వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశాన్ని తమ తదుపరి పెట్టుబడి గమ్యస్థానంగా చూడాలని శ్రీ పియూష్ గోయల్ అమెరికన్ వ్యాపారాలకు పిలుపు
భారతదేశం నేడు గతం నుండి అధిక-నాణ్యత ఉత్పత్తులు, ప్రపంచ స్థాయిలో అధిక భాగస్వామ్య పాత్ర, మరియు ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ వాటా వంటి ఆలోచనలలోకి మారుతోంది: శ్రీ గోయల్
Posted On:
08 OCT 2020 9:33AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ మరియు రైల్వే మంత్రి శ్రీ పియూష్ గోయల్ అమెరికన్ వ్యాపారాలను ప్రధానమంత్రి దార్శనికతలో భాగం కావాలని ఆహ్వానించారు మరియు భారతదేశాన్ని వారి తదుపరి పెట్టుబడి గమ్యస్థానంగా చూడాలని కోరారు. గ్లోబల్ ఫైనాన్షియల్ & ఇన్వెస్ట్‌మెంట్ లీడర్‌షిప్‌పై బుధవారం ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ యుఎస్‌ఎ యొక్క సదస్సులో ప్రసంగించిన ఆయన, ధైర్యంగా, భేషజాలు లేకుండా, ఒక మార్పు కోరుకొనేలా ఉండటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. “ఏకత్వం అనే స్ఫూర్తితో కలిసి పనిచేద్దాం. ఒకరితో ఒకరు పరస్పరం చర్చించుకుందాం, అమెరికా మరియు భారత ప్రజల భాగస్వామ్య శ్రేయస్సు కోసం మనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ” అని శ్రీ గోయల్ చెప్పారు.
రాబోయే సంవత్సరాల్లో యుఎస్-ఇండియా సంబంధం మరింత పటిష్టంగా పెరుగుతుందని పేర్కొన్న శ్రీ గోయల్, తాము శాశ్వత సంబంధాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ ఆధ్వర్యంలో తీసుకున్న భారీ సంస్కరణ చర్యలపై యుఎస్ & ఇండియా కలిసి పనిచేయడానికి మన ముందు సుదీర్ఘ ప్రయాణం ఉందని ఆయన అన్నారు. అమెరికా, భారతదేశం మధ్య సంభావ్యత అనంతమని ఆయన అన్నారు. "మేము ఒకరినొకరు విశ్వసించే భాగస్వాములు,పాలన-ఆధారిత వర్తకం & సంభాషణలు ఉన్న చోట పారదర్శకంగా ఉండే దేశంతో కలిసి పనిచేయడానికి అమెరికన్ వ్యాపారాలకు విశ్వసనీయమైన మూలాన్ని అందించడానికి మేము వేగంగా అడుగులు వేయవచ్చు. యుఎస్, ఇండియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2017 లో 126 బిలియన్ డాలర్ల నుండి 2019 లో 145బిలియన్ డాలర్లకు పెరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో 500 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము" అని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది సంప్రదాయిక విధానానికి సమయం కాదని, ధైర్యమైన నిర్ణయాలు మరియు ధైర్యమైన పెట్టుబడులకు ఇది సమయం అని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం చాలా సమగ్రమైన విధానాన్ని కలిగి ఉందని శ్రీ గోయల్ అన్నారు. “మేము రెడ్ టేప్ (సాచివేత ధోరణి) నుండి రెడ్ కార్పెట్ వైపు వెళ్తున్నాము. మేము గత సంకెళ్ళ నుండి మరింత బహిరంగ & ఉదారవాద విదేశీ పెట్టుబడి గమ్యస్థానానికి వెళ్తున్నాము. ప్రధానమంత్రి చెప్పినట్లుగా, "మేము భారత ఆర్థిక వ్యవస్థను కమాండ్ & కంట్రోల్ నుండి తీసివేసి ప్లగ్ & ప్లే వైపు తీసుకోవాలి." అని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
దేశంలో జరుగుతున్న సంస్కరణలను వివరిస్తూ, “భారత పాలనా వ్యవస్థలను, మైనింగ్, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు, కార్మిక, వ్యవసాయ సంస్కరణల చుట్టూ ఉన్న విధానాలు, చట్టాలను సంస్కరించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లే కొత్త ప్రయాణానికి మేము బయలుదేరాము. లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడానికి మేము లాజిస్టిక్స్ సంస్కరణను చూస్తున్నాము. మేము అనేక పన్ను సంస్కరణలు చేస్తున్నాము. మాకు దివాలా చట్టాలు ఉన్నాయి. భారతదేశ కార్పొరేట్ పన్ను ప్రపంచంలో అతి తక్కువ. నా స్వంత మంత్రిత్వ శాఖ 'ప్లగ్ & ప్లే' & క్లస్టర్ అభివృద్ధిలో పనిచేస్తోంది. కంపెనీలు, వ్యాపారాలు భారతదేశంలో పనిచేయడం సులభతరం చేసే నిజమైన సింగిల్-విండో వ్యవస్థను మేము చూస్తున్నాము. మేము మెరుగైన మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నాము. మౌలిక సదుపాయాలు సులభంగా లభిస్తామని హామీ ఇస్తున్నాము." అని చెప్పారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఎం. పోంపీయో, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్జె జయశంకర్ మధ్య టోక్యోలో జరిగిన ద్వైపాక్షిక చర్చలు క్యూయుఏడి మధ్య దృష్టి పెట్టాయని, భారత-అమెరికా మధ్య 3వ 2+2 చర్చలు ఈ నెల 26,27 తేదీల్లో జరగనున్నాయని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు.
***
(Release ID: 1662691)
Visitor Counter : 124