సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

గాంధీ జయంతి సంద‌ర్భంగా ముంబ‌యిలోని కేంద్ర కార్యాలయంలో చ‌ర‌ఖాను ఆవిష్కరించిన కేవీఐసీ

Posted On: 02 OCT 2020 4:38PM by PIB Hyderabad

జాతిపిత మహాత్మా గాంధీ జ‌యంతిని 'ఖాదీ మరియు గ్రామీణ‌ పరిశ్రమల కమిషన్‌‌' (కేవీఐసీ) వేడుక‌గా నిర్వ‌హించింది. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా కేవీఐసీ తన ముంబ‌యి కార్యాలయ ప్రాంగణంలో దాదాపు 3.5 అడుగుల ఉక్కు చ‌ర‌ఖాను ఏర్పాటు చేసింది. కేవీఐసీ ఛైర్మన్ శ్రీ విన‌య్‌ కుమార్ సక్సేనా వెబ్ కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ చ‌ర‌ఖాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  ప్రసంగించారు. “చ‌ర‌ఖా యొక్క ఈ ప్రయాణం భారతదేశ స్వదేశీ ఉద్యమం, స్వావలంబన మరియు ఆర్థిక స్వేచ్ఛకు ఒక చిహ్నం. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కేవీఐసీకి నిజంగా గర్వకారణం" అని ఆయ‌న అన్నారు.


ప్రపంచ స్థాయిలో మన సామాజిక జౌళి యొక్క మ‌గ్గం దారానికి సంబంధించిన  ఈ సాధనాన్ని తీసుకుపోవ‌డం మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కల మరియు దృష్టి అని ఆయన అన్నారు. మ‌న ప్ర‌ధాన మంత్రి దృష్టి అనుసరించి కేవీఐసీ అణగారిన ప్రజల జీవితాలను ఉద్ధరించడానికి, పేద ప్రజల ఇంట్లో వెలుగుల్ని నింపేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్‌-19 కాలంలో దాని పథకాలు మరియు కార్యక్రమాలతో ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. కేవీఐసీ జాతి నిర్మాణంలో బలమైన పాత్ర పోషించిందని తెలిపారు. గ‌డిచిన 8 సంవత్సరాల్లో 6.28% నుండి 28 శాతం వరకు మేటి వృద్ధి సాధించ‌డంలోనే ఇది ప్రతిబింబిస్తుంది అన్నారు. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కళాకారుల్ని శక్తి వంతం చేయడంలో అద్భుతమైన స‌మ‌యంగా గుర్తించవచ్చు అని ఆయ‌న‌ తెలిపారు. ముంబ‌యిలోని కేవీఐసీ కేంద్ర కార్యాల‌యంలో చ‌ర‌ఖాను ఏర్పాటు చేయ‌డం గాంధీజీ నిర్దేశించిన వారసత్వాన్ని అనుసరించి తమ జీవితాన్ని అంకితం చేసిన మన చేతివృత్తుల వారికి ఘ‌న‌నివాళి అన్నారు.
దేశవ్యాప్తంగా భారీ చ‌ర‌ఖాల‌ ఏర్పాటు..
గ‌డిచిన నాలుగు సంవత్సరాల్లో కేవీఐసీ దేశవ్యాప్తంగా భారీ చ‌ర‌ఖాల్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ చ‌ర‌ఖాను ఏర్పాటు చేశారు. ఇది ప్ర‌పంచంలోనే అతిపెద్ద చ‌ర‌ఖా. దీనికి తోడు క‌న్నె‌ట్ ప్లేస్‌లోని రాజీవ్ చౌక్‌ వద్ద భారీ ఉక్కు చ‌ర‌ఖాను ఏర్పాటు చేశారు. మోతీహరిలోని గాంధీ మ్యూజియం ముందు ఉన్న చ‌ర‌ఖా పార్కులోని స్టీల్ చ‌ర‌ఖాను ఏర్పాటు చేశారు. స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ‌ఫ్రంట్‌లోనూ ఒక భారీ చ‌ర‌ఖాను ఏర్పా‌టు చేశారు. మన స్వాతంత్రం పోరాటంలో చారఖా యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు.
150 కార్యకలాపాల ప్రారంభం..
జాతిపిత మ‌హాత్మ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అంత‌కు ముందు కేవీఐసీ ఛైర్మ‌న్‌, కేవీఐసీ సీఈఓ స‌హ‌కారంతో దేశ వ్యాప్తంగా ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ యొక్క దాదాపు 150 కార్యకలాపాలను ప్రారంభించారు. ఇందులో అమ్మ‌క‌పు అవుట్లెట్లు / వర్క్ షెడ్ల ప్రారంభోత్సవం, కుమ్మరి చక్రాలపై శిక్షణ, తేనె పెట్టెల పంపిణీ/ చేతివృత్తుల వారికి కావాల్సిన చ‌ర‌ఖాల పంపిణీ, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎస్ఎఫ్‌యుఆర్‌టీఐ మరియు పీఎంఈజీపీ యూనిట్ల ప్రారంభోత్సవం త‌దిత‌రాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు స్థిరమైన స్థానిక ఉపాధిని కల్పించడం మరియు చేతివృత్తుల వారిలో ఆత్మనీర్భర్ క‌ల్పించ‌డం లక్ష్యంగా పెట్టుకున్నాయని కేవీఐసీ ఛైర్మన్ శ్రీ విన‌య్‌ కుమార్ పేర్కొన్నారు. కేవీఐసీ ఆఫీస్‌ ప్రాంగణంలో మ‌హాత్మ గాంధీకి నివాళులర్పించిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.ఎస్. ప్రీత వర్మ అనంత‌రం ప్ర‌సంగించారు. గాంధీజీ సిద్ధాంతాల ఆధారంగా గాంధీజీ చ‌ర‌ఖా యొక్క సంస్థాపన కేవీఐసీకి నిజంగా గర్వించదగిన విషమ‌య‌ని అన్నారు. గాంధేయ సిద్ధాంతాల ఆధారంగా త‌గు ఉపాధి కల్పించడానికి మరియు ప్రజలలో స్వావలంబనను సృష్టించడానికి మరియు 'ఆత్మనిర్భర్ భారత్' పట్ల బలమైన గ్రామీణ సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి గాను అట్టడుగు స్థాయిలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న‌ట్టుగా తెలిపారు. ఈ గౌరవనీయ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న డిపార్ట్‌మెంటల్ విక్ర‌య కేంద్రాల ద్వారా విక్రయించే అన్ని ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులపై పరిమిత కాలానికి కేవీఐసీ 20 శాతం తగ్గింపును అందిస్తోంద‌ని అన్నారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా స్వ‌చ్ఛ‌తా అభియాన్ నిర్వ‌హించారు. విస్తృత శ్రామ్‌దాన్ కార్యకలాపాల్లో భాగంగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరిలో ప్రేరణను కలిగించడానికి ఈ కేవీఐసీ దీనిని నిర్వహించింది.


                               

****


(Release ID: 1661233) Visitor Counter : 185