ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం

కోవిడ్ నుంచి కొత్తగా కోలుకున్న

76% కేసులు 10 రాష్ట్రాలనుంచే

Posted On: 27 SEP 2020 1:05PM by PIB Hyderabad

దేశంలో కొద్ది రోజులుగా వరుస తప్పకుండా కోవిడ్ నుంచి బైటపడుతున్న కేసుల సంఖ్య కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,043 మంది  కోవిడ్ నుంచి కోలుకున్నారు.  వీళ్లలో 76% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. అందులో మహారాష్ట్ర 23,000 కు పైగా కేసులతో ముందు వరుసలో ఉండగా 9,000 పైబడ్ద ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.

గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 88,600 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. వాటిలో 77% కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి. అందులోనూ 20,000 కు పైగా కొత్త కేసులు నమోదు చేసుకున్న  మహారాష్ట్ర ముందుండగా, 8,000 కు పైగా కేసులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోను, 7,000 కు పైగా కేసులతో కర్నాటక మూడో స్థానంలోను నిలిచాయి.

గడిచిన 24 గంటలలో 1124 మరణాలు నమోదయ్యాయి. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 84% కోవిడ్ మరణాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 430 (38%) మరణాలు సంభవించగా, కర్నాటకలో 86 మరణాలు, తమిళనాడులో 85 మరణాలు నమోదై ఆ తరువాత స్థానాలు ఆక్రమించాయి.  

****



(Release ID: 1659541) Visitor Counter : 174