శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శాస్త్ర సాంకేతిక వ్యాప్తికి చేసిన కృషికి గుర్తింపుగా అవార్డులు.

2020కి ధరఖాస్తులు ఆహ్వానించిన జాతీయ విజ్ఞాన, సాంకేతిక సమాచార మండలి ( నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ )

Posted On: 06 OCT 2020 5:10PM by PIB Hyderabad

విజ్ఞాన సాంకేతిక సమాచార రంగాలలో  శాస్త్రీయ అవగాహన కల్పించడానికి దోహదపడే అంశాలకు అవార్డులను ప్రధానం చేయుటకు దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది.

విజ్ఞాన సాంకేతిక సమాచార రంగాలలో  శాస్త్రీయ అవగాహన కల్పించడానికి దోహదపడే అంశాలను గుర్తించి 2020 సంవత్సరానికి  అవార్డులను ప్రధానం చేయుటకు భారత ప్రభుత్వ శాస్త్ర మరియు సాంకేతిక శాఖ (డిఎస్టి)కి అనుబంధంగా పనిచేస్తున్న జాతీయ విజ్ఞాన, సాంకేతిక సమాచార మండలి ( ఎన్ సి ఎస్ టి సి )దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ అవార్డులను ప్రతి ఏటా జాతీయ శాస్త్రీయ దినోత్సవం అయినా ఫిబ్రవరి 28న ఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానం చేయడం జరుగుతున్నది.

ఈ అవార్డు కింద ఒక వ్యక్తి లేదా ఒక సంస్థకు విజ్ఞాన సాంకేతిక సమాచార రంగాలలో  శాస్త్రీయ అవగాహన కల్పించడానికి చేసిన కృషికి గుర్తింపుగా నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని, మెమెంటోను అందచేయడం జరుగుతుంది. కడచిన ఆరు సంవత్సరాలుగా  అవార్డులనుఈ కింద   ఆరు తరగతులలో ప్రధానం చేయడం జరుగుతూ వస్తున్నది.

విజ్ఞాన సాంకేతిక సమాచార రంగాలలో  చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా ప్రధానం చేసే అవార్డుగా అయిదు లక్షల రూపాయలను అందచేస్తారు. పుస్తకాలు, పత్రికల ద్వారా చేసే కృషికి, పిల్లల్లో శాస్త్రీయ అవగాహనను పెంపొందించడం, గుర్తింపు పొందిన శాస్త్రీయ సాంకేతిక అంశాలను తర్జుమా చేయడం, సంప్రదాయ విధానాలలో విజ్ఞాన సాంకేతిక సమాచార వ్యాప్తి చేయడం మరియు ఎలక్ట్రానిక్ సాధనాలలోవిజ్ఞాన సాంకేతిక సమాచార ఆవాహన కల్పించే వారికి రెండు లక్షల రూపాయల చొప్పున అవార్డుగా అందించడం జరుగుతున్నది.

ప్రతి ఏటా ప్రధానం చేసే ఈ అవార్డులను పొందడానికి 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మరియు భారతదేశంలో రిజిస్టర్ అయిన సంస్థలు లేదా కేంద్ర / రాష్ట్రాల ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధీకృత అధికారి లిఖితపూర్వకంగా సిఫార్సు చేసే సంస్థలు అర్హత కలిగి ఉంటాయి.

ఈ పధకానికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతా నిబంధనలు,నిర్ణీత దరకాస్తు నమూనాను శాఖ వెబ్ సైట్ : www .dst .gov .in . ద్వారా పొందవచ్చును.

అన్ని విధాలుగా పూర్తి వివరాలు పొందుపరచిన పత్రాలతో దరఖాస్తులను 2020  అక్టోబర్ ౩౧ వ తేదీలోగా Dr ABP Mishra , NCSTC Division ,Department of Science and Technology ఇమెయిల్ : apmishra@nic in కు పంపవలసి ఉంటుంది.

                                                                

***



(Release ID: 1662124) Visitor Counter : 124