వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ప్రస్తుత కెఎంఎస్ 2020-21లో వరి సేకరణలో 33% పెరుగుదల

సుమారు 1.7 లక్షల మంది రైతుల నుండి ఎంఎస్‌పిపై మొత్తం 20.37 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరించారు

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020 కోసం ఆహార ధాన్యాలు, నూనె గింజల సేకరణకు అనుమతి ఇచ్చారు .

Posted On: 08 OCT 2020 5:48PM by PIB Hyderabad

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2020-21 రాక ఇప్పటికే ప్రారంభమైంది. మునుపటి సీజన్లలో చేసినట్లుగా ప్రస్తుతమున్న ఎంఎస్పి పథకాల ప్రకారం ప్రభుత్వం రైతుల నుండి ఎంఎస్పి వద్ద ఖరీఫ్ 2020-21 పంటలను సేకరిస్తూనే ఉంది. కేరళ వంటి కొన్ని ఇతర రాష్ట్రాల్లో సేకరణ ప్రారంభం కావడం మరియు కొనసాగుతున్న సేకరణ రాష్ట్రాలలో వేగం పెరగడంతో కెఎంఎస్ 20-21 కోసం వరి సేకరణ ఇప్పుడు మంచి ఊపందుకుంది, దీని ఫలితంగా మొత్తం 1.7 లక్షల మంది రైతుల నుండి 20,37,634 మెట్రిక్ టన్నుల వరి సేకరణ జరిగింది. ఎంఎస్పి విలువ 3847.05 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇపుడు ఇది 33% పైగా పెరిగింది.

ఇంకా, రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు  ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020 కోసం 30.70 ఎల్ఎంటి ఆహారధాన్యాలు, నూనె గింజలను సేకరించడానికి అనుమతి లభించింది. . అదనంగా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్ఎంటి కొప్రా (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. 

07.10.2020 వరకు, ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 376.65 మెట్రిక్ టన్నుల రూ. 2.71 కోట్లు ఎంఎస్‌పి విలువ పేసర్లును  తమిళనాడు, హర్యానాలో 269 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాయి. అదేవిధంగా రూ.52.40 కోట్ల ఎంఎస్పి విలువ గల , 5089 మెట్రిక్ టన్నుల కొప్రా కర్ణాటక, తమిళనాడులలో 3961 మంది రైతులకు లబ్ది చేకూర్చింది. కోప్రా మరియు మినపకు సంబంధించి, రేట్లు ఎంఎస్పి వద్ద లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. పేసర్లు మరియు ఇతర ఖరీఫ్ పప్పుధాన్యాలు మరియు నూనె గింజలకు సంబంధించి సేకరణ ప్రారంభించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో విత్తన పత్తి (కపాస్) సేకరణ 2020 అక్టోబర్ 1 నుండి ప్రారంభమైంది మరియు 2020 అక్టోబర్ 7 న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 753 మంది రైతులకు లబ్ధి చేకూర్చే 994.28 లక్షల రూపాయల విలువతో ఎంఎస్‌పి కింద 3525 బేళ్లను కొనుగోలు చేసింది.

 

****


(Release ID: 1662929) Visitor Counter : 136