గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రూ. 31వేల కోట్ల ప్రాజెక్టులకు రూ. 15కోట్ల రుణం మంజూరు చేసిన ఎన్.సి.ఆర్.పి.బి.
పి-ఎం.ఐ.ఎస్. పోర్టల్ ను ప్రారంభించిన దుర్గా శంకర్ మిశ్రా
గ్యారంటీ వ్యవధి ముగిసేలోగానే ముందస్తు నోటీసులు జారీ చేసిన పోర్టల్
సమాచార విశ్వసనీయతపై సాఫ్ట్ వేర్ వ్యవస్థ హామీ
మరింత పారదర్శకత, జవాబుదారీ తనంకోసమే ప్రాజెక్టు నిర్వహణా వ్యవస్థ
Posted On:
29 SEP 2020 11:45AM by PIB Hyderabad
పథకాల ప్రగతి, రుణాల నిర్వహణలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు సంబంధించి డిజిటల్/మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ప్రాజెక్ట్ నిర్వహణా వ్యవస్థ (పి-ఎం.ఐ.ఎస్.) పెద్ద ముందడుగు అవుతుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా చెప్పారు. జాతీయ రాజధాని ప్రాంత ప్రణాళికా బోర్డుకు (ఎన్.సి.ఆర్.పి.బి.కి) చెందిన ప్రాజెక్టు నిర్వహణా వ్యవస్థ (పి-ఎం.ఐ.ఎస్.)ను న్యూఢిల్లీలో ఈ రోజు మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా మిశ్రా ఎన్.సి.ఆర్.పి.బి.కి శుభాకాంక్షలు తెలుపుతూ,... కోవిడ్-19 సమయంలో, సాంకేతిక పరిజ్ఞానం విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందిన తరుణంలో ఈ పోర్టల్ సకాలంలో వచ్చిన పరిణామమన్నారు. కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ, అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్థిక సలహాదారు, ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, జాతీయ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే రాష్ట్రాల సీనియర్ అధికారులు, ఎన్.సి.ఆర్.పి.బి. అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా దుర్గాశంకర్ మిశ్రా మాట్లాడుతూ,.. జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రాంతీయ, ఉప ప్రాంతీయ ప్రణాళికలకు ఎన్.సి.ఆర్.పి.బి. ఆమోదం తెలుపుతుందని, అందుబాటు ధరల్లో ప్రాజెక్టులకు నిధులు అందిస్తుందని, ఇందుకోసం మార్కెట్ నుంచి బాండ్లు సమీకరించడం, ద్వైపాక్షిక లేదా బహుళపక్ష సంస్థలనుంచి రుణాలు సేకరించడం చేస్తుందని చెప్పారు. రూ. 31వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకోసం రూ. 15వేలకోట్ల రుణం ఎన్.సి.ఆర్.పి.బి. మంజూరు చేసిందని, రూ.18,500కోట్లకు పైగా విలువైన 265 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “ప్రాజెక్టులపై సమీక్ష, వాటి నిర్వహణ వంటివి పి-ఎం.ఐ.ఎస్. కారణంగా సులభతరం అవుతుందన్నారు. ప్రాజెక్టులపై పౌరులకు సమాచారం ఇవ్వడం, అభిప్రాయాన్ని సేకరించడం ఈ వ్యవస్థవల్ల మరింత సులభతరం కాగలదన్నారు.
పి-ఎం.ఐ.ఎస్. వ్యవస్థను ఎన్.సి.ఆర్.పి.బి. అంతర్గతంగా రూపొందించింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి.) సర్వర్ పై దీన్ని అందుబాటులో ఉంచారు. వివిధ కేటగిరీల ప్రాతిపదికన ప్రాజెక్టుల ఎంపిక ప్రక్రియకు ఎం.ఐ.ఎస్. వ్యవస్థ సదుపాయం కల్పిస్తుంది.
✓ అమలులో ఉన్న ప్రాజెక్టులు
✓ పూర్తయిన ప్రాజెక్టులు
✓ అన్ని ప్రాజెక్టులు
✓ కీ -వర్డ్ ద్వారా సెర్చ్ చేయడం
✓ తేదీ సహాయంతో సెర్చ్ చేయడం
✓ ప్రాజెక్టు మొత్తం విలువతో సెర్చ్ చేయడం
✓ రాష్ట్రం పేరుతో సెర్చ్ చేయడం
✓ ప్రస్తుతం జరిగే చెల్లింపుల సహాయంతో సెర్చ్ చేయడం
✓ అమలు జరిపే సంస్థల పేరుతో సెర్చ్ చేయడం.
సాఫ్ట్ వేర్ వ్యవస్థ గురించి మిశ్రా వివరిస్తూ, పి-ఎం.ఐ.ఎస్. వ్యవస్థకు విభిన్నమైన లక్షణాలున్నాయని, గ్యారంటీ చెల్లుబాటు గడువు ముగిసే తేదీ, నెలవారీ రుణం చెల్లింపు గడువు ముగిసే తేదీ, వివిధ రకాలైన ఆర్థికపరమైన అంశాలను కచ్చితంగా లెక్కగడుతుందని ఆయన చెప్పారు. గ్యారంటీని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత, రుణం చెల్లింపు అవసరాన్ని గురించి ఇమెయిల్ వంటి సాఫ్ట్ వేర్ పద్ధతుల్లో ముందస్తుగా అప్రమత్తం చేయడం వంటివి ఈ వ్యవస్థ నిర్వహిస్తుందన్నారు.
ఈ వ్యవస్థ గ్యారంటీ చెల్లుబాటు గడువును లెక్కించి, చెల్లుబాటు గడువు ముగిసేందుకు రెండు నెలలు, లేదా ఒక నెల ముందుగా, 3/2 వారాలు, ఒక వారం ముందుగా, 3/2 రోజులు లేదా ఒక రోజు ముందుగా తనంతటతానే ముందస్తు నోటీసులు జారీ చేస్తుందని ఆయన తెలిపారు. గ్యారంటీకి అవసరమైన అంశాల్లో లోపాలున్నప్పటికీ ఆ విషయాన్ని పరిశీలించే స్వభావం కూడా ఈ సాఫ్ట్ వేర్ కు ఉంటుందన్నారు. అన్ని అవసరాలతో కూడిన, అన్ని విధాలా సంపూర్ణంగా ఉన్న గ్యారంటీని సమర్పించేలా ఎన్.సి.ఆర్.పి.బి. ఆర్థిక వ్యవహారాల అధికారికి పి-ఎం.ఐ.ఎస్. సాఫ్ట్ వేర్ తనంతట తానే మెయిల్ జారీ చేస్తుందని చెప్పారు.
ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే యంత్రాగంపై మిశ్రా వివరణ ఇస్తూ,.ప్రాజెక్టు స్థాయిని, ప్రాజెక్టు చేపట్టినవారు సాధించిన ప్రగతిని, సాధించిన విజయాల వివరాలను జియో ట్యాగింగ్ తో కూడిన ఫొటో గ్రాఫులతో సహా సమాచార వ్యవస్థ (ఇన్ ఫర్మేషన్ ఆర్కిటెక్చర్-ఇ.ఎ.) ద్వారా సమర్పించవలసి ఉంటుందన్నారు. ఆలస్యం జరిగిన పక్షంలో జాప్యానికి కారణాన్ని కూడా పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు జాప్యానికి దారితీసే పెండింగ్ అనుమతులు తదితర అంశాలపై ఇన్ ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ నుంచి ప్రత్యేక సమాచారాన్ని కోరామని,.. ప్రతిపాదనలు రాష్ట్రానికి బయటనుంచి వచ్చినవి అయితే, వాటికి ఎన్.సి.ఆర్.పి.బి. ఆమోదం తెప్పించేందుకు ఈ సమాచారం దోహదపడుతుందని మిశ్రా చెప్పారు.
ఈ సాఫ్ట్ వేర్ వ్యవస్థ సమాచారంపై విశ్వసనీయత ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఒకసారి పొందుపరిచిన సమాచారాన్ని, NCRPBకు చెందిన ఆర్థిక పరిపాలనా అధికారి తప్ప ఎవరూ సవరించడానికి వీలుండదని, అది కూడా పరిపాలనా, ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ అనుమతితోనే జరగాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సాఫ్ట్ వేర్ అప్ లోడ్ చేసే మంజూరు ఉత్తర్వులు, గ్యారంటీ ఉత్తర్వులను ఎంపిక చేసిన కొంతమందికి, ఆ హక్కులు ఉన్నవారు మాత్రమే చూడగలరని తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్ లాగిన్ ఐ.డి., పాస్ వర్డ్ లను జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్.) పరిధిలోని ఆయా రాష్ట్రాలకు చెందిన అమలు యంత్రాగాలకు పంపించామని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఉత్తర్వులను చూసే హక్కులు కొంత మంది అధికారులు అప్పుడప్పుడు చూసే హక్కులు కల్పించామని, ప్రాజెక్టులపై వారు నిర్వహణా విధుల నిర్వర్తించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశామని మిశ్రా చెప్పారు.
నెలవారీ రీపేమెంట్ నోటీసులను ముందస్తుగా తనంతట తానే జారీ చేసేందుకు పి-ఎం.ఐ.ఎస్. సాఫ్ట్ వేర్ వ్యవస్థను గత రెండు నెలలుగా విజయవంతంగా వాడుతున్న జాతీయ రాజధాని ప్రాంతపు బోర్డును దుర్గా శంకర్ మిశ్రా అభినందించారు. తమకు సంబంధించిన ప్రాజెక్టుల సమాచారాన్ని నవీకరించవలసిందిగా ఇన్ ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ వ్యవస్థను ఆయన కోరారు. రుణాల పంపిణీలో అడ్డంకులను తొలగించేందుకు, ఆమోదం సమస్యను పరిష్కరించి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇది దోహదపడుతుందని దుర్గాశంకర్ మిశ్రా అన్నారు.
***
(Release ID: 1660009)
Visitor Counter : 168