మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

శిక్షక్ పర్వ్ ఆధ్వర్యంలో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యపై జాతీయ వెబినార్

Posted On: 25 SEP 2020 5:28PM by PIB Hyderabad

కొత్త విద్యా విధానం (ఎన్.ఈ.పి-2020) లోని ముఖ్య లక్షణాలను ఎత్తిచూపడానికి శిక్షక్ పర్వ్ చొరవతో విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య పై ఈ రోజు వెబినార్ నిర్వహించింది.  ఉపాధ్యాయులను సత్కరించడానికి మరియు కొత్త విద్యా విధానం-2020 ను ముందుకు తీసుకెళ్లడానికి విద్యా మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్, 8వ తేదీ నుండి 25వ తేదీ వరకు శిక్షక్  పర్వ్ ను నిర్వహించింది.

ఈ.సి.సి.ఈ. పై ఏర్పాటైన ఈ సదస్సును - డాక్టర్ రోమిలా సోని, ఎన్.సి.ఈ.ఆర్.టి., అసోసియేట్ ప్రొఫెసర్; అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ వెనితా కౌల్;  ఎన్.సి.ఈ.ఆర్.టి. కి చెందిన ప్రొఫెసర్ సునీతి సన్వాల్ నిర్వహించారు. సిక్కిం దక్షిణ జిల్లా, కెవ్ జింగ్, లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్, శ్రీ మోతీలాల్ కొయిరాలాతో పాటు ప్రముఖ వక్తలు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. 

ప్రొఫెసర్ సునీతి  చర్చను ప్రారంభిస్తూ, ఈ.సి.సి.ఈ. కి సంబంధించి జాతీయ విద్యా విధానం-2020 యొక్క సిఫారసులను వివరించారు. గర్భంలో ఉన్నప్పటినుండి రెండు సంవత్సరాల వయస్సు వరకు జీవిత ప్రారంభ సంవత్సరాల్లో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడారు.  పోషణ, ఆరోగ్యం, అభ్యాసం మధ్య సంబంధాన్ని ఆమె మరింతగా తెలియజేశారు. జీవితం ప్రారంభంలోని మొదటి 2 సంవత్సరాల కాలంలో పిల్లల వేగవంతమైన అభివృద్ధి గురించి కూడా ఆమె సుదీర్ఘంగా వివరించారు.  పిల్లల జీవిత ప్రారంభ సంవత్సరాల్లో పోషణ, వారి ఆరోగ్యంతోనూ, తరువాతి సంవత్సరాల్లో వారి విద్యాభివృద్ధితోనూ గణనీయంగా ముడిపడి ఉంటుందని, పరిశోధనా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని ఆమె మరింతగా నొక్కి చెప్పారు. 

ఎన్.ఈ.పి. అమలుకు కేంద్ర ప్రాంతాల గురించి, డాక్టర్ కౌల్, వివరిస్తూ,  పిల్లల ప్రారంభ దశలో విద్యా నైపుణ్యాల అభివృద్ధితో పాటు, అదనంగా పిల్లలలో సాంఘిక నైపుణ్యాలను పెంపొందించడం చాలా ముఖ్యమని, నొక్కి చెప్పారు.  నాణ్యమైన ఈ .సి.సి.ఈ. ని అందించడంలో కమ్యూనిటీ స్థాయిలో ఆదరించి మాట్లాడడంతో పాటు, తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనది.   పిల్లలకు ఆనందకరమైన, ఆటల-ఆధారిత మరియు ఆసక్తి ఆధారిత కార్యకలాపాలకు చెందిన ఉదాహరణల ద్వారా అభివృద్ధికి తగిన విషయ పరిజ్ఞానం మరియు బోధన యొక్క ప్రాముఖ్యతను, డాక్టర్ కౌల్, ఎత్తి చూపారు. ప్రీ-స్కూల్ నుండి గ్రేడ్-1 వరకు పిల్లలను సజావుగా మార్చడానికి పాఠ్యాంశాల యొక్క విస్తరణ చాలా ప్రభావవంతంగా ఉంటుందని డాక్టర్ కౌల్ ఎన్.ఈ.పి-2020 ని ప్రశంసించారు.

 

 

 

పిల్లలను చురుకుగా, ఆరోగ్యంగా మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంచడానికి పిల్లల యోగా వంటి ఈ.సి.సి.ఈ. కింద ఆవిష్కరణలు మరియు కార్యకలాపాలను సిక్కిం దక్షిణ జిల్లా,  కెవ్ జింగ్, ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ మోతీలాల్ కొయిరాలా పంచుకున్నారు.  పిల్లలకు బొమ్మలు, ఆట సామగ్రి, పుస్తకాలు మరియు పాఠశాలలో తరగతి గదులను గొప్పగా రూపొందించినట్లైతే, పిల్లలు ఉల్లాసభరితమైన అభ్యాస కార్యకలాపాలలో పాల్గొంటారని కొయిరాలా తెలియజేశారు.  పాఠశాలలకు పిల్లలను ఆకర్షించడంలో ఈ కార్యకలాపాలు సహాయపడతాయనీ, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు పెరుగుతుందనీ, ఆయన ఉద్ఘాటించారు.

తన ముగింపు వ్యాఖ్యలలో డాక్టర్ సేనాపతి ఈ సదస్సు కార్యకలాపాలను సంగ్రహంగా తెలియజేశారు.  ఈ.సి.సి.ఈ స్థాయి నుండి బోధించవలసిన విలువలను ప్రతిబింబించే భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేయడానికి కొత్త విద్యా విధానం-2020 సహాయపడుతుందని ఆయన వివరించారు.

*****



(Release ID: 1659237) Visitor Counter : 120