వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వరి / బియ్యం సేకరణ ఈ రోజు నుండి ప్రారంభం.

"ఏ" గ్రేడ్ - బలవర్ధకమైన బియ్యపు గింజల (ఎఫ్.ఆర్.కె) కోసం ఒకే రకమైన నిర్దేశిత లక్షణాలు మరియు బలవర్ధకమైన బియ్యపు గింజల (ఎఫ్.ఆర్.కె) సేకరణ కోసం సాధారణ బియ్యాన్ని జారీ చేయడం కూడా ఇదే మొదటిసారి

Posted On: 28 SEP 2020 4:00PM by PIB Hyderabad

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్) 2020-21 (ఖరీఫ్ పంట) లో వరి / బియ్యం కోసం, మిగిలిన అన్ని రాష్ట్రాలు, 2020 సెప్టెంబర్, 28వ తేదీ నుండే, తమ సేకరణ కార్యకలాపాలను ప్రారంభించడానికి / కొనసాగడానికి, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ ఇప్పుడు  అనుమతినిచ్చింది.  అదేవిధంగా, కేరళకు సంబంధించి (21.09.2020 తేదీ నుండి); పంజాబ్ మరియు హర్యానాకు సంబంధించి (26.09.2020 తేదీ నుండి) విషయంలో సేకరణ కాలంలో మార్పు లేదు.  రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎం.ఎస్.‌పి) వద్ద వేగంగా విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. 

రానున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్) 2020-21 లో సెంట్రల్ పూల్ సేకరణ కోసం ఆహార ధాన్యాల ఒకే రకమైన నిర్దేశిత లక్షణాలను ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ జారీ చేసింది.  ప్రామాణిక అభ్యాసం ప్రకారం ఈ లక్షణాలు వరి, బియ్యం మరియు ఇతర ముడి ధాన్యాలైన జోవర్, బజ్రా, మొక్కజొన్న మరియు రాగికి సంబంధించి జారీ చేయబడ్డాయి.  కె.ఎం.ఎస్. 2020-21 లో బియ్యం సేకరణ కోసం జారీ చేసిన ఒకే రకమైన నిర్దేశిత లక్షణాల ఆధారంగా టి.డి.పి.ఎస్. మరియు ఇతర సంక్షేమ పథకాల క్రింద పంపిణీ కోసం రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు జారీ చేయడానికి బియ్యం యొక్క ప్రమాణాలు కూడా ఈ నిర్దేశిత లక్షణాలలో ఉన్నాయి.

బలవర్ధక మైన బియ్యం నిల్వల సేకరణ విషయంలో, "ఏ" గ్రేడ్ బలవర్ధకమైన బియ్యం గింజలు (ఎఫ్.‌ఆర్.‌కె) మరియు సాధారణ బియ్యం కోసం, ఒకే రకమైన నిర్దేశిత లక్షణాలను కూడా మొదటి సారి జారీ చేయడం జరిగింది, వీటిలో 1 శాతం ఎఫ్.‌ఆర్.‌కె.  (డబ్ల్యూ / డబ్ల్యూ) రకం,  సాధారణ బియ్యం స్టాక్ తో కలిసి ఉంటాయి.  రైతులు తమ ఉత్పత్తులకు తగిన ధర లభించేలా చూడడానికి వీలుగా, ఒకే రకమైన నిర్దేశిత లక్షణాలకు, విస్తృత ప్రచారం జరిగేలా చూడాలనీ, నిల్వలను తిరస్కరించడం పూర్తిగా నివారించాలనీ, రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. కే.ఎమ్.ఎస్. 2020-21 సమయంలో సేకరణ, ఒకే రకమైన నిర్దేశిత లక్షణాలకు అనుగుణంగా ఉండాలని, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మరియు భారత ఆహార సంస్థ లకు సూచించడం  జరిగింది.  రైతులకు ఇబ్బంది లేని విధంగా, సేకరణ మరియు కనీస మద్దతు ధర (ఎం.ఎస్.‌పి) చెల్లింపులు జరిగేలా చూడాలని, భారత ఆహార సంస్థ మరియు రాష్ట్రాల సేకరణ ఏజెన్సీలను ఆదేశించడం జరిగింది. 

 

*****



(Release ID: 1659880) Visitor Counter : 145