రైల్వే మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్ ముందు మాదిరిగానే షెడ్యూల్ చేయబడిన రైలు బయల్దేరే సమయానికి అర గంట ముందు రెండో రిజర్వేషన్ చార్టు ప్రకటన
- రెండో చార్ట్ తయారీకి ముందు ఆన్‌లైన్, పీఆర్ఎస్ టికెట్ కౌంటర్లలో టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది
Posted On:
06 OCT 2020 6:28PM by PIB Hyderabad
రెండో రిజర్వేషన్ చార్టు తయారీ మరియు జారీకి సంబంధించి మునుపటి వ్యవస్థను పునరుద్ధరించాలని భారత రైల్వే నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ వ్యవస్థను పునరుద్ధరించనున్నారు. కోవిడ్‌కు ముందు సమయంలో వ్యవస్థీకృతం చేసిన నిబంధనల మేరకు.. రైలు షెడ్యూల్ ప్రకారం బయలు దేరడానికి కనీసం నాలు గంటల ముందు.. మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేయబడుతుంది. ఆ తరువాత అందుబాటులో ఉన్న వసతి మేరకు పీఆర్ఎస్ కౌంటర్లలోనూ, ఇంటర్నెట్ ద్వారా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన
(ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్) రెండో రిజర్వేషన్ చార్టును తయారుచేసే వరకు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. రైళ్ల బయలుదేరే షెడ్యూల్ / రీషెడ్యూల్ సమయానికి 30 నిమిషాల నుండి 5 నిమిషాల ముందు రెండవ రిజర్వేషన్ చార్ట్‌లు తయారు చేయబడతాయి. రైలు టిక్కెట్ల వాపసు నిబంధనల ప్రకారం ఈ కాలంలోనే అప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్ల రద్దుకు కూడా అనుమతి ఉంది. మహమ్మారి కారణంగా రెండో రిజర్వేషన్ చార్టును తయారు చేసే సమయాన్ని రైలు బయలు దేరే షెడ్యూల్/ షెడ్యూల్ చేసిన సమయానికి దాదాపు రెండు గంటల ముందుకు మార్చడానికి గాను సూచనలు జారీ చేయబడ్డాయి. దేశంలో రైలు ప్రయాణికుల సౌలభ్యాన్ని నిర్ధారించడానికి జోనల్ రైల్వే అభ్యర్థన ప్రకారం, ఈ విషయం తిరిగి
పరిశీలించబడింది. రైలు బయలుదేరడానికి షెడ్యూల్/ రీషెడ్యూల్ సమయానికి కనీసం 30 నిమిషాల ముందు రెండవ రిజర్వేషన్ చార్ట్ తయారు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం, రెండో చార్ట్ తయారీకి ముందు ఆన్‌లైన్ మరియు పీఆర్ఎస్ టికెట్ కౌంటర్లలో టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఈ నెల 10వ తేదీ నుంచి సవరించిన ఈ కొత్త నిబంధనలు అమలుకు వీలుగా
సాప్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు జారీ చేయడానికి గాను సీఆర్ఐఎస్ జారీ చేయబడింది.
*****
(Release ID: 1662194)
Visitor Counter : 239