ఆర్థిక మంత్రిత్వ శాఖ
బీహార్, యూపీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
07 OCT 2020 3:45PM by PIB Hyderabad
మైనింగ్ మరియు హోటల్ పరిశ్రమల వ్యాపారంలో ఉన్న ఒక వ్యక్తి విషయమై
యాక్షనెబుల్ ఇంటిలీజెన్స్ సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ పాట్నా, ససారాం మరియు వారణాసిలలో మంగళవారం (06-10-2020న) శోధన మరియు స్వాధీనం చర్యలను నిర్వహించింది. అతి పెద్ద సహకార బ్యాంకు ఛైర్మన్ కూడా అయిన సదరు వ్యక్తి పొంతన లేని ఆదాయం విషయమై నిజాలు తెలుసుకునేలా
శోధనలు జరిగాయి. సోదాల సమయంలో ఈ వ్యక్తికి చెందిన ఒక కారులో రూ.75 లక్షల సొమ్ము ఐటీ శాఖ అధికారులకు దొరికాయి. దీనికి సంబంధించి తదుపరి దర్యాప్తులో ఈ సొమ్ము మొత్తంను బ్యాంక్ చైర్మన్‌కు చెందినదిగాను.. దీనిని ఎక్కడా లెక్కకు చూపని సొమ్ము గాను కనుగొన్నారు. ఈ సోదాల సమయంలో ఎక్కడా లెక్కకు చూపని నగదు, గణనీయమైన నగదు లావాదేవీల వివరాలతో కూడిన పత్రాలు కనుగొన్నారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు లావాదేవీలు ఆదాయపు పన్ను రిటర్నులలో కూడా చూపించబడలేదు.
ఈ వ్యక్తి యొక్క ఇళ్ళు, ఒక హోటల్ మరియు వివిధ వాహనాలు పెట్టుబడుల వనరుల విషయాన్ని కూడా ఐటీ విభాగం పరిశీలిస్తోంది. ఐటీ సోదాల్లో దొరికిన పత్రాలు మేరకు లెక్కించని సొమ్ముతో పాటుగా చట్టవిరుద్ధపు రాతి మైనింగ్ కార్యకలాపాల్ని కూడా ఈ వ్యక్తికి చెందిన గ్రూపు చేపట్టినట్టుగా తేలింది. ఇంకా, స్వాధీనం చేసుకున్న ఖాతాల పుస్తకాలు కొన్ని కోట్ల రూపాయల రుణాలను కూడా గుర్తించారు. వీటిలో తగిన యథార్థతల కోసం కూడా పరిశీలించబడుతున్నాయి. ఈ సోదాల్లో వివరణ ఇవ్వని నగదు మొత్తం రూ.1.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు రూ. ఆరు కోట్లను నిషేధిత ఆదేశాల మేరకు పక్కన బెట్టారు. ఈ విషయంలో తదుపరిగా దర్యాప్తు కొనసాగుతోంది.
****
(Release ID: 1662416)
Visitor Counter : 158