శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

బారాపుల్లా డ్రెయిన్ సైట్ వద్ద "డి.బి.టి-బి.ఐ.ఆర్.ఏ.సి. క్లీన్ టెక్ డెమో పార్కు" ను ప్రారంభించిన - డాక్టర్ హర్ష వర్ధన్

"మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి కోసం అభివృద్ధి చేసిన ఈ నూతన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను, స్వచ్ఛ భారత్ మరియు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహించాలి": డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 08 OCT 2020 5:05PM by PIB Hyderabad

న్యూఢిల్లీ లోని సరాయ్ కాలే ఖాన్, సన్ డయల్ పార్క్ సమీపంలో, బారాపుల్లా డ్రెయిన్ సైట్ వద్ద “డి.బి.టి-బి.ఐ.ఆర్.సి. క్లీన్ టెక్ డెమో పార్కు” ను, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజాల్ సమక్షంలో, కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు భూ విజ్ఞాన శాస్త్రాల శాఖల మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ప్రారంభించారు. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో, డి.బి.టి. కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ తో పాటు ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ “ఈ క్లీన్ టెక్ డెమో పార్కు ఆవిష్కర్తలకు / పెట్టుబడిదారులతో పాటు విద్యార్థులకు మరియు సాధారణ ప్రజలకు కూడా వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం స్వచ్ఛమైన సాంకేతిక పరిష్కారం గురించి అవగాహన మరియు ప్రాచుర్యం పొందటానికి మంచి ఆకర్షణగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.  "మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి కోసం అభివృద్ధి చేసిన ఈ నూతన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను, స్వచ్ఛ భారత్ మరియు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహించాలి, అదేవిధంగా వాటి వాణిజ్యీకరణ మరియు స్వీకరణను నిర్ధారించడానికి విస్తృతంగా ప్రచారం చెయ్యాలి", అని  కూడా ఆయన సూచించారు. 

లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్ మాట్లాడుతూ, డి.బి.టి. చేపట్టిన ఈ ప్రయత్నాన్ని స్వాగతించారు. భూమి మరియు నీరు ముఖ్యమైన సహజ వనరులని ఆయన పేర్కొంటూ, ఈ విలువైన వనరులు రక్షించబడతాయని నిర్ధారించడానికి బయోటెక్నాలజీ విభాగం చేపట్టిన చర్యలకు డి.డి.ఏ. బలమైన మద్దతునిస్తుందని హామీ ఇచ్చారు. 

డి.బి.టి. కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ, వ్యర్ధాల నుండి విలువను పెంపొందించే ఈ క్లీన్ టెక్నాలజీ పార్కు, ఈ సాంకేతికతల సాధ్యాసాధ్యాలను ప్రదర్శించడానికి, జీవ సాంకేతిక విభాగం చేపట్టిన ఒక ముఖ్యమైన ప్రయత్నమని పేర్కొన్నారు. ఇది పెద్ద ఎత్తున సాంకేతిక విస్తరణ కోసం స్థానిక సంస్థలు మరియు ఇతర వాటాదారులతో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

డి.బి.టి-బి.ఐ.ఆర్.ఏ.సి. క్లీన్ టెక్ డెమో పార్కు భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డి.బి.టి) మరియు డి.బి.టి. ఆధ్వర్యంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయిన జీవ సాంకేతిక పరిశ్రమల పరిశోధనల సహాయ మండలి (బి.ఐ.ఆర్.ఏ.సి) ల సహకారంతో వినూత్న వేస్ట్-టు-వాల్యూ టెక్నాలజీలను ప్రదర్శించడానికి ఉపయోగించబడుతుంది.  ఈ పార్కును క్లీన్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్ (సి.ఈ.ఐ.ఐ.సి) నిర్వహిస్తుంది. ఇది డి.బి.టి, బి.ఐ.ఆర్.ఏ.సి. మరియు టాటా పవర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్య ఇంక్యుబేటర్. 

డి.బి.టి. మరియు బి.ఐ.ఆర్.ఏ.సి. సహకారంతో, స్వచ్ఛ భారత్ దృష్టికి తోడ్పడటానికి ఉద్దేశించిన కొన్ని ఇతర వ్యర్థ శుద్ధి సాంకేతికతలను కూడా  ఈ సందర్భంగా ఆన్ లైన్ లో ప్రదర్శించారు. 

స్వచ్ఛమైన వ్యర్థాల నుండి విలువైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, ప్రదర్శన, ప్రచారం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద, బయో-మెథనేషన్, నిర్మించిన తడి భూములు, ఆల్గల్ ట్రీట్మెంట్ మరియు నీటి పొర వడపోతతో సహా అనేక వినూత్నకార్యక్రమాలను డి.బి.టి. చేపట్టింది.  బారాపుల్లా నల్లా నుండి తేలియాడే వ్యర్ధాలను శుభ్రపరిచేందుకు డెన్మార్కు ‌తో కలిసి డి.బి.టి-డి.ఈ.ఎస్.ఎం.ఐ. ప్రాజెక్టు, అదేవిధంగా, నెదర్లాండ్సు సహకారంతో లోటస్-హెచ్.ఆర్. ప్రాజెక్టు లను ఇప్పటికే బారాపుల్లా ప్రాంతంలో విజయవంతంగా ప్రదర్శించారు. దేశంలోని వివిధ ప్రదేశాలలోని అంకుర సంస్థలు అభివృద్ధి చేసిన సాంకేతికతలను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు.  

*****


(Release ID: 1662870) Visitor Counter : 206