వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2020 ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి నిత్యావసర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43.4% పెరుగుతుంది

వ్యవసాయ వాణిజ్యానికి సంబంధించిన బ్యాలెన్స్ కూడా 2020 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో రూ.9002 కోట్ల రూపాయలుగా ఉంది

Posted On: 10 OCT 2020 3:32PM by PIB Hyderabad

కోవిడ్ -19 సంక్షోభం ఉన్నప్పటికీ, 2020 ఏప్రిల్-సెప్టెంబర్ సంచిత కాలానికి అవసరమైన వ్యవసాయ వస్తువుల ఎగుమతి 43.4% పెరిగి రూ. 53626.6 కోట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే కాలంలో రూ .37397.3 కోట్లు ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్, 2019-20 తో పోలిస్తే ఈ ఏప్రిల్-సెప్టెంబర్, 2020-21 మధ్య కాలంలో సానుకూల ఎగుమతి వృద్ధిని నమోదు చేసిన ప్రధాన వస్తువుల సమూహాలు వేరుశనగ (35%), శుద్ధి చేసిన చక్కెర (104%), గోధుమ (206%), బాస్మతి బియ్యం (13%) మరియు నాన్-బాస్మతి రైస్ (105%) మొదలైనవి.

ఇంకా, 2020 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో వాణిజ్య బ్యాలెన్స్ రూ .9002 కోట్లతో గణనీయంగా సానుకూలంగా ఉంది. 2019 లో ఇదే కాలంలో వాణిజ్య లోటు రూ. 2133 కోట్ల గా ఉంది. నెల, నెల ప్రాతిపదికన (ఎంఓఎం), 2020 సెప్టెంబరులో భారతదేశ వ్యవసాయ ఎగుమతి రూ .9296 కోట్లుగా ఉంది, ఇది 2019 సెప్టెంబర్‌లో 5114 కోట్ల రూపాయల ఎగుమతికి గాను 81.7 % పెరుగుదలను చూపించింది. .

వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి, ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతి విధానం, 2018 ను ప్రకటించింది, ఇది పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి పంటల ఎగుమతి-కేంద్రీకృత వ్యవసాయం కోసం క్లస్టర్ ఆధారిత విధానాన్ని అందిస్తుంది, తద్వారా నిర్దిష్ట వ్యవసాయ ఉత్పత్తుల కోసం క్లస్టర్లను గుర్తిస్తారు. దేశవ్యాప్తంగా మరియు ఈ క్లస్టర్లలో కేంద్రీకృత జోక్యం జరుగుతుంది.

వ్యవసాయం / ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతిని పెంచడానికి ఎపిడా ఆధ్వర్యంలో ఎనిమిది ఎగుమతి ప్రోత్సాహక ఫోరమ్‌ల (ఈపిఎఫ్)ను ఏర్పాటు చేశారు. అరటి, ద్రాక్ష, మామిడి, దానిమ్మ, ఉల్లిపాయ, పాడి, రైస్ బాస్మతి మరియు రైస్ నాన్-బాస్మతిపై ఇపిఎఫ్‌లు ఏర్పాటవుతాయి . ఈ ఎగుమతులను ప్రపంచ మార్కెట్‌కు గణనీయంగా పెంచడానికి, వివిధ జోక్యాల ద్వారా, ఎగుమతి యొక్క మొత్తం ఉత్పత్తి / సరఫరా గొలుసు అంతటా వాటాదారులను గుర్తించడానికి, డాక్యుమెంట్ వివరాలను మరియు వాటాదారులను చేరుకోవడానికి ఈపిఎఫ్ సమగ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవలే ప్రభుత్వం వ్యవసాయ వ్యాపార పర్యావరణాన్ని మెరుగుపరచడానికి రూ.1 లక్షల కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ ఏర్పాటును ప్రకటించింది. ఇది వ్యవసాయ ఎగుమతిని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, డిఏసి, ఎఫ్డబ్ల్యూ వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక / వ్యూహాన్ని కూడా సిద్ధం చేసింది. విలువ పెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు దిగుమతి ప్రత్యామ్నాయం కోసం వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికతో అగ్రి ఎగుమతిని పెంచడానికి నిర్దేశించింది. 

                                                                             ******



(Release ID: 1663409) Visitor Counter : 205