ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుదల కొనసాగింపు
గడిచిన 24 గంటల్లో 93 వేలమందికి పైగా విముక్తి
చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు ఐదురెట్లు ఎక్కువ
Posted On:
26 SEP 2020 11:06AM by PIB Hyderabad
ప్రతిరోజూ కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో భారత దేశంలో కోలుకుంటున్నవారి శాతం పెరుగుదలబాటలో సాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 93,420 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 48,49,584 కి చేరింది.
ఇలా రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ ఉందటంతో కోలుకుంటున్న వారి శాతం పైపైకి ఎగబాకుతూ వస్తోంది. ప్రస్తుతం అది ఈరోజుకు 82.14% చేరింది. ఒక్క రోజులో కోలుకున్న వారి సంఖ్య విషయంలో భారతదేసం అంతర్జాతీయ స్థాయిలో రికార్డు స్థాయిలో అగ్రభాగాన నిలిచింది.
కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకుంటున్నవారు భారత్ లో ఎక్కువగా ఉండటంతో చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య అంతరం బాగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు ఐదురెట్లు ఎక్కువగా ఉన్నారు. కోలుకున్నవారి సంఖ్య 48,49,584 కాగా చికిత్సలో ఉన్నవారు 9,60,969 మంది. దీంతో వీరి మధ్య తేడా దాదాపు 39 లక్షలు ( 38,88,615) అయింది.
దీనివలన మొత్తం పాజిటి వేసులలో ఇప్పుడు చికిత్స భారం కేవలం 16.28శాతానికే పరిమితమైనట్టయింది. ఈ తగ్గుదల కూడా క్రమబద్ధంగా సాగుతోంది.
జాతీయ స్థాయికి తగినట్టుగానే 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా కోలుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా నమోదవుతూ వస్తోంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 73% కొత్తగా కోలుకున్న కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 19.592 మంది ఒక్క రోజులో కోలుకున్నారు.
ఇలాంటి సుస్థిరమైన ఫలితాలు రావటానికి కేంద్రం అనుసరిస్తున్న “ పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే ముప్పేట వ్యూహమే కారణం. వైరస్ ను వెంటాడే వైఖరి ద్వారా ప్రభుత్వం ఈ మహమ్మారిని తరిమికొట్టటానికి కృషి చేస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పరీక్షలు జరపటం ద్వారా సకాలంలో బాధితులను గుర్తించి చికిత్స అందించే వెసులుబాటు కలిగింది. గట్టి నిఘాపెట్టటం దీనికి సాయపడింది. ఎవరెవరికి సోకే అవకాశముందో గుర్తించటం ద్వారా వ్యాప్తిని నిరోధించగలిగారు.
వైద్య పరిరక్షన చర్యలకు కేంద్రం చికిత్సకు ప్రామాణిక మార్గదర్శకాలు జారీచేస్తూ అత్యంత నాణ్యమైన, ఏక రూప వైద్యం అందుబాటులో ఉండేలా కృషి చేసింది. లక్షణాల స్థాయికి తగినట్టుగా ఆస్పత్రులు, హోమ్ ఐసొలేషన్ గుర్తించటం, అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన ఆధారాలను చికిత్సలో వినియోగించటం సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రాలు చేస్తున్న కృషికి కేంద్రం సాంకేతికంగా, ఆర్థికంగా, వస్తు పరంగా, ఇతర వనరులపరంగా సాయమందిస్తూ వస్తోంది.
***
(Release ID: 1659421)
Visitor Counter : 158