ఆర్థిక మంత్రిత్వ శాఖ

2020-21 ఆర్థిక సంవత్సరంలో, ఆగస్టు వరకు కేంద్ర ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష

प्रविष्टि तिथि: 30 SEP 2020 5:19PM by PIB Hyderabad

2020-21 ఆర్థిక సంవత్సరంలో, ఆగస్టు వరకు, కేంద్ర ప్రభుత్వ పద్దులను ఏకీకృతం చేసి ప్రకటించారు. ఆ వివరాల ముఖ్యాంశాలు:

    ఆగస్టు 2020 వరకు, కేంద్ర ప్రభుత్వానికి రూ.3,77,306 కోట్లు (సంబంధిత బి.ఇ. 2020-21 మొత్తం స్వీకరణల్లో 16.80 శాతం) వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం (నికర విలువ) రూ.2,84,495 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.86,147 కోట్లు, రుణయేతర మూలధనం రూ.6,664 కోట్లు ఉన్నాయి.

    ఆగస్టు వరకు, పన్నుల వాటా రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.2,17,976 కోట్లు కేంద్రం నుంచి వెళ్లాయి. గతేడాదితో పోలిస్తే రూ.37,629 కోట్లు తక్కువ.

    కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.12,47,653 కోట్లు (సంబంధిత బి.ఇ. 2020-21లో 41.01 శాతం). ఇందులో ఆదాయ పద్దు కింద రూ.11,13,206 కోట్లు, మూలధన పద్దు కింద రూ.1,34,447 కోట్లు ఉన్నాయి. మొత్తం రెవెన్యూ ఖర్చులో, వడ్డీ పద్దు కింద రూ.2,37,662 కోట్లు, భారీ రాయితీల పద్దు కింద రూ.1,30,700 కోట్లు ఉన్నాయి.

***


(रिलीज़ आईडी: 1660449) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , Bengali , Assamese , English , Urdu , हिन्दी , Punjabi