ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
'డిస్కవరింగ్ ది హెరిటేజ్ ఆఫ్ అస్సాం' పేరుతో కాఫీ టేబుల్ బుక్ విడుదల చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్
- అమితాబ్ బచ్చన్ ముందుమాటతో పెంగ్విన్ ప్రచురణగా అందుబాటులోకి
Posted On:
04 OCT 2020 6:59PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదో), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పించనులు , అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రీ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదివారం (ఈ రోజు) “డిస్కవరింగ్ ది హెరిటేజ్ ఆఫ్ అస్సాం” పేరుతో కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేశారు. అమితాబ్ బచ్చన్ ముందుమాటతో వెలువడిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. గ్లేజుడ్ కాగితంపై చిత్రాలు, ఛాయాచిత్రాలతో కూడిన భారీ కాఫీ టేబుల్ పుస్తకం ఇది. ఈశాన్య భారతపు అతిపెద్ద రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ జాతి తెగల మరియు ఉపజాతుల వారసత్వం, విశ్వాసం, నమ్మకాలు, సంప్రదాయాల సంగ్రహణ సంకలనంగా.. దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకం విడుదల సందర్భంగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రచయిత పదంపాని బోరాను అభినందించారు. వృత్తిరీత్యా ఆయన భారతీయ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్ -2009 బ్యాచ్) అధికారిగా ఉన్నాడు, అయినా కొన్ని సంవత్సరాలుగా తనను తాను నిష్ణాతుడైన రచయితగా తన స్థానాన్ని ఆయన స్థిరపరచుకున్నాడు అని అన్నారు. భారత దేశపు ఈశాన్య ప్రాంతం యొక్క విభిన్న సూక్ష్మ నైపుణ్యాలను ప్రతిబింబించే విషయాలలో ప్రత్యేకత కలిగిన ఒక నిష్ణాత రచయితగా తనను తాను స్థాపించుకున్నాడని ఆయన అన్నారు. ఈశాన్య.
భారతాన్ని మిగతా భారతదేశానికి దగ్గరగా తీసుకురావాలి సూచించారు. వాస్తవానికి మిగతా భారత దేశం నార్త్ ఈస్ట్ నుండి నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్నారు. ఈ విషయాన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకోగలరని అన్నారు. అస్సాంకు సంబంధించి నిగూడంగా ఉన్న వివిధ కోణాలను గొప్ప వైభవాన్ని, కీర్తిని అర్థం చేసుకోవడానికి శ్రీ పదంపాని బోరా రాసిన పుస్తకం సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ సింగ్ కాఫీ టేబుల్ బుక్‌ను విస్తృతంగా సర్క్యులేషన్‌లోకి తేవాలని
డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. బోరా యొక్క గొప్ప సృష్టి పుస్తకం యొక్క పేజీలకు మాత్రమే పరిమితం కాకుండా ఈశాన్య ప్రాంత సాంస్కృతి మరియు వారసత్వం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పరిచయం చేసే రాయబారిగానూ పనిచేయగలదని సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
<><><><><>
(Release ID: 1661660)
Visitor Counter : 141