గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఆరోగ్యం, పౌష్టికాహార సమస్యలపై అవగాహనను పెంచేందుకు రాష్ట్రీయ పోషణ్ మాహ్ లో క్రియాశీలంగా పాల్గొంటున్న స్వయం సహాయక బృందాలు, వారి డే-ఎన్ఆర్ ఎల్ ఎం ఫెడరేషన్‌లు , కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
Posted On:
24 SEP 2020 1:00PM by PIB Hyderabad
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో రాష్ట్రీయ పోషణ్ మాహ్‌ను నిర్వహిస్తారు.
బాలలు , కౌమారదశలోని వారు, గర్భిణులు, బాలింతలలో పౌష్టికాహార లోపాన్ని తగ్గించి సంపూర్ణ పోషకాహారంపై వారిలో అవగాహన పెంపొందించేందుకు . ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చే కృషిని వేగవంతం చేసేందుకు విస్తృత ప్రజానీకాన్నిచేరుకునేందుకు నిర్దేశించిన విస్తృత పథకం పోషణ్ అభియాన్ (2018) పథకం .
ఈ రాష్ట్రీయ పోషన్ మాహ్ ను నిర్వహించేందుకు అవసరమైన అన్ని సూచనలు, మార్గదర్శనం, ప్రత్యేకంగా దృష్టిపెట్టవలసిన అంశాల గురించి కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ రాష్ట్రాల మిషన్‌లకు తెలియజేసింది. 2020 సెప్టెంబర్ 7న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన ఒక వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు.పోషణ్ మాహ్ కార్యకలాపాలపై చర్చించి వాటి గురించిన కార్యకలాపాల ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోషణ్ మాహ్ జాతీయ కార్యక్రమానికి అనుగుణంగా తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలలను గుర్తించడం, కిచెన్ గార్డెన్‌లలో మొక్కలు నాటడం, వంటి వాటికి సంబంధించి రాష్ట్ర మిషన్‌లు కింది కార్యక్రమాలు చేపడుతున్నాయి.
1. పరిస్థితులు అనుకూలంగా ఉన్న చోట స్వయం సహాయక బృంద సభ్యులు, వారి ఫెడరేషన్లు క్రియాశీలంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం. కోవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ, మాస్కుధరించడం,చేతులు శుభ్రంగా కడుగుకొని ,శానిటైజర్ వాడుతూ ఈ కార్యక్రమాలలో పాల్గొనడం.
2. స్వయం సహాయక బృందాలు, వాటి ఫెడరేషన్ల గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసి తల్లిపాల ప్రాముఖ్యత, అనుబంధ ఆహారం గురించి తెలియజెప్పడం. కోవిడ్ -19 కాలంలో 0-24 నెలల వయసుగల పిల్లలో రోగనిరోధక శక్తిపెంచేందుకు వీలుగా ప్రాథమిక దశలోనే పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని గుర్తించడం. పోషక విలువలు కలిగిన తోటలను పెంచడం, ఇంకా రాష్ట్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాలు.
3. కమ్యూనిటీ కేడర్లు కేంద్ర ఆరోగ్య శౄఖ, మహిళా శిశు సంక్షేమ విభాగం, ఇతర విభాగాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలలో కమ్యూనిటీ కేడర్లు పాల్గొంటారు. కీలక అంశాలపై వెబినార్లు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు విహెచ్ఎస్ ఎన్‌డి, ఆన్‌లైన్ చర్చలు వంటివి.
4. స్వయం సహాయకబృందాలకు చెందిన సభ్యులచే పోషక విలువలు కలిగిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం, ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్‌తో కలిపి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ప్రచారం నిర్వహించడం.
5 సబ్బుతో చేతులు కడుగుకొనడం, మాస్కుధరించడం, సామాజిక దూరం పాటంచడం రోజు వారీ కార్యకలాపంగా ప్రోత్సహించాలి.
6. టెక్నాలజీ ప్లాట్‌ఫారంలను ఉపయోగించి కీలకమైన సమాచారాన్ని అందించాలి. ఉదాహరణకు వాట్సప్,ఆన్‌లైన్ చర్చలను ఉపయోగించి ఆడియో వీడియో సందేశాన్ని అందించాలి. అలాగే ఏ ఇతర దృశ్యమాధ్యమాన్ని అయినా అంటే ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటిసోషల్ మీడియా వేదికలను ఉపయోగించి పౌష్టికాహార ప్రోత్సాహక కార్యకలాపాలను ప్రచారం చేయాలి.
