యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఒలింపిక్ షూటర్ల కోసం శిక్షణ శిబిరం‌‌ ఢిల్లీలోని కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో రెండు నెలలపాటు కోచింగ్ అనుమంతించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా



Posted On: 08 OCT 2020 7:36PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు ఒలింపిక్ కోర్ గ్రూప్ షూటర్స్ కోసం రెండు నెలల శిక్షణ శిబిరం జరుగుతుంది. ఈ శిక్షణ శిబిరంలో 32 మంది షూటర్లు (18 మంది పురుషులు, 14 మంది మహిళలు), 8 మంది కోచ్‌లు, ముగ్గురు విదేశీ  కోచ్‌లు, ఇద్దరు సహాయక సిబ్బంది పాల్గొంటారు. కోటీ 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో మొత్తం 15 ఒలింపిక్ కోటా విజేతలు పాల్గొంటారు. ఒలింపిక్స్ సన్నాహకాల్లో అంతర్భాగంగా ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ఎంతో అవసరమని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాల ప్రకారమే ఈ శిక్షణ శిబిరం జరుగుతోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.  ‘‘2018 ప్రపంచ ఛాంపియన్షిప్లో రజత పతకం విజేత రైఫిల్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ టోక్యో ఒలింపిక్ కోటాను గెలిచి, శిబిరానికి రావడం చాలా సంతోషంగా ఉంది. తాను ఏ స్థాయిలో ఉన్నానో అంచనా వేసుకునేందుకు ఆమెకు కూడా ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్కు పదినెలల సమయం మాత్రమే ఉన్నందున శిక్షణ శిబిరం నిర్వహించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. శిబిరం వాతావరణంలో క్రమం తప్పకుండా చేసే షూటింగ్ ప్రాక్టీస్తో ప్రస్తుతం మనం ఏ స్థానంలో ఉన్నామనే విషయమై ఓ అవగాహన కూడా వస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా షూటర్లు తమ ఇంటి ఆవరణలోనే ఇన్నాళ్లూ ప్రాక్టీస్ చేశారు. లాక్డౌన్ తర్వాత పూర్తిస్థాయి శిక్షణ శిబిరం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ శిబిరంలో జాతీయస్థాయి కోచ్లు క్రీడాకారుల పురోగతిని పర్యవేక్షించడంతోపాటు అథ్లెట్లకూ తమ సంసిద్ధతపై ఓ అవగాహన ఏర్పడుతుంది”అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. జాతీయస్థాయి కోచ్లు హాజరవుతున్న ఈ శిబిరంలో పాల్గొనేందుకు పురుషుల ఎయిర్ రైఫిల్‌లో ప్రపంచ నంబర్ వన్ అథ్లెట్ దివ్యాన్ష్ సింగ్ పన్వర్ ఎదురుచూస్తున్నారు. “లాక్డౌన్లోనూ నేను సరైన శిక్షణ పొందుతున్నప్పటికీ మిగతా షూటర్లందరితో కలిసి శిక్షణ శిబిరంలో పాల్గొనడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జాతీయస్థాయి కోచ్లు నా సంసిద్ధతను పర్యవేక్షించడం కూడా నాకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాను’ అని దదివ్యాన్ష్ పేర్కొన్నాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రణీందర్ సింగ్ మాట్లాడుతూ.. మా షూటర్లు లాక్డౌన్ సమయంలో ఇంట్లో శిక్షణ పొందుతున్నారు. కానీ ఇలాంటి  ఒక శిబిరంలో శిక్షన వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు నెలల శిక్షణ కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చొరవ చూపడం సంతోషంగా ఉందన్నారు.  లాక్డౌన్కు ముందు మా షూటర్ల నుంచి ఆశించిన స్థాయి ప్రదర్శనను అందుకోవడానికి ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. టోక్యో ఒలింపిక్స్ షూటింగ్‌లో భారత్ రికార్డు స్థాయిలో 15 కోటాలు గెలుచుకోగా.. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా మరిన్ని కోటాలను పొందే అవకాశం ఉంది. 

***



(Release ID: 1663128) Visitor Counter : 140