రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హైడ్రోజన్ ఇంధన ఆధారిత వాహనాల భద్రత నిర్ధరణ ప్రమాణాలు విడుదల
Posted On:
24 SEP 2020 12:53PM by PIB Hyderabad
హైడ్రోజన్ ఇంధనం ద్వారా నడిచే వాహనాల భద్రత నిర్ధరణ ప్రమాణాలను 'కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ' ప్రకటించింది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989కి ఈనెల 23వ తేదీన జీఎస్‌ఆర్ (ఇ) చేసిన సవరణ ద్వారా కొత్త ప్రమాణాలను మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
సమర్థవంత ఇంధన వినియోగం, పర్యావరణహితమైన హైడ్రోజన్ ఇంధన ఆధారిత వాహనాలను దేశంలో ప్రోత్సాహించడానికి ఇది ఊతమిస్తుంది.
హైడ్రోజన్ వాహనాల పరీక్ష కోసం; ఆ తరహా వాహనాల ఉత్పత్తిదారులు, పంపిణీదారులు అందుబాటులో ఉన్న ప్రమాణాలను కలిగి ఉన్నారు. ఈ ప్రమాణాలు ప్రస్తుత అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి సమానంగా ఉన్నాయి.
***
(Release ID: 1658644)
Visitor Counter : 250