ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశానికి, శ్రీ లంక కు మధ్య వర్చువల్ ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం

Posted On: 24 SEP 2020 12:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ లంక ప్రధాని శ్రీ మహిందా రాజపక్షే ఈ నెల 26న శనివారం ఒక వర్చువల్ ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోనున్నారు.

ఈ వర్చువల్ ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం ఇద్దరు నేతలకు శ్రీ లంక లో పార్లమెంటరీ ఎన్నికలు ముగిసిన వెనువెంటనే ఈ రెండు దేశాల మధ్య కాలపరీక్షకు తట్టుకొని నిలచిన స్నేహపూర్వక సంబంధాల సందర్భంలో ఉభయ పక్షాల సంబంధాల తాలూకు విస్తృత ఫ్రేమ్ వర్క్ ను సమగ్రంగా సమీక్షించేందుకు ఓ అవకాశాన్ని ఇస్తోంది. 

శ్రీ లంక ప్రధాని శ్రీ మహిందా రాజపక్షే ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ జవాబిస్తూ, ‘‘సంయుక్తంగా చేపట్టే ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్ష కోసం నేను ఆశాభావంతో ఎదురుచూస్తున్నాన’’ని పేర్కొన్నారు.
    
‘‘మనం మన సహకారాన్ని కోవిడ్ అనంతర కాలంలో మరింత పెంచుకొనే మార్గాలను తప్పక వెతకాలి’’ అని ఆయన అన్నారు.

***

 


(Release ID: 1658651) Visitor Counter : 203