భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

తుపానుకు మందు జాగ్రత్తలు, సన్నద్ధతపై వాతావరణ శాఖ ఆన్.లైన్ సమీక్ష

అక్టోబరు-డిసెంబరు సీజన్.కు ఐ.ఎం.డి.కసరత్తు

“వాతావరణ ప్రతికూలతలను పసిగట్టడం, తుపాను గమనాన్ని, తీరం చేరికను గుర్తించడం, పరిస్థితి తీవ్రతపై అంచనా, భారీ వర్షాలు, పెనుగాలులు, తుపాను వేగం, తీవ్రత వంటి వాటిని ముందుగా పసిగట్టడంలో వాతావరణ విభాగం పనితీరు ఎంతో గణనీయంగా మెరుగుపడింది.”

Posted On: 08 OCT 2020 9:05AM by PIB Hyderabad

  తుపాను సీజన్.కు ముందస్తు సన్నద్ధతపై భారత వాతావరణ విభాగం (.ఎం.డి.) ఒక ఆన్ లైన్ సమావేశాన్ని 2020, అక్టోబరు 6న నిర్వహించింది. వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్, డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అక్టోబరునుంచి డిసెంబరు వరకు తుపానులకు ఆస్కారం ఉన్నందున తుపాను సీజనుకు ముందు సన్నద్ధతను, అవసరమైన ఏర్పాట్లను, తుపాను సీజన్ ప్రణాళికను సమీక్షించేందుకు, ఇందుకు తీసుకోవలసిన చర్యలపై భాగస్వామ్య వర్గాలతో అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సమావేశం నిర్వహించారు.  .ఎం.డి., జాతీయ మధ్య శ్రేణి వాతావరణ సూచనా వ్యవస్థ (ఎన్.సి.ఎం.ఆర్.డబ్ల్యు.ఎఫ్.), భారతీయ వైమానిక దళం (..ఎఫ్.), భారతీయ నావికాదళం (.ఎన్.), కేంద్ర జల సంఘం (సి.డబ్ల్యు.సి.), ఢిల్లీ ఐ..టి., సముద్ర సేవల సమాచార జాతీయ కేంద్రం (ఇన్కాయిస్), జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా సంస్థ (ఎన్.డి.ఎం..), జాతీయ వైపరీత్యాల ప్రతిస్పందనా దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్.), మత్స్య శాఖ, భారతీయ రైల్వే శాఖ తదితర శాఖల, సంస్థల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

   ప్రారంభోన్యాసంలో ఐ.ఎం.డి. డైరెక్టర్ జనరల్ మహాపాత్ర మాట్లాడుతూ, వాతావరణ సూచన స్థాయినుంచి, చిట్ట చివరి దశలో అనుసంధానం వరకూ పలు అంశాలను ప్రస్తావించారు. పనితీరు మెరుగుపరుచుకోవలసిన ఆవశ్యకత ఉన్న అంశాలను కూడా చర్చించారు. వాతావరణంలో ప్రతికూల మార్పులను పసిగట్టడం, తుపాను తీరందాటి తాకే భూభాగాన్ని ముందస్తుగా గుర్తించడం, పరిస్థితి తీవ్రతపై అంచనా, భారీ వర్షాలు, పెనుగాలులు, తుపాను గమనం, వేగం, తీవ్రత వంటి అంశాలను ముందస్తుగా పసిగట్టడంలో వాతావరణ విభాగం పనితీరు గణనీయంగా మెరుగుపడిందని ఆయన అన్నారు. రాబోయే తుపాను సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు సూచన, తీవ్రతపై అంచనా వంటి అంశాలపై ప్రతిస్పందనా శైలిలో తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.

   ఐ.ఎం.డి. వివిధ పేర్లతో ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్లను (యాప్ లను) గురించి ఆయన భాగస్వామ్య వర్గాలకు తెలియజేశారు. పిడుగు పడే ఆస్కారం ఉన్న చోటుపై ముందస్తుగా సూచనలు చేసే దామిని, తుపాను హెచ్చరికతో సహా వాతావరణ సూచనను అందించే మౌసమ్, ఉమంగ్, వ్యవసాయానికి సంబంధించిన వాతావరణ సలహాలకోసం మేఘదూత్ తదితర యాప్ లను ఆయన ఉదహరించారు. తుపానుపై అప్రమత్తతా సందేశాల కోసం ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం (ఆర్.ఎస్.ఎం.సి.)వెబ్ సైట్ (www.rsmcnewdelhi.imd.gov.in )ఉచితంగా అందిస్తున్న రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని గురించి ఆయన తెలిపారు.

   గతం తపానుల అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుని అప్పటి తప్పులు, పొరపాట్లు పునరావృతం కాకుండా సన్నద్ధత పెంచుకోవాలని అన్నారు. తుపానులలో ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించుకునేందుకు,  వైఫల్యాలకు తావులేని నిఖార్సైన ప్రతిస్పందనా యంత్రాగాన్ని రూపొందించుకోవాలని ఆయన భాగస్వామ్య వర్గాలకు సూచించారు.

  .ఎం.డి. తుపాను హెచ్చరికల విభాగం ప్రధాన అధికారి సునీతా దేవి మాట్లాడుతూ, ఇటీవల, గతంలో తుపానులపై ముందస్తు సూచనలు చేయడంలో ఆర్.ఎస్.ఎం.సి. తన బాధ్యతలను నిర్వహించిన తీరును, ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్ ప్రణాళిలను, గతంలో తీసుకున్న చర్యలను వివరించారు. ఇటీవల సంవత్సరాల్లో పటిష్టమైన ముందస్తు హెచ్చరికలతో తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలు కల్గించిన ఐ.ఎం.డి.ని ఈ సమావేశంలో భాగస్వామ్య వర్గాలవారు ప్రశంసించారు. ఇక ముందు పనికివచ్చే తమ సలహాలు, సూచనలు కూడా ఐ.ఎం.డి.కి అందించారు

*****




(Release ID: 1662693) Visitor Counter : 124