పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        భారతదేశానికి గర్వకారణం; ప్రభుత్వం సిఫార్సు చేసిన మొత్తం 8 బీచ్‌లకు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభిస్తోంది: శ్రీ ప్రకాష్ జవదేకర్
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                11 OCT 2020 5:34PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                దేశంలోని ఐదు రాష్ట్రాలు,రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 8 బీచ్‌లకు యుఎన్‌ఇపి, యుఎన్‌డబ్ల్యుటిఒ, ఎఫ్‌ఇఇ, ఐయుసిఎన్ వంటి ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ జ్యూరీ "బ్లూ ఫ్లాగ్" ను ప్రదానం చేసింది. ఇది భారతదేశం  గర్వించదగ్గ సందర్భం
భారతదేశంలో బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ పొందిన బీచ్‌లు..శివరాజ్‌పూర్ (ద్వారకా-గుజరాత్), ఘోంగ్లా (డియు), కసర్‌కోడ్ మరియు పాడుబిద్రి (కర్ణాటక), కప్పడ్ (కేరళ), రుషికొండ (ఏపి), గోల్డెన్ (పూరి-ఒడిశా)  రాధానగర్(అండమాన్ &నికోబార్ దీవులు)
తీరప్రాంతాలలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గాను "ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టిసెస్ ఫర్ పోల్యూషన్ కంట్రోల్ ఇన్ కోస్టల్ రిలీజియన్" కేటగిరీలో భారతదేశానికి 3వ బహుమతిని కూడా అంతర్జాతీయ జ్యూరీ ప్రకటించింది.
"ఒకే ప్రయత్నంలో దేశంలోని 8 బీచ్‌లకు 'బ్లూ ఫ్లాగ్' అవార్డు  దక్కడం చాలా గొప్ప ఘనత" అని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ తన ట్వీట్ సందేశంలో తెలిపారు.  "భారతదేశం చేపట్టిన పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధికి ఇది ప్రపంచ గుర్తింపు"అని పేర్కొన్నారు.
"ఆసియా-పసిఫిక్" ప్రాంతంలో కేవలం 2 సంవత్సరాల కాలంలో ఈ ఘనత సాధించిన మొదటి దేశం భారతదేశం"అని శ్రీ జవదేకర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇతర ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియా మరియు యుఎఈ దేశాల్లో మాత్రమే రెండు బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది. అది కూడా సుమారు 5 నుండి 6 సంవత్సరాల వ్యవధిలో.
భారతదేశం ఇప్పుడు 50 "బ్లూ ఫ్లాగ్" దేశాల పోటీలో ఉందని.. ఇది దేశానికి గర్వకారణంగా భావిసున్నామని కేంద్రమంత్రి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశంలోని 100 బీచ్‌లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు.
పైలట్ బీచ్‌ల అభివృద్ధి కోసం 2018లో భారతదేశం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా తీరప్రాంత రాష్ట్రాలు / కేంద్రప్రాలిత ప్రాంతాల్లో ఒక్కో బీచ్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది.రాబోయే 2020 పర్యాటక సీజన్ కోసం అందులోని 8 బీచ్‌ల జాబితాను బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు కోసం అందించింది.
ఎస్‌ఐసీవోఎమ్, ఎంఈఎఫ్‌సీసీలు భారతదేశ తీర ప్రాంతాల సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కోసం ఎఐసీజెడ్‌ఎమ్ (ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్) ప్రాజెక్ట్ కింద  బీమ్స్( బీచ్ ఎన్విరాన్మెంట్ & అస్తెటిక్స్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్) అనే  కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం అనేక ప్రశంసలు పొందింది. ఎఫ్‌ఈఈ (ది ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్) డెన్మార్క్ ప్రధానం చేసే అంతర్జాతీయ పర్యావరణ లేబుల్ "బ్లూ ఫ్లాగ్" కోసం ప్రయత్నించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
తీరప్రాంత జలాలు మరియు బీచ్‌లలో కాలుష్యాన్ని తగ్గించడం, బీచ్‌లలో సౌకర్యాలు పెంపొందించడం, అభివృద్ధిని ప్రోత్సహించడం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలు మరియు సహజ వనరులను రక్షించడం మరియు పరిరక్షించడంతో పాటు ఆ మేరకు స్థానిక అధికారులు, సంస్థలు పరిశుభ్రత,  అధిక ప్రమాణాలు పాటించే విధంగా ప్రోత్సహించడం బీమ్స్ ( బీచ్ ఎన్విరాన్మెంట్ & అస్తెటిక్స్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్) కార్యక్రమం లక్ష్యం. పర్యావరణానికి హాని కలగని విధంగా తీరప్రాంత పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా బీచ్ టూరిజాన్ని ప్రొత్సహించడం బీమ్స్ కార్యక్రమం లక్ష్యం.
***
                
                
                
                
                
                (Release ID: 1663622)
                Visitor Counter : 310
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam