భారత ఎన్నికల సంఘం
పట్టభద్రుల(2), ఉపాధ్యాయుల(2) నియోజకవర్గాలనుంచి కర్నాటక శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికలు
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2020 1:38PM by PIB Hyderabad
కర్నాటక శాసనమండలిలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాలనుంచి నలుగురు సభ్యుల
పదవీకాలం 2020 జూన్ 30తో ముగిసినందున నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి.
ఆ స్థానాల వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:
|
సంఖ్య
|
నియోజకవర్గం
|
సభ్యుని పేరు
|
విరమణ తేదీ
|
|
1
|
కర్నాటక ఈశాన్య (పట్టభద్రులు)
|
ఆర్, చౌదారెడ్డి, తూపల్లి
|
జూన్ 30, 20202
|
|
2
|
కర్నాటక పశ్చిమ ( పట్టభద్రులు)
|
ఎస్. వి. శంకనూర్
|
,,
|
|
3
|
కర్నాటక ఈశాన్య ( ఉపాధ్యాయులు)
|
శరణప్ప మట్టూరు
|
,,
|
|
4
|
బెంగళూరు ( ఉపాధ్యాయులు)
|
పుట్టణ్ణ
|
,,
|
2. కోవిడ్ -19 కారణంగా ఏర్పడిన అనూహ్య పరిస్థితులు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి, వైపరీత్యాల నిర్వహణ చట్టం,
2005 కింద జారీ అయిన మార్గదర్శకాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని 324వ అధికరణం కింద
ప్రజాప్రాతిధ్య చట్టం, 1951 లోని 16 వ అధికరణం ప్రకారం 08.06.2020 నాడు ఆదేశాలు జారీచేస్తూ, ప్రస్తుతం
నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన మీదట పైన పేర్కొన్న నియోజకవర్గాలలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
3. కర్నాటల ప్రధాన ఎన్నికల అధికారినుంచి వివరాలు అందుకున్న కమిషన్ ఇప్పుడు కర్నాటక శాసనమందలిలోని
పైన పేర్కొన్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజవర్గాలకు ఈ దిగువ పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు
జరపాలని నిర్ణయించింది.
|
1
|
నోటిఫికేషన్ జారీ
|
అక్టోబర్ 1, 2020 (గురువారం)
|
|
2
|
నామినేషన్లకు ఆఖరు తేదీ
|
అక్టోబర్ 9, 2020 (శుక్రవారం)
|
|
3
|
నామినేషన్ల పరిశీలన గడువు
|
అక్టోబర్ 9, 2020 (శుక్రవారం)
|
|
4
|
నామినేషన్ల ఉపసంహరణ గడువు
|
అక్టోబర్ 12, 2020 (సోమవారం)
|
|
5
|
ఎన్నికల తేదీ
|
అక్టోబర్ 28, 2020 (బుధవారం)
|
|
6
|
పోలింగ్ సమయం
|
ఉదయం 08:00 నుంచి సాయంత్రం 05:00 వరకు
|
|
7
|
వోట్ల లెక్కింపు
|
నవంబర్ 2, 2020 (సోమవారం)
|
|
8
|
ఎన్నికల ప్రక్రియ ముగింపు
|
నవంబర్ 5, 2020 (గురువారం)
|
4. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఆయా నియోజకవర్గాల పరిధిలో తక్షణమే
అమలులోనికి వస్తుంది. వివరాలకోసం కమిషన్ వెబ్ సైట్ ను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
https://eci.gov.in/files/file/4070-biennial-bye-elections-to-the-legislative-councils-
from-council-constituencies-by-graduates%E2%80%99-and-teachers%E2%80%99-
and-local-authorities%E2%80%99-constituencies-%E2%80%93-mcc-
instructions-%E2%80%93-regarding/
5. ఎన్నికల ప్రక్రియ పూర్తికాలం అందరూ అనుసరించాల్సిన స్థూల మార్గదర్శకాలు:
I. ఎన్నికలకు సంబంధించిన ప్రతి కార్యకలాంలోనూ ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించాలి.
II. ఎన్నికలకోసం ఉపయోగించే హాలు/గది/ప్రదేశం ప్రవేశం దగ్గర
(ఎ)అందరికీ థర్మల్ స్కానింగ్ జరగాలి.
(బి)అన్నిచోట్లా శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.
III. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ, రాష్టప్రభుత్వ కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి
భౌతిక దూరం పాటించాలి.
IV. ఆచరణ సాధ్యమైనంతవరకు భౌతికదూరం పాటించటానికి వీలుగా పెద్ద హాల్స్ ఉపయోగించాలి.
V. పోలింగ్ సిబ్బందిని, భద్రతా సిబ్బందిని తరలించటానికి వీలుగా కోవిడ్-19
మార్గదర్శకాలకు అనుగుణంగా తగినన్ని వాహనాలు సమకూర్చాలి.
6. కోవిడ్-19 సంక్షోభ సమయంలో స్థూలంగా పాటించాల్సిన కచ్చితమైన నియమనిబంధనల
కోసం ఈ క్రింది ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లింక్ చూడవచ్చు:
https://eci.gov.in/files/file/12167-broad-guidelines-
for-conduct-of-general-electionbye-election-during-covid-19/
***
(రిలీజ్ ఐడి: 1660040)
సందర్శకుల సూచీ సంఖ్య : : 214