హోం మంత్రిత్వ శాఖ
వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్ వాన్ దుఃఖదాయక మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రిమండలి
దివంగత ప్రముఖునికి అధికార లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణ
Posted On:
09 OCT 2020 12:20PM by PIB Hyderabad
వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్ వాన్ దుఃఖదాయకమైన మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపాన్ని వ్యక్తం చేసింది
శ్రీ రామ్ విలాస్ పాస్ వాన్ స్మృతి లో కేంద్ర మంత్రివర్గం రెండు నిమిషాల సేపు మౌనాన్ని కూడా పాటించింది.
శ్రీ రామ్ విలాస్ పాస్ వాన్ కు అధికార లాంఛనాల తో అంత్యక్రియలు జరపడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ కింద ప్రస్తావించిన తీర్మానానికి మంత్రిమండలి ఈ రోజు న ఆమోదం తెలిపింది:
“వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్ వాన్ దుఃఖదాయకమైన మృతి పట్ల మంత్రిమండలి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది.
ఆయన మరణంతో దేశ ప్రజలు ఒక ప్రసిద్ధ నేత ను, పార్లమెంట్ సభ్యులలో ప్రముఖుడైన ఒక సభ్యుడిని మరియు ఒక పరిపాలన దక్షుడిని కోల్పోయారు.
శ్రీ రామ్ విలాస్ పాస్ వాన్ బిహార్ లోని ఖగరియా జిల్లా షహర్ బన్నీ లో 1946 సంవత్సరంలో జులై 5 న జన్మించారు. ఆయన ఖగరియా లోని కోసీ కళాశాలలో, పట్ నా లోని పట్ నా విశ్వవిద్యాలయం లో చదువుకున్నారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్ స్ (ఎం.ఎ.)పట్టాను, న్యాయ శాస్త్రం లో పట్టభద్రత (ఎల్ఎల్.బి.) ని ఆయన పొందారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఝాంసీ లోని బుందేల్ ఖండ్ విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్. ( ఆనరిస్ కాజా ) పట్టాను కూడా ఆయన అందుకొన్నారు.
బిహార్ గడ్డ మీద పుట్టిన, అత్యంత ప్రజాదరణ పాత్రులైన నేతల లో శ్రీ రామ్ విలాస్ పాస్ వాన్ ఒకరు. ఆయన కు సామాన్య ప్రజానీకం నుంచి బలమైన మద్ధతు లభించింది. 1969 లో సంయుక్త సోషలిస్టు పార్టీ సభ్యునిగా ఆయన బిహార్ రాష్ట్ర విదాన సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1977 లో రికార్డు సంఖ్యాధిక్యం తో హాజీపుర్ నుంచి 6వ లోక్ సభ సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. శ్రీ పాస్ వాన్ 1980 లో 7వ లోక్ సభ కు, 1984 లో 8వ లోక్ సభకు కూడా మళ్ళీ ఎన్నికయ్యారు. 1989లో 9వ లోక్ సభ కు కూడా ఆయన ఎన్నికైనప్పుడు ఆయనను కార్మిక, సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి పదవి లో నియమించారు. 1996 లో ఆయన రైల్వేల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి, 1998 వరకు ఆ పదవీ బాధ్యతలను నిర్వహించారు. అటు తరువాత, 1999 అక్టోబరు మొదలుకొని 2001 సెప్టెంబర్ మధ్య కాలంలో కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా ఆయన సేవలను అందించారు. 2001 సెప్టెంబర్ నెలలో ఆయనకు బొగ్గు, గనులు శాఖ బాధ్యతల ను అప్పగించడం జరిగింది. ఈ పదవిని ఆయన 2002 ఏప్రిల్ వరకు నిర్వహించారు. 2004 లోక్ సభ ఎన్నికల తరువాత శ్రీ పాస్ వాన్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం లో చేరారు. అప్పుడు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి, ఉక్కు శాఖ మంత్రి పదవులను ఆయన కు అప్పగించారు.
శ్రీ పాస్ వాన్ 2014 లో 16వ లోక్ సభ కు ఎన్నికై, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి గా పని చేశారు. 2019 లో శ్రీ పాస్ వాన్ ను రాజ్య సభ కు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆయన వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పదవి లో కొనసాగారు.
అణచివేత కు లోనైన వర్గాల వారి తరఫున శ్రీ పాస్ వాన్ తన వాణిని వినిపించేవారు. సమాజం లో ఆదరణకు నోచుకోని వర్గాల వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన సదా పోరాటం జరుపుతూ వచ్చారు.
శోకతప్తులైన శ్రీ పాస్ వాన్ కుటుంబానికి యావత్తు దేశ ప్రజల పక్షాన, ప్రభుత్వం తరఫున మంత్రిమండలి తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తోంది.’’
***
(Release ID: 1663070)
Visitor Counter : 107