పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశీయ విమాన సర్వీసులు మొదలైన తర్వాత
కోటి దాటిన ప్రయాణికుల సంఖ్య
మే 25నుంచి లక్షకుపైగా సర్వీసుల నిర్వహణ
1,19,702కు పెరిగిన ఒకరోజు ప్రయాణికుల సంఖ్య
Posted On:
25 SEP 2020 4:08PM by PIB Hyderabad
దేశీయ విమాన సర్వీసులు మొదలైనప్పటినుంచి వాటిలో ప్రయాణించిన వారి సంఖ్య కోటి దాటింది. 2020వ సంవత్సరం మే 25న దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ నడిపిన 1,08,210 విమాన సర్వీసులలో కోటిమందికిపైగా ప్రయాణించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు. కోవిడ్ వైరస్ ప్రబలడానికు ముందున్న స్థాయికి దేశీయ విమానయానం చేరుకుంటోందని ఆయన అన్నారు. ఆత్మనిర్భర భారత్ కలల సాకారం దిశగా ఇంతటి సానుకూల ఫలితాలు సాధించడంలో ప్రమేయం ఉన్న సబంధిత అధికారులు, భాగస్వామ్య వర్గాలవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
2020 సెప్టెంబరు 24న విమానాల్లో బయలుదేరిన మొత్తం ప్రయాణికుల సంఖ్య 1,19,702, కాగా విమానాల్లో గమ్యస్థానాాలు చేరుకున్న వారి సంఖ్య 1,21,126 గా నమోదైనట్టు కేంద్ర మంత్రి తెలిపారు. విమానాశ్రయాల్లో బయలు దేరిన సర్వీసుల సంఖ్య 1,393కాగా, చేరుకున్న వాటి సంఖ్య 1394 అని తెలిపారు. దీనితో విమాన సర్వీసుల ప్రయాణాల సంఖ్య 2,787గా నమోదైందని పేర్కొన్నారు. దీనితో దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో ఒకరోజు లావాదేవీలు జరిపిన వారి మొత్తం సంఖ్య 2,40,828కు చేరుకున్నట్టు మంత్రి తెలియజేశారు.
కోవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా దేశీయ విమానాలను, వాణిజ్య సర్వీసులను 2020, మార్చి 25న ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, రెండు నెలల తర్వాత 2020, మే నెల 25న ఈ విమాన సర్వీసులు తిరిగి మొదలయ్యాయి.
***
(Release ID: 1659187)
Visitor Counter : 178