ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

6 నెలల్లో 3 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకున్న ఈ-సంజీవని

మొదటి 4 రాష్ట్రాల్లోనే 90% లబ్ధిదారులు

Posted On: 24 SEP 2020 4:09PM by PIB Hyderabad

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఈ-సంజీవని ఔట్ పేషెంట్ వెదిక మూడు లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకుంది. ఈ వేదిక ఏర్పాటు చేసిన ఆరు నెలల తక్కువ సమయంలోనే ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవటం విశేషం.

రోగులు ఎవరైనా డాక్టర్ దగ్గర సలహాలు అందుకోవటానికి ఈ వేదిక వీలు కల్పిస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో రోగులకు డాక్టర్ అందుబాటులో ఉండేలా ఆరోగ్య మంత్రిత్వశాఖ దీన్ని ఏర్పాటు చేసింది. భౌతిక దూరం పాటిస్తూనే డాక్టర్ ను సంప్రదించటానికి ఇది సరైన మార్గమని అతి తక్కువకాలంలోనే రుజువైంది. కోవిడ్ తో సంబంధం లేని అత్యవసర వైద్య సేవలు అందించటానికి ఈ-సంజీవని ఎంతగానో ఉపయోగపడింది. ఇంత పెద్ద సంఖ్యలో రోగులు ఉపయోగించుకోవటమే దీని విజయానికి సంకేతంగా నిలిచింది.

1,29,801 డిజితల్ సంప్రదింపులతో తమిళనాడు రాష్ట్రం అత్యధికంగా టెలీ సంప్రదింపులను సమర్థంగా వినియోగించుకొని మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఆగస్టు 9 నాటికి 32,035 సంప్రదింపులు నమోదు కాగా అదే నెల 19 నాటికి ఆ సంఖ్య 56,346 కు చేరింది. ఈ రాష్ట్రం ఒక్కటే సెప్తెంబర్ 8 నాటికి దాదాపు లక్ష ( 97,204 ) సంప్రదింపులు పూర్తిచేసింది. కోవిడ్-19 వలన తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో అత్యధి కశాతం వైద్య సేవలు కరోనామీద దృష్టి సారించిన వేళ ఈ-సంజీవని ఎంతగానో ఉపయోగపడింది.

తమిళనాడు తరువాత ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 96,151 సంప్రదింపులు నమోదు కాగా, ఆ తరువాత స్థానాల్లో కేరళ ( 39,291), ఉత్తరాఖండ్ ( 10,391) ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు కలిసి 2,69,264 సంప్రదింపులు (మొత్తంలో 89.75%) జరిపాయి.

గుజరాత్ రాష్ట్రం, చత్తీస్ గఢ్ రాష్ట్రం, జమ్మూ-కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఈ-సంజీవని వేదికమీదికి రావటంతో ఈ వేదికను వాడుకుంటున్న మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 26 కు చేరింది. ఈ సంజీవని ఒపిడి మీద దాదాపు 4,600 మంది డాక్టర్లు శిక్షణ పొందారు. జాతీయ నెట్ వర్క్ లో రోజుకు సగటున 600 చొప్పున సంప్రదింపులు నమోదయ్యాయి.

టెలిమెడిసిన్ వేదిక ఈ-సంజీవని విజయవంతం కావటానికి ప్రధాన కారణం దీని నిర్వహణ కార్యకలాపాలు ఒక క్రమపద్ధతిలో సాగటం. రాష్ట్రాలకు, దీని నిర్వహణ చేపట్టిన సి-డాక్  మొహాలి కి మధ్య సమర్థవంతమైన అనుబంధం కుదరటం వల్లనే ఇది సాధ్యమైంది. దీనివలన వాడకందారులకు వేగంగా పొహీద్ బాక్ల్ లభిస్తూ వచ్చింది. దీనివలన నిర్వహణ సంస్థ కూడా చాలా వేగంగా స్పందించగలిగింది. అందుకు అనుగుణమ్గా ఈ-సంజీవని కూడా ఎప్పటికప్పుడు తన సామర్థ్యాన్ని, ఉత్పాదకతను పెంచుకుంటూ వచ్చింది. పైగా, కొత్త కొత్త సమస్యలవలన వాడకందారులకు అవసరమైన అదనపు సౌకర్యాలు కూడా కలపగలిగింది.

ఈ సంజీవని రెండు రకాల టెలి మెడిసిన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. డాక్టర్ నుంచి డాక్టర్ కు సలహాలు అందించే ఈ-సంజీవని ఒకటైతే,  డాక్టర్ నుంచి రోగికి సలహాలైచ్చే ఈ-సంజీవని ఒపిడి మరొకటి. మొదటిది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, క్షేమ కేంద్రాల ద్వారా అమలుచేశారు. మొత్తం 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల సమన్వయంతో గుర్తించిన ఒకవైద్య కళాశాల ద్వారా ఈ టెలీ సంప్రదింపులు  జరిగాయి. రాష్ట్రాలు అలాంటి హబ్ లను ఎంపిక చేసి ఈ సేవలు ప్రజారోగ్య కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లలో అందుబాటులోకి వచ్చేలా చూశాయి.

 ఆరోగ్య మంత్రిత్వశాఖ రెండో నమూనా టెలీ సంప్రదింపులు ఈ-సంజీవని ఒపిడి ద్వారా నేరుగా డాక్టర్ నుంచి రోగికే సలహాలు అందే ఏర్పాటు చేసింది.  2020 ఏప్రిల్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సేవ వలన కోవిడ్ తో సంబంధం లేని రోగులు ఎంతో లాభపడ్దారు. దీనివలన మిగిలిన ఎక్కువమంది డాక్టర్లు కోవిడ్ మీద దృష్టి కేంద్రీకరించటం సాధ్యమైంది.

 

***



(Release ID: 1658752) Visitor Counter : 241