జాతీయ మిషన్ నుంచి అందిన మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్రాల మిషన్‌లు పోషణ్ మాహ్‌ను పూర్తి ఉత్సాహంతో చేపడుతున్నాయి. కోవిడ్ -19 ప్రోటోకాల్స్‌ను ఉపయోగించి వీటిని చేపడుతున్నారు. వెబినార్లు, పోషణ్ ర్యాలీలు, పోషణ్‌రంగోలీలు, పోషణ్ ప్రతిజ్ఞలు, వంటల పోటీలు, పోషక విలువలు కలిగిన మొక్కల పెంపకం పై అవగాహన పెంపొందించడం, సమ్మిళిత సమావేశాలను క్షేత్రస్థాయిలో ఏర్పాటుచేస్తున్నారు. ప్రజలు . పోషణ్ మాహ్‌ను విజయవంతం చేయడం కోసం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత విషయంలో ప్రజలు మరింత జాగ్రత్త వహించేందుకు అవకాశం కలుగుతుంది. 2016 లో దశసూత్ర వ్యూహంను అనుసరించడంద్వారా, పౌష్టికాహారం, ఆరోగ్యం, డబ్ల్యుఎఎస్‌హెచ్ (ఎఫ్.ఎన్.హెచ్.డబ్ల్యు)ను గ్రామీణాభివృద్ధిమంత్రిత్వశాఖ కింద గల దీన్ దయాళ్ అంత్యోదయ యోజన -జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (డిఎవై-ఎన్.ఆర్.ఎల్.ఎం) లక్ష్యాలలో అంతర్భాగంగా చేయడం జరిగింది.
డిఎవై-ఎన్ఆర్ ఎల్ఎం పథకంకింద స్వయం సహాయక బృందాల సభ్యులు వారి కుటుంబసభ్యుల ఆరోగ్యం ,పౌష్టికాహారం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలను స్వయం సహాయక బృందాల అజెండాలో చేర్చేందుకు ఎంపిక చేసిన ప్రాంతాలలో రాష్ట్ర మిషన్‌లు పలు చర్యలు తీసుకుంటున్నాయి.
దీనికితోడు, పోషణ్ అభియాన్‌కు మద్దతు తెలిపేందుకు, వారిలో సానుకూలమార్పు తీసుకువచ్చేందుకు రాష్ట్రాల మిషన్‌లుపోషణ్ అభియాన్ కింద పోషణ్ మాహ్, పోషణ్ పఖ్వాడా వంటి కార్యకలాపాలలో దేశవ్యాప్తంగా పాల్గొంటున్నాయి.
రాష్ట్రీయ పోషణ్‌మాహ్ వంటివి లబ్ధిదారులకు కీలక సందేశాన్ని మరింత గట్టిగా తెలియజేయడానికి డిఎవై ఎన్ఆర్ ఎల్ ఎం కృషిని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఉపకరిస్తాయి. అలాగే వివిధ పాలనా స్థాయిలలో స్టేక్‌హోల్డర్లను కలుపుకుపోవడానికి ఉపకరిస్తాయి.
2019 పోషణ్ మాహ్ సందర్భంఆ 11.39లక్షల కార్యకలాపాలు ఏర్పాటుచేశారు. వీటిలో 16.39 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. (జన్ ఆందోళన్ పోర్టల్ ఆధారంగా). దీనిని కేంద్ర మహిళ శిశు సంక్షేమం మంత్రిత్వశాఖ సన్నిహిత సమన్వయంతో నిర్వహించారు.ఇది పోషణ్ అభియాన్‌కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇది పోషణ్ మాహ్ 2020 కి ప్రస్తుతం జరుగుతున్న కార్యకలాపాలనూ చేపడుతోంది.
పోషణ్‌మాహ్ సందర్భంగా కోవిడ్ -19 నిరోధక మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా రాష్ట్రాలను కేంద్రం కోరింది .అలాగే కీలక సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, స్వయం సహాయ క బృందాలను, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్నివిరివిగా వాడుకోవాల్సిందిగా సూచించింది. రాష్ట్రా మిషన్‌లు నోడల్ అధికారిని గుర్తించి , కార్యాచరణను అభివృద్ధి చేశాయి. ఈ కార్యాచరణను జిల్లాలు, బ్లాక్ స్థాయి వరకు చేరేట్టుచర్యలు తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్యం, పంచాయతిరాజ్ సంస్థలు ఇతరులతో కలసి సమష్టిగా జిల్లా,బ్లాక్ స్థాయిలో మరింత మెరుగైన ప్రణాళిక, సమన్వయంతో పోషణ్ మాహ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
***
(Release ID: 1658936)
Visitor Counter : 179