రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హెచ్-సీఎన్‌జీ వినియోగాన్ని అనుమతిస్తూ ప్రకటన
Posted On:
28 SEP 2020 12:44PM by PIB Hyderabad
దేశంలో రవాణా కోసం స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా, సీఎన్‌జీ ఇంజిన్లలో హెచ్-సీఎన్‌జీ (18 శాతం హైడ్రోజన్ మిశ్రమం) వినియోగాన్ని అనుమతిస్తూ కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. రవాణా కోసం స్వచ్ఛమైన ఇంధనాలుగా అనేక ప్రత్యామ్నాయ ఇంధనాలను మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాహనాల కోసం, హైడ్రోజన్ సమృద్ధిగా ఉన్న సంపీడన సహజ వాయువు (హెచ్-సీఎన్‌జీ) లక్షణాలను (ఐఎస్ 17314:2019) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కూడా రూపొందించింది. సీఎన్‌జీతో పోలిస్తే, హెచ్-సీఎన్‌జీ ద్వారా వెలువడే ఉద్గారాలను పరిశీలించడానికి కొన్ని సీఎన్‌జీ ఇంజన్లను పరీక్షించారు.
హెచ్-సీఎన్‌జీని రవాణా వాహనాల ఇంధనంగా చేరుస్తూ, మోటారు వాహనాల చట్టం-1989కి సవరణలు చేస్తూ, జీఎస్‌ఆర్ 585 (ఇ) ద్వారా ఈనెల 25వ తేదీన మంత్రిత్వ శాఖ ప్రకటన ఇచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదాను జులై 22న ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీనిపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు రాలేదు.
***
(Release ID: 1659749)
Visitor Counter : 244