యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 సంక్రమించిన మేటి ప్రతిభ కలిగిన అథ్లెట్ల పర్యవేక్షణకు "గ్రాడ్యుయేటెడ్ రిటర్న్ టు ప్లే" మార్గదర్శకాలను జారీ చేసిన శాయి
Posted On:
03 OCT 2020 2:15PM by PIB Hyderabad
ప్రతి అథ్లెట్ యొక్క ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని 'స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (శాయి) తమ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతూ..
కోవిడ్-19 నిర్ధారితమైన మేటి ప్రతిభ కలిగిన అథ్లెట్లకు "గ్రాడ్యుయేటెడ్ రిటర్న్ టు ప్లే" పేరిట మార్గదర్శకాలను (ఎస్ఓపీ) జారీ చేసింది. "గ్రాడ్యుయేటెడ్ రిటర్న్ టు ప్లే" (జీఆర్‌టీపీ) అని పిలువబడే ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, అన్ని శాయి కేంద్రాలు, అధికారులకు తగు సూచనలు చేయడమైంది. ఆయా కేంద్రాలలో శిక్షణ పొందుతూ.. కోవిడ్-19 సంక్రమణకు గురైన అథ్లెట్ల యొక్క పురోగతిని పర్యవేక్షించాలని కోరడమైంది.
కోవిడ్-19 కేసుల ఆధారంగా ఎస్ఓపీని మూడు రకాలుగా విభజించి జారీ చేశారుః
* ఒకటో రకం: కోవిడ్-19 పాజిటివ్ & అసింప్టోమాటిక్ (10 రోజుల్లో పరిష్కరించే తేలికపాటి స్థానికీకరించిన లక్షణాలు *)
* రెండో రకం: కోవిడ్-19 పాజిటివ్ & దీర్ఘకాలిక కోర్సు (10 రోజులకు పైగా ప్రాంతీయ / దైహిక లక్షణాలు) లేదా ఆసుపత్రిలో చేరాల్సిన తీవ్రమైన లక్షణాలు *)
* మూడో రకం: జీఆర్‌టీపీ పురోగతి సమయంలో కోవిడ్-19 పాజిటివ్ & లక్షణాలు * (రికవరీ అయిన తరువాత సమస్యలు)
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్-19 వైరస్ సంక్రమణ జరిగిన అథ్లెట్లకు శిక్షణ ఇవ్వడానికి సంబంధించి శాయి తన అధికారులకు కఠినమైన సూచనలు చేయడంతో పాటుగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కోవిడ్-19 వైరస్ సంక్రమణ యొక్క క్లినికల్ అసెస్‌మెంట్, ఎస్ఓపీలో పేర్కొన్న మార్గదర్శకాల అమలును నిర్ధారించడానికి ప్రతి కేంద్రంలో వైద్య మరియు పారా మెడికల్ నిపుణులను నియమించేందుకు అర్హులను గుర్తించే ప్రక్రియను శాయి సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తరువాత క్లినికల్ అసెస్‌మెంట్ ఫలితంగా జీఆర్‌టీపీ పురోగతికి సంబంధించి తగిన స్పష్టత ఉండేలా ఈ కొత్తగా
నియమించబడిన వైద్య, పారామెడికల్ వైద్య నిపుణులకు ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి. ఇంకా, ఏడు రోజులు లక్షణరహితంగా ఉన్న కోవిడ్-19 యొక్క స్వీయ-పరిమితి కోర్సుతో ఆరోగ్యకరమైన రోగికి 50 శాతం మేర సాధారణ తీవ్రత మరియు పరిమాణంతో శారీరక శ్రమను ప్లాన్ చేయాలని శిక్షకులకు సూచించబడింది. అథ్లెట్ల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని మరియు క్రమంగా సాధారణ శిక్షణలోకి తిరిగి చేరేలా చర్యలుండాలని అథ్లెట్లు మరియు కోచ్లకు సలహా ఇవ్వాలని మెడికల్, పారామెడికల్ సిబ్బందిని కోరారు. ఆయా అథ్లెట్లను వ్యాయామ సెషన్లకు ముందు, వ్యాయమ సమయంలోనూ మరియు తరువాత పర్యవేక్షిస్తారు. ఏదైనా ఇతర అసాధారణ లక్షణాలు కలిపిస్తే మరింత మేటి అంచనాకు ఈ నివేదికల్ని నిపుణులైన ఇతర వైద్య బృందానికి నివేదించబడుతాయి.
*******
(Release ID: 1661391)
Visitor Counter : 349