రక్షణ మంత్రిత్వ శాఖ
7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో బిఆర్ ఒ నిర్మించిన 44 వంతెనలను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అరుణాచల్ ప్రదేశ్‌లోని నేచిఫు సొరంగానికి పునాదిరాయి వేసిన రాజ్‌నాథ్ సింగ్
Posted On:
12 OCT 2020 12:44PM by PIB Hyderabad
దేశ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ సరిహద్దులకు సమీపంలో ఉన్న సున్నిత ప్రాంతాలను అనుసంధానం చేసే 44 శాశ్వత వంతెనలను సోమవారం జాతికి అంకితం చేస్తూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నూతన శకానికి తెరతీశారు. ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని నేచిఫు సొరంగమార్గ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ వంతెనలు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండడమే కాక, మారుమూల ప్రాంతాలకు అనుసంధాన సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఈ 44 వంతెనలు ఏడు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. జాతికి అంకితం చేసే ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్, దేశ భద్రతాదళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం. నారావానే, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు, జమ్ము కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్తో పాటుగా పార్లమెంటు సభ్యులు, పాలన/ సఐనిక అధికారులతో సహా ఆయా రాష్ర్టాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.
సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ)కు చెందిన డిజి సహా పలు స్థాయి అధికారులను, సిబ్బందిని వారు సాధించిన విజయాలకు అభినందిస్తూ, ఏకకాలంలో 44 వంతెనలను అంకితం చేయడమన్నది ఒక రికార్డు అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఒకవైపు కోవిడ్-19 సంక్షోభం, మరోవైపు పాకిస్థాన్, చైనాల కారణంగా చెలరేగుతున్న సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతల వంటి సంక్లిష్ట కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశం వాటిని ఎదుర్కొనేందుకు దృఢ సంకల్పంతో ఉండడమే కాకుండా , అభివృద్ధికి సంబంధించిన అన్ని రంగాలలోనూ చారిత్రిక మార్పులు తేవాలనే పట్టుదలతో ఉందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
సరిహద్దులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో బిఆర్ ఒ పాత్రను కొనియాడుతూ, ఈ వంతెనలు సుదూరంగా ఉన్న పశ్చిమ, ఉత్తర, ఈశాన్య రంగాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరి, స్థానిక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందని ఆయన అన్నారు.
రహదారులు, వంతెనలు ఏ దేశానికైనా జీవనాడి వంటివని, సుదూర ప్రాంతాల సామాజిక, ఆర్ధిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని రక్షణ మంత్రి తెలిపారు. సరిహద్దు ప్రాంతాలలో అభివృద్ధి కార్యకలాపాలను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ అంకిత భావాన్ని నొక్కి చెప్తూ, అన్ని ప్రాజెక్టుల అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, వాటిని సకాల నిర్వహణకు తగిన నిధులను సమకూరుస్తున్నామని మంత్రి వివరించారు.
గత దశాబ్దంలో - 2008 నుంచి 2016 వరకు దాదాపు రూ. 3,300 కోట్ల నుంచి రూ. 4,600 కోట్లగా ఉన్న బిఆర్ ఒ వార్షిక బడ్జెట్ చెప్పుకోదగినంతగా పెరిగి, 2020-21 నాటికి రూ. 11,000 కోట్లకు చేరుకుందని తెలిపారు. కోవిడ్-19 సంక్షోభంలో కూడా దీనిని తగ్గించలేదని గుర్తు చేశారు.
బిఆర్ ఒ ఇంజినీర్లకు, కార్మికులకు హైఆల్టిట్యూడ్ క్లోతింగ్‌ను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్టు రక్షణ మంత్రి ప్రకటించారు.
అలాగే, అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌కు వెళ్ళే రహదారిలో వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన నేచిఫు సొరంగమార్గ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. సుమారు 450 మీటర్ల పొడుగు ఉండే ఈ బైలేన్ సొరంగం నేచిఫు పాస్‌కు అన్ని కాలాల్లోనూ అనుసంధాన సౌకర్యాన్ని కల్పించడమే కాక, ప్రమాదాలకు అవకాశం ఉండే ప్రాంతాలో సురక్షితంగా వెళ్ళే అవకాశం ఇచ్చేలా చూస్తుంది.
అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సుమారు 30 నుంచి 484 మీటర్ల వరకు వివిధ ఎత్తులలో ఉన్న ఈ 44 వంతెనల- జమ్ము కాశ్మీర్లో 10, లడాఖ్ లో 08, హిమాచల్ ప్రదేశ్‌లో 02, పంజాబ్‌లో 04, ఉత్తరాఖండ్‌లో 08, అరుణాచల్ ప్రదేశ్‌లో 08, సిక్కింలో 04 ఉన్నాయని, బిఆర్ ఒ డిజి, లెఫ్టనెంట్ జనరల్ హర్పాల్ సింగ్ వివరించారు. ఇవి చాలా వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని, సరిహద్దు ప్రాంతాలలో భారీ పౌర, సైనిక ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సౌలభ్యాన్ని కల్పిస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా, సరిహద్దులలోని మారుమూల ప్రాంతాలలో సమగ్ర ఆర్ధికాభివృద్ధి జరిగేందుకు ఈ వంతెనలు తోడ్పడతాయి. అంతేకాకుండా, వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాలలో సాయుధ దళాలను వేగంగా మోహరించేందుకు సాయపడతాయి.
రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే కాక, బిఆర్ ఒ వంతెనల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి గత సంవత్సరంలో 28 ప్రధానవంతెనల నిర్మాణం పూర్తి చేసిందని, మరో 102 వంతెనల నిర్మాణం ఈ ఏడాది పూర్తి అవుతుందని చెప్పారు. ఇందులో ఇప్పటికే 54 వంతెన నిర్మాణం పూర్తి అయింది. మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, సాయుధ దళాల అవసరాలను తక్షణం తీర్చేందుకు బిఆర్ ఒ 60 బైలే వంతెనలను నిర్మించింది.
కోవిడ్ -19 సంక్షభ ఆంక్షల నేపథ్యంలో కూడా బిఆర్ ఒ అహర్నిశలు పని చేస్తూ, వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన ప్రధాన వంతెనలు రోడ్ల నిర్మాణం, అతల్ టన్నెల్ రోహతంగ్, సెలా సొరంగం తదితర పనులను, వూహాత్మకమైన పర్వత మార్గాలను తెరిచేందుకు మంచును తొలగించడాన్ని కొనసాగించింది. ఆరు దశాబ్దాల కిందటి రికార్డును బద్దలు చేస్తూ అనూహ్యంగా మంచుకురిసినప్పటికీ, అన్ని వ్యూహాత్మక మార్గాలు, రహదారులను ప్రతి ఏడాది వాటిని తెరిచే ఒక నెలకు ముందుగా ట్రాఫిక్ సాగేందుకు అనువుగా శుభ్రం చేశారు. ఇది సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలకు ఊరటను ఇవ్వడమే కాక, దళాలు,లాజిస్టిక్స్ వేగవంతంగా, త్వరగా కదిలేందుకు తోడ్పడింది.
***
(Release ID: 1663710)
Visitor Counter : 290