ఒక కేస్ స్టడీ ఇదే విషయాన్ని వివరిస్తుంది.

ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్  మహాకాస్ మండల్ రీడర్ సంగీతా సాహా,  కలకత్తా హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ విభాగం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ తో పాటు కోల్కతాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ కౌశిక్ భార్ కేస్ స్టడీ నిర్వహించింది. ఐదు వేర్వేరు చర్మ వ్యాధులతో బాధపడుతున్న ఐదుగురు రోగులకు హోమియోపతి చికిత్స గుర్తించదగిన ఫలితాలను ఇచ్చింది, ఇటువంటి చర్మ రుగ్మతలపై హోమియోపతి ఔషధం సానుకూల ప్రభావం చూపుతుందన్న నమ్మకాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. చర్మ వ్యాధులు అనేక రకాలు.  తరచూ సంభవించే ఈ ఆరోగ్య సమస్యలు భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిని ఇబ్బందిపెడుతున్నాయి. చర్మ సమస్యలు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వ్యాధని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ప్రాజెక్ట్ అధ్యయనం కనుగొంది.  సాధారణ వైరల్ చర్మ వ్యాధులకు హోమియోపతి ద్వారా భారీ సంఖ్యలో ప్రజలకు భరించగలిగే ధరల్లో  సమర్థవంతమైన పరిష్కారాలను అందించవచ్చని, ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుందని హోమియోపతి నిపుణులు అభిప్రాయపడ్డారు.

 వార్ట్, హెర్పెస్ జోస్టర్  మొలస్కాన్ కాంటాగియోసమ్ అనే చర్మ వ్యాధులు ఉన్న ఐదుగురు రోగులపై ఈ అధ్యయనం జరిగింది.  కెరాటినోసైట్స్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే మొటిమలను/కణతులను వార్ట్స్ అంటారు. వరిసెల్లా-జోస్టర్ వైరస్ (ఇది ఆటలమ్మకు కూడా కారణమవుతుంది) తిరిగి క్రియాశీలం కావడం వల్ల హెర్పస్ జోస్టర్ వస్తుంది.  పాక్స్ వైరస్ మాదిరి వైరస్లు దాడి చేయడం వలన మొలస్కాన్ కాంటాజియోసమ్ వ్యాధి సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శీతోష్ట దేశాల్లో చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.  హోమియోపతి రోగికి చికిత్స చేస్తుంది, వ్యాధికి కాదనే విషయం తెలిసిందే. ఇలాంటి కేసుల్లో హోమియో సూత్రాల అంతర్గత చికిత్సా విధానం ద్వారా చర్మ సమస్యలను పరిష్కరిస్తారు.  ఫలితాలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి.

ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్  మార్గదర్శకాల ప్రకారం రోగుల చర్మరకాలకు అనుగుణంగా వివిధ దశలలో సూచించిన మందులను ఇచ్చిన తరువాత,  అవి చర్మ గాయాలను సమర్థవంతంగా తొలగించడం లేదా కరిగించగలినట్టు గుర్తించారు.  అంతే కాదు, చికిత్స సమయంలో రోగులలో ఎవరూ ఎటువంటి దుష్ఫలితం గురించి ఫిర్యాదు చేయలేదు. ప్రస్తు కేస్ స్టడీస్‌లను ప్రయోగాత్మక ప్రాజెక్టుగా పరిగణించవచ్చు. తరువాతి దశలో భారీగా యాధృచ్ఛిక నమూనాలతో ప్రయోగాలు చేయడానికి వీలు కలుగుతుంది. ఫలితంగా హోమియోపతి ద్వారా చర్మ వ్యాధులకు అద్భుతమైన చికిత్స అందించవచ్చనే దృఢనిశ్చయానికి రావొచ్చు. 

***



(Release ID: 1663713) Visitor Counter : 1128