పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
స్టాక్‌హోం ఒప్పందం కింద జాబితాలో ఉంచిన ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే ఏడు రసాయనాల నిషేధంపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర మేం ఆరోగ్య, పర్యావరణ హానిని సహించం అనే సానుకూల సందేశాన్ని ప్రపంచానికి భారత్ పంపుతోంది - ప్రకాష్ జావ్‌దేకర్
Posted On:
07 OCT 2020 5:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బుధవారంనాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం స్టాక్‌హోం ఒప్పందం జాబితాలో పేర్కొన్న శాశ్వత ప్రభావం చూపే ఏడు సేంద్రీయ కాలుష్య కారకాల (పిఒపి) నిషేధాన్ని ఆమోదించింది.
ఈ నిర్ణయంతో ఈ రంగంలో తాము చురుకుగా ఉన్నామని, అనారోగ్య, కాలుష్య కారకాలను భారత్ సహించదనే సానుకూల సందేశాన్ని ప్రపంచానికి ఇస్తున్నామని, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావ్‌దేకర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
శాశ్వత ప్రభావం చూపే సేంద్రీయ కాలుష్య కారకాల నుంచి మానవాళి ఆరోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చేసుకున్న ఒప్పందమే స్టాక్‌హోం ఒప్పందం. పర్యావరణంలో, జీవరాశులలో శాశ్వతంగా నిలిచిపోయి ప్రభావాన్ని చూపే రసాయన పదార్ధాలే ఈ పిఒపిలు. ఇవి మానవుల/ పర్యావరణ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపడమే కాక సుదూరంగా ఉన్న పర్యావరణానికి కూడా రవాణా అయ్యే లక్షణాన్ని కలిగి ఉన్నాయి.
ఈ పిఒపిల ప్రభావానికి గురయ్యేవారికి కాన్సర్‌కు, కేంద్ర, ఉపరితల నరాల వ్యవస్థకు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, పునరుత్పత్తిలో లోపాలు రావడమే కాక, సాధారణ శిశువు, బాలల అభివృద్ధిలో లోపాలను తలెత్తేలా చేస్తాయి. లోతైన శాస్త్రీయ పరిశోధన, సభ్య దేశాలతో చర్చలు, సంప్రదింపుల అనంతరం స్టాక్‌హోం ఒప్పందానికి సంబంధించిన వివిధ అనుబంధాలలో ఈ పిఒపిల జాబితాను చేర్చారు.
సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం, ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడిన అంశాన్ని పరిగణిలోకి తీసుకుని పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986లోని వివిధ అంశాల కింద శాశ్వత సేంద్రీయ కాలుష్య కారకాల క్రమబద్ధీకరణ నిబంధనలను 2018, మార్చి 5వ తేదీన పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నిబంధనల కింద ఏడు రసాయనాలను - 1. క్లోర్‌డికోన్ 2. హెక్సాబ్రొమోబిఫెనిల్ 3. హెక్సాబ్రొమోబిఫెనిల్ ఎథర్, హెక్సాబ్రొమోబిఫెనిల్లెథర్ (వాణిజ్యపరమైన ఆక్టా -బి.డి.ఇ), 4. టెట్రాబ్రొమోడిఫెనిల్ ఎథర్, పెంటాబ్రొమోడిఫెనిల్ ఎథర్ (వాణిజ్యపరంగా పెంటా బి.డి.ఇ.), 5. పెంటాక్లోరో బెంజీన్ 6. హెక్సాబ్రోమోసైక్లోడోడికేన్, 7. హెక్సాక్లోరోబుటాడీన్ల ఉత్పత్తి, వాణిజ్యం, వినియోగం, దిగుమతి, ఎగుమతులను నిషేధించారు. ఇవన్నీ స్టాక్‌హోం ఒప్పందం కింద పేర్కొన్న పిఒపిల జాబితాలో చేర్చినవే.
కేంద్ర కేబినెట్ పిఒపిల నిషేధాన్ని ఆమోదించడం అన్నది మానవాళి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తన అంతర్జాతీయ విధుల నిర్వహణలో భారత్ నిబద్ధతను పట్టి చూపుతుంది. నియంత్రణ చర్యలను అమలు చేయడం, ఉద్దేశ రహితంగా ఉత్పత్తి చేసిన రసాయనాల కోసం కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేసి అమలు చేయడం, రసాయనాల నిల్వలకు సంబంధించిన జాబితాను రూపొందించి, వాటిని సమీక్షించి, జాతీయ అమలు ప్రణాళిక (ఎన్ఐపి)తాజా పరచడం ద్వారా పిఒపిలపై చర్య తీసుకోవాలన్న ప్రభుత్వ పట్టుదలను సూచిస్తుంది. ఈ ఆమోద ప్రక్రియ తన ఎన్ ఐపని తాజాపరచేందుకు అంతర్జాతీయ పర్యావరణ సదుపాయం (గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటి -జిఇఎఫ్) నుంచి ఆర్ధిక వనరులను భారత్ వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఇప్పటికే దేశీయ నిబంధనల కింద క్రమబద్ధీకరించిన పిఒపిలను స్టాక్‌హోం ఒప్పందం కింద పేర్కొన్న రసాయనాలను ఆమోదించే అధికారాలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పు శాఖలకు బదలాయిస్తూ తద్వారా ఈ విధాన క్రమబద్ధీకరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
భారత దేశం 2006, జనవరి 13వ తేదీన ఆర్టికల్ 25(4) కింద స్టాక్‌హోం ఒప్పందాన్ని ఆమోదించింది. ఇది ఈ ఒప్పందంలోని అనేక అనుబంధాలలో చేసిన సవరణలను - ఒప్పందం/ అనుమతి/ ఆమోదం లేక విలీనత అనేవి బహిరంగంగా ఐక్యరాజ్య సమితిలో ఉంచితే తప్ప తనపై సహజప్రకియలా రుద్దడానికి వీలులేకుండా వైదొలగగల స్థితిలో భారత్‌ను నిలుపుతుంది.
***
(Release ID: 1662493)