నీతి ఆయోగ్

పీవీ ఉత్పత్తిపై ఆయోగ్,ఎం ఎన్ ఆర్ ఈ మరియు ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో సదస్సు సౌర ఉత్పత్తి రంగానికి ఇండియా పీవీ ఎడ్జ్ -2020 దన్ను

Posted On: 07 OCT 2020 2:18PM by PIB Hyderabad

సౌర విద్యుత్ ఫలకాల ఉత్పత్తికి భారతదేశంలో ఉన్న అవకాశాలను ప్రపంచ ఉత్పత్తిదారులకు వివరించడానికి  నీతి ఆయోగ్, కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రిత్వ శాఖలు ఇన్వెస్ట్ ఎడ్జ్ లు 2020 అక్టోబర్ 6 " ఇండియా పీవీ ఎడ్జ్ -2020 " సదస్సును నిర్వహించాయి.

సదస్సులో కేంద్ర ఇంధనం మరియు  పునరుత్పాదక శాఖ సహాయ ( స్వతంత్ర ) మంత్రి ఆర్ కే సింగ్ సౌర విద్యుత్ ఫలకా ఉత్పత్తికి భారత దేశంలో ఉన్న అవకాశాలను వివరించారు. " భారతదేశంలో  పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం కలిగివుంది. ప్రపంచంలోనే ఇది అత్యధికం.ఇంతేకాకుండా ఇంధన వినియోగం పెరుగుతూ వస్తున్నది. విద్యుత్ కు  అనుబంధంగా పునరుత్పాదక ఇంధన వనరులను సరఫరా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాలుష్యంలేని ఇంధనాన్ని సరఫరా చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 2030 నాటికి 450 gw విధ్యుత్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా  నిర్ణయించుకొన్నాము. సౌర మరియు  పునరుత్పాదక ఇంధన వనరులను గ్రిడ్ లకు అనుసంధానం చేస్తున్నాం. ఇంతేకాకుండా వంట ఇంటి అవసరాలకు విద్యుత్ వనరులను ఉపయోగించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఆత్మనిర్భర్ ను సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా 20 జిల్ ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడమే కాకుండా సెల్ ఉత్పత్తికి అనుమతులు జారీ చేసాంపునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి భారత దేశంలో ఉత్తమ అవకాశాలు ఉన్నాయి " అని మంత్రి అన్నారు.

    సదస్సులో దేశ విదేశాలకు చెందిన 60 సంస్థల సీఈఓలు పారగొన్నారు. వీరితోపాటు ప్రపంచంలో గుర్తింపు పొందిన పీవీ ఉత్పత్తిదారులు , పెట్టుబడిదారులు, నిపుణులు సదస్సుకు హాజరయ్యారు. చర్చల తరువాత సౌర విద్యుత్ రంగంలోకి పెట్టుబడులను సమీకరించాడానికి రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు.

   సౌర విద్యుత్ ఫలకాల తయారీలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి గల అవకాశాలను సదస్సులో  చర్చించారు.ఆధునిక పరిజ్ఞానంతో జాతీయ అంతర్జాతీయ సంస్థలు భారీ కర్మాగారాలను నెలకొల్పేలా చూడడానికి అవసమైన సౌకర్యాలను కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు.

    సదస్సులో పాల్గొన్న సంస్థల ప్రతినిధులు దేశంలో అధివృధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న అధికారుల ముఖాముఖీ చర్చలు జరిపారు.

   సౌర విధ్యుత్ ఉత్పత్తికి సంబంధించి సౌకర్యాలు కలిగివున్న దేశాలలో ప్రస్తుతం భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఎన్ డి సి నిర్ధేశించిన మూడు ప్రమాణాలను సాధిస్తున్న అతి కొద్దీ దేశాలలో భ్రాతదేశం స్థానం సంపాదించింది. శిలాజ రహిత ఇంధన వినియోగ సామర్ధ్యం లో 40 %, ఉద్గారాల విడుదలను 33 %- 35 %వరకు తగ్గించడం, 2030 నాటికి బొగ్గుపులుసు వాయువు విడుదలను 2 .5 నుంచి 3 మిలియన్ టన్నులకు తగ్గించాలన్న లక్ష్యంతో భారత దేశం పనిచేస్తున్నది.

   పచ్చధనాన్ని పెంపొంచడానికి గత దశాబ్ద కాలంగా జరుగుతున్నప్రయత్నాలలో సౌర్య విద్యుత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం సౌర విద్యుత్ ఫలకాల తయారీని కీలక అంశంగా గుర్తించింది.

    సమావేశంలో మూడు సదస్సులను నిర్వహించడం జరిగింది.ముఖ్య సదస్సులో విధాన నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తున్నవారు పాల్గొని పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, సౌర విద్యుత్  రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.

   " పీవీ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు ఊహించిన డానికంటే మెరుగ్గా వేగంగా వస్తున్నాయి. దీనివల్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.అతి పెద్ద మార్కెట్ ను కలిగి ఉన్న భారతదేశంలో ఉత్పత్తి పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నాయి ప్రయోజనాల వల్ల భారతదేశం పీవీ రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా మారుతుంది. ప్రస్తుత నయాకత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. దీనికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నది. భారతదేశం తరలి రాడానికి ఇది సరైన సమయం " అని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు.

   పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఇందు శేకర్ మాట్లాడుతూ " గత ఆరు సంవత్సరాలలో భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం 2 .5 రెట్లు, సౌర ఇంధన సామర్ధ్యం 13 రెట్లు పెరిగాయి. రానున్న కొన్ని సంవత్సరాలలో ఏడాదికి 30 జి డబ్ల్యూ చొపున్న పెంచుతాం. స్వదేశంలో జరిగే ఉత్పత్తి కార్యక్రమాల వల్ల విదేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. దేశంలో సౌర ఘటాలు, వెఫర్లు మరియు ఇంగాట్ల రంగాలకు సంబందించిన అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. పరిజ్ఞానంలో చోటు చేసుకొంటున్న మార్పులు సౌర ఇంధనం మరింత చౌకగా సులువుగా అందుబాటులోకి వచ్చేలా చేస్తాయి' అన్నారు.

    ఇన్వెస్ట్ ఇండియా ఎండి మరియు సీఈఓ దీపక్ బాగ్ల మాట్లాడుతూ పెట్టుబడిదారులకు సహాయ సహకారాలను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. " 2019 - 2020 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశం 74 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసి పెట్టుబడులను ఆకర్షించింది. భారతదేశం చరిత్రలో ఇదే అత్యధికం.ప్రపంచ వ్యాపితంగా ఎఫ్ డి 8 % తగ్గుతున్నసమయంలో భారతదేశంలో ఇవి 18 % పెరిగాయి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు ఉత్సాహం చూపుతున్నాయి. పెట్టుబడుల అంశాన్ని సులభతరం చేయడం అంశంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్లాంటును అత్యంత వేగంగా ఎనిమిది నెలలలోనే దేశంలో ఏర్పాటు సహాయడం జరిగింది. పెట్టుబడిదారులకు భారతదేశం అనువుగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.ప్రతి మంత్రిత్వ శాఖా లోను ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పాము. కేంద్రాలు పెట్టుబడులు పెట్టడంలోదురవుతున్న అవరోధాలను తొలగించి, పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను సిద్ధంచేసి పెట్టుబడిదారులకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాయి " అని వివరించారు.

   వెఫెర్ / సెల్ ఉత్పత్తి, మోడెల్ ప్రొడక్షన్, సప్లై చైన్ లపై దృష్టి సారించి రెండవ సదస్సును నిర్వహించారు. సదస్సులో వివిధ దేశాలకు చెందిన నిపుణులు సౌర విద్యుత్ భవిషత్తును వివరించి రంగంలో తాము రూపొందించిన పరిజ్ఞాలను భారత్ పెట్టుబడిదారులకు పరిచయం చేశారు. స్వదేశీ నిపులులు తాము రూపొందించి పేటెంట్ పొందిన పరిజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చారు.

     భారీ సౌర ఉత్పత్తి రంగం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుందని సదస్సులో గుర్తించారు. (i )పీవీ సాంకేతిక అంశాలు (ii ) అవసరాలకు అనువైన ఉత్పత్తి పరికరాలు (iii ) ప్రత్యేక గ్లాసులు కోటింగ్ దీనిలో ముఖ్యమైనవిగా గుర్తించారు.

      " భారతదేశ ఇంధన వినియోగం ప్రపంచ వినియోగంలో కేవలం 1 /3 వంతుగా మాత్రమే ఉంది. ఇది మరింత పెరగడానికి అవకాశం ఉంది. తక్కువ స్థాయిలో వినియోగం జరుగుతున్నప్పటికీ 73 % వాయువులు ఇంధన ఉత్పత్తి కార్యక్రమాల ద్వారా విడుదల అవుతున్నాయి. దీని వల్ల కాలుష్యం కలిగించని ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది " అని   నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేష్ సర్వాల్ అన్నారు.

   పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అమితేష్ కుమార్ పునరుత్పాదక ఇంధన వనరులకు భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. " సౌర ఫలకల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సహకాలను, తక్కువ వడ్డీలకు పెట్టుబడి రుణాలను అందించే ప్రతిపాదనలు ఉన్నాయి." అన్నారు.పెట్టుబడిదారులకు తమ మంత్రిత్వ శాఖ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం అనువైన ప్రదేశమని ఆయన స్పష్టం చేశారు.

    పెట్టుబడులపై జరిగిన మూడవ సదస్సులో తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు తమతమ రాష్ట్రాలలో పెట్టుబడులను ఆహ్వానించడానికి తీసుకొంటున్న చర్యలను వివరించారు. ప్రపంచ దేశాల నుంచి సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులను భారతదేశంలో అనువుగా ఉన్న సౌకర్యాలను సదస్సులో చర్చించారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరిగాయి. సదస్సులో అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల ప్రతినిధులు, అభివృద్ధిదారులు,కోల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు పెట్టుబడుల అంశాన్ని చర్చించారు.

    పారిస్ ఒప్పందం ప్రకారం 2015 ప్రకారం భారతదేశం అంగీకరించిన అంశాలను అమలు చేసి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి దూరదృష్టి కలిగిన నాయకత్వం , చిత్తశుద్ధితో పాటు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడు సౌర విద్యుత్ రంగంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది.

***

                                                



(Release ID: 1662479) Visitor Counter : 142