వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు, 2020 ని ఆమోదించిన పార్లమెంట్

ఈ బిల్లు రైతులకే కాకుండా, వినియోగదారులు, పెట్టుబడిదారులకు కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు కల్పిస్తుంది : శ్రీ దాన్వే రావుసాహెబ్ దాదారావ్

శీతల గిడ్డంగులలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, ఆహార సరఫరా గొలుసు ఆధునీకరణ, ధర స్థిరత్వాన్ని తీసుకురావడం, పోటీ మార్కెట్ వాతావరణాన్ని సృష్టించడం మరియు వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలను నివారించడానికి చట్టం సహాయపడుతుంది.

Posted On: 22 SEP 2020 1:22PM by PIB Hyderabad

తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లిపాయ, బంగాళాదుంపలు వంటి వస్తువులను నిత్యావసర వస్తువుల జాబితా నుండి తొలగించే నిబంధనలతో కూడిన నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020ని  ఈ రోజు రాజ్యసభ ఆమోదించింది. అంతకుముందు, 2020 జూన్ 5 న ప్రకటించిన ఆర్డినెన్స్‌ల స్థానంలో 2020 సెప్టెంబర్ 14 న లోక్‌సభలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ దాన్వే రావుసాహెబ్ దాదారావ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును లోక్‌సభ 2020 సెప్టెంబర్ 15న ఆమోదించింది. 

ప్రైవేట్ పెట్టుబడిదారులు తమ వ్యాపార కార్యకలాపాలలో అధిక నియంత్రణ జోక్యం జరుగుతుందనే భయాలను తొలగించడం ఈసి (సవరణ) బిల్లు 2020 లక్ష్యం. ఉత్పత్తి, నిల్వచేయడం, తరలించడం, పంపిణీ చేయడం, సరఫరా చేసే స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థలను ఇంకా బలోపేతం చేయడానికి అవకాశం ఇస్తుంది. వ్యవసాయ రంగంలోకి ప్రైవేట్ రంగం / విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది కోల్డ్ స్టోరేజ్‌లలో పెట్టుబడులు పెట్టడానికి, ఆహార సరఫరా గొలుసు ఆధునీకరణకు సహాయపడుతుంది.

ప్రభుత్వం, నియంత్రణ వాతావరణాన్ని సరళీకృతం చేస్తూనే, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా చూసింది. యుద్ధం, కరువు, అసాధారణమైన ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాలు వంటి పరిస్థితులలో, అటువంటి వ్యవసాయ ఆహార పదార్థాలను నియంత్రించవచ్చని సవరణలో పేర్కొంది. ఏదేమైనా, విలువ గొలుసు పాల్గొనేవారి వ్యవస్థాపిత సామర్థ్యం, ఎగుమతిదారు ఎగుమతి డిమాండ్ అటువంటి స్టాక్ పరిమితి విధించడం నుండి మినహాయించబడతాయి, వ్యవసాయంలో పెట్టుబడులను నిరుత్సాహపరచకుండా చూస్తారు.

ఈ రోజు ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించే ముందు చర్చకు సమాధానమిస్తూ, వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ దాన్వే రావుసాహెబ్ దాదారావు మాట్లాడుతూ నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులను వృధా అవ్వకుండా నిరోధించడానికి ఈ సవరణ అవసరమని అన్నారు.  ఈ సవరణ రైతులకు మాత్రమే కాకుండా వినియోగదారులకు, పెట్టుబడిదారులకు కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, ఖచ్చితంగా మన దేశాన్ని స్వావలంబన చేస్తుందని అన్నారు. ఈ సవరణ వ్యవసాయ రంగం మొత్తం సరఫరా గొలుసు విధానాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా మరియు వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని సాధించడానికి కూడా ఈ సవరణ సహాయపడుతుందని తెలిపారు. 

నేపథ్యం::

చాలా వ్యవసాయ వస్తువులలో భారతదేశం మిగులుగా మారినప్పటికీ, నిత్యావసర వస్తువుల చట్టం కారణంగా వ్యవస్థాపక స్ఫూర్తి మందగించడంతో కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు, ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల్లో పెట్టుబడులు లేకపోవడం వల్ల రైతులు మంచి ధరలను పొందలేకపోయారు.పంటలు అధిక దిగుబడి ఉన్నప్పుడు, ముఖ్యంగా పాడైపోయే వస్తువుల వల్ల రైతులు భారీ నష్టపోతారు. కోల్డ్ స్టోరేజ్‌లలో పెట్టుబడులు పెట్టడానికి మరియు ఆహార సరఫరా గొలుసు ఆధునీకరణకు ఈ చట్టం సహాయపడుతుంది. ధర స్థిరీకరణను  తీసుకువచ్చేటప్పుడు ఇది రైతులు మరియు వినియోగదారులకు సహాయపడుతుంది. ఇది పోటీ మార్కెట్ వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల జరిగే వ్యవసాయ ఉత్పత్తులను వృధా చేయడాన్ని కూడా నివారిస్తుంది.

                                   

*****

 
 

(Release ID: 1657791) Visitor Counter : 860