గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

హిమాచల్ ప్రదేశ్ 1,567 సీట్లను నిర్మించడం ద్వారా 876 సిటి/పిటి సీట్ల లక్ష్యాన్ని అధిగమించింది

ఉత్తరాఖండ్ లక్ష్యం 2,611కాగా 20,750 ఐహెచ్‌హెచ్‌ఎల్‌లు & 4,642 సిటి / పిటి సీట్లను నిర్మిస్తోంది

హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రతి ఇంటినుండి 100% ఘనవ్యర్ధాలను సేకరిస్తున్నాయి
98% వ్యర్థాలు హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రాసెస్‌ చేయబడుతున్నాయి

901.45 టిపిడి కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్తరాఖండ్‌లో ప్రాసెస్ చేస్తున్నారు

హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో పురోగతిని పట్టణ మిషన్ సమీక్షిస్తోంది.

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2020 12:38PM by PIB Hyderabad

కేంద్ర పట్టణ, గృహమంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీదుర్గా శంకర్ మిశ్రా గత నెలలో హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి/ ప్రిన్సిపల్ సెక్రటరీ/సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు. జీఎఫ్‌సీ ధృవీకరణ పొందటానికి రాష్ట్రాలు ఆయా నగరాల్లో చురుకైన చర్యలను చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నగరాలు, పట్టణాలు వాటిస్థితిని ఓడీఎఫ్ +, ఓడీఎఫ్++కు మెరుగుపరుచుకోవడంతో పాటు 2022 సంవత్సరం తొలి అర్ధభాగంలోనే త్రీస్టార్ జీఎఫ్‌సీ స్థాయి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

1,567 సీట్లను నిర్మించడం ద్వారా తమ రాష్ట్రం 876 సిటి / పిటి సీట్ల లక్ష్యాన్ని అధిగమించిందని ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక తమ రాష్ట్రం 2,611 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. 20,750 (75%) ఐహెచ్‌హెచ్‌ఎల్‌లు, 4,642 సిటి / పిటి సీట్లను నిర్మించిందని ఉత్తరాఖండ్ తెలిపింది. 369.46 టిపిడి (98%) వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ సమాచారం ఇవ్వగా, ఉత్పత్తి చేసిన వ్యర్థాలలో 901.45 టిపిడి ప్రాసెస్ చేయబడుతోందని ఉత్తరాఖండ్ వివరించింది. ఎంఐఎస్‌ను  క్రమం తప్పకుండా నవీకరించాలని శ్రీదుర్గా శంకర్ మిశ్రా సూచించారు.

తమ రాష్ట్రాల్లో 100 శాతం ఇళ్లనుండి ఘనవ్యర్ధాలను సేకరిస్తున్నామని హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 100% వార్డులలో వ్యర్థాలను వేరుచేయడం జరుగుతోందని, ఉత్తరాఖండ్‌లో అది 65% వార్డులలో ఉందని తెలిపారు. ఉత్తరాఖండ్‌ కూడా వందశాతం వ్యర్ధాలను వేరుచేసేవిధంగా లక్ష్యాన్ని చేరుకోవాలని కేంద్ర పట్టణ, గృహమంత్రిత్వశాఖ కార్యదర్శి కోరారు. ఆ విధంగా చేస్తే నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని చెప్పారు.

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం అమలు చేస్తోన్న అంబికాపూర్‌ మోడల్ వ్యర్ధాల నిర్వహణకు ఆదర్శనీయమైన ఉదాహరణ అని కేంద్ర పట్టణ, గృహమంత్రిత్వశాఖ కార్యదర్శితెలిపారు. అంబికాపూర్‌లో అమలవుతున్న పద్దతిని పరిశీలించేందుకు స్థానికసంస్థల ప్రతినిధులను అక్కడకు పంపాలని రాష్ట్రప్రభుత్వాలకు సూచించారు.

స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌-2021 వచ్చిన మార్పులను రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులకు ఈ సమీక్షలో  కేంద్ర పట్టణ, గృహమంత్రిత్వశాఖ కార్యదర్శి వివరించారు. కొత్త పురష్కారాన్ని 'ప్రేరక్‌ దౌర్ సమ్మన్‌'గా పిలుస్తారని చెప్పారు. ఈ పురస్కారానికి అర్హత ప్రమాణాలుగా వ్యర్థాలను వేరుచేయడం, తడి వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యం, వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం, నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం వంటివి ఉంటాయని తెలిపారు. నగరాల పారిశుద్ధ్య స్థితిని బట్టి 'దివ్య', 'అనుపమ్', 'ఉజ్జ్వాల్', 'ఉదిత్ ' మరియు 'అరోహి' పేర్లతో ర్యాంకులను ఇస్తామని అన్నారు. వ్యర్ధాలను ఎలా నిర్వహిస్తున్నారన్న దానిపైనే ఆ నగరం యొక్క భావన ఆధారపడి ఉంటుందని..అదే ఆ నగరాన్ని అందంగా మారుస్తుందని చెప్పారు. ఆ దిశగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని దిశానిర్దేశం చేశారు.ర్యాంకుల్లో కనీసం ఉజ్వాల్‌ను లక్ష్యంగా చేసుకోవాలని  కేంద్ర పట్టణ, గృహమంత్రిత్వశాఖ కార్యదర్శి
శ్రీదుర్గా శంకర్ మిశ్రా చెప్పారు.

శాస్త్రీయ వ్యర్థాల ప్రాసెసింగ్‌తో పాటు ఈ మిషన్‌ కింద చేపట్టిన చర్యలను ఈ సమావేశంలో రాష్ట్రాలు వివరించాయి.తమ  పనితీరును మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయా రాష్ట్రాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా  ఆయా రాష్ట్రాల కృషిని కేంద్ర పట్టణ, గృహమంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీదుర్గా శంకర్ మిశ్రా ప్రశంసించారు. ఈ చర్యలు ఆయా నగరాల పట్ల ప్రజల వైఖరిని మార్చడంతో పాటు ఆర్ధిక అవకాశాలను కూడా మరింత మెరుగుపరుస్తాయని చెప్పారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని..అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. అందుకు ఇండోర్ నగరమే ఉదాహరణనని చెప్పారు. ఇళ్ళు / హోటళ్ళు / పార్కులు / కళాశాలలు మరియు కార్యాలయాలనుండి సేకరించిన తడి/పొడి చెత్తలను స్థానికంగానే కంపోస్ట్‌ చేసి ఉపయోగించుకోవాలని సూచించారు. లక్షాలను నిర్దేశించుకోవడంతో పాటు వాటిని సాధించేందుకు నగరాలతో కలినిపనిచేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పట్టణ, గృహమంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీదుర్గా శంకర్ మిశ్రా సూచించారు.

***


(రిలీజ్ ఐడి: 1662489) సందర్శకుల సూచీ సంఖ్య : : 138
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi