ఆయుష్
ఆయుష్ రంగానికి ఐటి వెన్నుదన్ను, ఆయుష్‌గ్రిడ్. ఇది నేషనల్ డిజిటల్‌హెల్త్ మిషన్‌తో అనుసంధానతకు ఉద్దేశించినది.
Posted On:
02 OCT 2020 11:45AM by PIB Hyderabad
ఆయుష్ రంగాన్నిజాతీయ డిజిటల్‌హెల్త్‌మిషన్ (ఎన్.డి.హెచ్.ఎం)తో అనుసంధానం చేసేందుకుఉద్దేశించిన ఆయుష్‌గ్రిడ్ ఆయుష్‌రంగానికి ఐటి వెన్నెముకగా ఉండనుంది. దీనిని ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి విడి. రాజేష్ కొటెక్ అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఆమోదించారు. ఆయుష్ గ్రిడ్ టీమ్, ఎన్‌డిహెచ్ బృందం ఇప్పటికే ఈ విషయమై పలు విడతల చర్చలు జరిపి ఇందుకు సంబంధించిన విధివిధానాల పై ఒక అవగాహనకు వచ్చారు. ఈ అనుసంధానత ఆరోగ్య రంగంలోని ఆయుష్ విభాగాలను మరింతగా ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ఉపయోగపడుతుంది.
ఆయుష్ కార్యదర్శి, ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం చేపడుతున్న ఐటి కార్యకలాపాల స్థితిగతుల గురించి సమీక్షించారు. గత రెండు సంవత్సరాలలో ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్టు , ఆయుష్‌రంగంలో గల డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో విజయం సాధించింది. అలాగే కీలక ఆరోగ్య సంరక్షణ ఐటి ప్రాజెక్టులను అమలుచేయడంలో ఇది నిమగ్నమై ఉంది.
ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్టును ఆయుష్ మంత్రిత్వశాఖ 2018లో ప్రారంభించింది. ఈ మొత్తం రంగానికి ఐటి వెన్నెముకగా ఉండేందుకు సమగ్ర కార్యక్రమంగా దీనిని చేపట్టారు. పరిశోధన, విద్య, వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, డ్రగ్‌నియంత్రణలతోపాటు ,మొత్తం ఆయుష్ రంగాన్ని డిజిటలైజ్ చేయడం అనేది అన్ని స్థాయిలలోని ఆరోగ్య సంరక్షణలో పరివర్తనాత్మక మార్పులకు దారితీస్తుంది. ఇది ఆయుష్ రంగంలోని స్టేక్‌హోల్డర్లందరికీ ప్రయోజనకరంగా ఉండనుంది. ఇది ఈ దేశ ప్రజలకు, జాతీయంగా వివిధ స్థాయిలలోను, ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ లక్ష్యాల సాధనకు ఎంతగానో తోడ్పడనుంది.
ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు చేపట్టి అమలుచేసిన వివిధ కార్యక్రమాలలో అత్యంత ముఖ్యమైనది, ఆయుష్ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎ.హెచ్.ఎం.ఐ.ఎస్). వాస్తవానికి ఇది థెరాన్ ఆధారిత వ్యవస్థ .హెచ్.ఎం.ఐ.ఎస్‌ను చెన్నైకి చెందిన సిద్ద రిసెర్చ్ కౌన్సిల్ అభివృద్ధి చేసింది. ఎ.హెచ్.ఎం.ఐ.ఎస్ ను ఇప్పడు ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన సుమారు 100 క్లినికల్ సంస్థలు వినియోగిస్తున్నాయి.
దీనికితోడు, మెస్సర్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) , బెంగళూరు దీని పరిధిని మరింత విస్తృతం చేసేందుకు ఎంపికచేయబడింది. ఆయుష్ మంత్రిత్వశాఖ ఎహెచ్ఎంఐఎస్‌ను కేంద్ర ప్రభుత్వ పరిధి వెలుపల ఉన్న ఆయుష్ విభాగాలకు కూడా వర్తింప చేసేందుకు సన్నద్ధమౌతోంది. దీనివల్ల మొత్తం ఆయుష్ రంగం ప్రయోజనం పొందడానికి వీలు కలుగుతుంది.
ఆయుష్‌గ్రిడ్ కు సంబంధించిన మరో విజయం , ఆయుష్ మంత్రిత్వశాఖకుచెందిన వివిధ విభాగాల అత్యవసర అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయుష్ సంజీవని మొబైల్ యాప్,యోగా లొకేటర్ మొబైల్‌యాప్ అభివృద్ధి, అమలు. ఈ అప్లికేషన్‌ను సుమారు6 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.దీనితో స్వల్పవ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ప్రజలను చేరే లక్ష్యం సంతృప్తి కరంగా నెరవేరింది.కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి తొలి వారాలలో ఆయుష్ మంత్రిత్వశాఖ వివిధ క్రౌడ్ సోర్సింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది. కోవిడ్ కు సంబంధించి సమాచారాన్నిసేకరించడం, ఆయుష్ వలంటీర్లను సమీకరించడం వంటి పనులు చేసింది.దానికితోడు కోవిడ్ -19డ్యాష్‌బోర్డు నుకూడా రియల్ టైమ్‌సమాచారం కోసం ఏర్పాటు చేశారు. ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్టు ఇలాంటి కీలక కార్యకలాపాలను చేపట్టడానికి అవసరమైన మద్దతు ఇచ్చింది.దీనితో లాక్‌డౌన్ సంబంధిత ఎన్ని ఇబ్బందులు ఉ న్నప్పటికీ ఆరోగ్య సంక్షోభానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడంలో ఇది ఉపకరించింది.
ఆయుష్‌గ్రిడ్ కింద, ఆయుష్ ప్రొఫెషనల్స్‌కు ఒక ప్రత్యేక ఐటి కోర్సును పూణేకు చెందిన సి-డాక్‌తో కలిసి అభివృద్ధి చేశారు. సుమారు 200మంది ఆయుష్ ప్రొఫెషనల్స్‌కు, కొందరు ప్రభుత్వం వెలుపల గల స్టేక్‌హోల్డింగ్ సంస్థలకుచెందిన వారికి శిక్షణనిచ్చారు. ఇది ఆయుష్ రంగంలో డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి గణనీయంగా తోడ్పడింది. ఈప్రోఫషనల్స్ ఈ రంగం డిజిటైజేషన్‌ను మరింత ముందుకు తీసుకుపోవడానికి ఉపకరిస్తారు. ఆయుష్ గ్రిడ్ అమలు చేసిన మరో విజయవంతమైన ప్రాజెక్టు సి-డాక్ తో కలసి చేపట్టిన టెలిమెడిసిన్ కార్యక్రమం. దీనిని 2019 నవంబర్ 1న సిద్ధ వ్యవస్థలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. లాక్‌డౌన్ అనంతరం దీనిని ఆయుర్వేద,హోమియోపతిలకు కూడా వర్తింప చేశారు. సుమారు 20,000 మందికి దీనిద్వారా సేవలు అందించారు.
ఆయుష్ విద్యకు మద్దతు తెలిపేందుకు ఆయుష్ నెక్సటు పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించారు.దీనిని అభివృద్ధి చేసి త్వరలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఆయుష్ గ్రిడ్ కార్యక్రమాలు ఆయుష్ రంగానికి చెందిన అన్ని పార్శ్వాలకు సంబంధించినవి. ఆరోగ్యసేవలు, విద్య, ఆయుష్ పరిశోధన, కేంద్ర రంగం, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, పౌర సేవా సర్వీసులు, డ్రగ్‌లైసెన్సింగ్ పోర్టల్, మీడియా ఔట్ రీచ్‌వంటి వి ఇందులో ఇమిడి ఉన్నాయి.
ఆయుష్‌గ్రిడ్ తన భాగస్వామ్యప్రాజెక్టుల ద్వారా క్రమంగా వృద్ధి చెందుతోంది. రాగల మూడు సంవత్సరాలలో ఇది 8 లక్షల మంది ఆయుష్ ఫిజీషియన్లు, సుమారు 50 కోట్ల మంది ప్రజలకు సమగ్ర ఐటి ఆధారిత సేవలు అందించే స్థాయికి ఎదగనుంది.
***
(Release ID: 1661094)
Visitor Counter : 272