వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వరి ధాన్యం సేకరణ కోసం 41,084 మంది రైతులకు దాదాపు రూ.1,082 కోట్లు చెల్లింపు

2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో పత్తి సేకరణ కూడా ప్రారంభం

प्रविष्टि तिथि: 04 OCT 2020 5:26PM by PIB Hyderabad

2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరి ధాన్యం సేకరణ ఇప్పటికే చురుగ్గా సాగుతోంది. ఈనెల 3వ తేదీ నాటికి మొత్తం 5,73,339 మె.ట. సేకరణ పూర్తయింది. 41,084 మంది రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించి, కనీస మద్దతు ధరగా రూ.1,082.464 కోట్లు చెల్లించారు.

    2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో, ఈ నెల 1వ తేదీ నుంచి గింజ పత్తి (కపస్‌) సేకరణ కూడా ప్రారంభమైంది. ఈనెల 3వ తేదీ వరకు, 29 మంది రైతుల నుంచి 147 బేళ్ల పత్తిని 'కాటన్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా' సేకరించింది. కనీస మద్దతు ధరగా రూ.40.8 లక్షలు చెల్లించింది.

***


(रिलीज़ आईडी: 1661595) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Tamil , Malayalam