రైల్వే మంత్రిత్వ శాఖ

భారతీయ రైల్వేల్లో “స్వచ్ఛతా పక్వాడా” అమలు “స్వచ్ఛత - పర్యావరణం” పై రైల్వో బోర్డు ఆధ్వర్యంలో వెబినార్

యునెప్ భాగస్వామ్యంతో ఉత్తర రైల్వే ద్వారా కార్యక్రమ నిర్వహణ

రైల్వే స్టేషన్లు, రైళ్లు, రైలు మార్గాలు, రైల్వే కాలనీలతోపాటు అన్ని రైల్వే ఆవరణల్లో భారీ స్థాయిలో పరిశుభ్రత, శానిటైజేషన్ కార్యక్రమాలు

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టితో కార్యక్రమ నిర్వహణ

Posted On: 20 SEP 2020 9:30AM by PIB Hyderabad

   “స్వచ్ఛతా పక్వాడా”  లేదా  “స్వచ్ఛతా పక్షంపేరిట పక్షం రోజుల కార్యక్రమం ప్రస్తుతం భారతీయ రైల్వేల్లో అమలవుతోంది. 2020 సెప్టెంబరు 16 మొదలైన కార్యక్రమం సెప్టెంబర్ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. స్వచ్ఛతా పక్షం తొలిరోజున అన్ని రైల్వే జోన్ల ప్రధాన కార్యాలయాల్లో, డివిజనల్ కార్యాలయాల్లో, రైల్వే సంస్థల ఆవరణల్లో రైల్వే ఉద్యోగులంతా స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. పక్షం రోజుల్లో, రైల్వే స్టేషన్లు, రైళ్లు, రైలు మార్గాలు, రైల్వే కాలనీలు, ఇతర రైల్వే సంస్థల్లో పారిశుద్ధ్య. కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనా కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ  పనులను చేపడుతున్నారు. మాస్కులు, శానిటైజర్లను కూడా పంపిణీ చేస్తున్నారు.

  కోవిడ్-19 వైరస్ నియంత్రణకు సంబంధించిన ముందస్తు జాగ్రత్త చర్యలపై, రైల్వే ఆవరణలను పరిశుభ్రంగా ఉంచవలసిన అవసరాన్ని గురించి అవగాహన కల్పంచేందుకు సమాచార, కమ్యుూనికేషన్  పద్ధతులను  వినియోగిస్తున్నారు. వెబినార్లను కూడా నిర్వహిస్తున్నారు. పక్షం రోజుల్లో రైలు మార్గాల, స్టేషన్ల, మరుగుదొడ్ల, రైల్వే డిపోల పరిశుభ్రతకు రైల్వే శాఖ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.

  నేపథ్యంలోస్వచ్ఛత - పర్యావరణంఅనే అంశంపై ఉత్తర రైల్వే ద్వారా 2020 సెప్టెంబర్ 16 ఒక వెబినార్ సదస్సును నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యునెప్-యు.ఎన్..పి.) భాగస్వామ్యంతో రైల్వే బోర్డు వెబినార్ ను వర్చువల్ పద్ధతిలో నిర్వహించింది. కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణపై అవగాహన కోసంస్వచ్ఛతా పక్వాడాపేరిట సెప్టెంబర్ 16నుంచి సెప్టెంబరు 30వరకూ చేపట్టిన పక్షం రోజుల కార్యక్రమం తొలి రోజున వెబినార్ ను నిర్వహించారు.

   ప్రముఖ వక్తలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన పర్యావరణ నిపుణులు వెబినార్ లో ప్రసంగించారు. రైల్వే శాఖలో వివిధ విభాగాలకు చెందిన వందమందికిపైగా అధికారులు హాజరయ్యారు. కింది అంశాలు వెబినార్ లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి :

  • ఘన వ్యర్థ పదార్థాల సక్రమ నిర్వహణ కోసం రైల్వే శాఖ తీసుకున్న చర్యలు, నీటి పొదువు, ఇందన పొదుపు చర్యలు.
  • స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో చొరవ
  • రైల్వే స్టేషన్ల గ్రీన్ రేటింగ్ 
  • ప్లాస్టిక్ వ్యర్థాల బెడదను ఎదుర్కొనడం
  • సర్క్యులర్ ఎకానమీ అంశాలపై దృష్టి

  ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ అరుణ్ అరోరా, యునెప్ ఇండియా కార్యాలయం కంట్రీ హెడ్ అతుల్ బగాయ్, యునెప్ సుహృద్భావ ప్రతినిధి దియా మీర్జా తదితరులు వెబినార్ లో ప్రసంగించారు.

  కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్వచ్ఛ భారత్ కార్యక్రమ వ్యవహారాల డైరెక్టర్ నవీన్ అగర్వాల్, పర్యావరణ నిర్వహణా కేంద్రం వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రమోద్ మోదక్, భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన సొహ్రాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (సి...-జి.బి.సి.) ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ కె.ఎస్. వెంకటగిరి, చింతన్ పర్యావరణ పరిశోధనా, కార్యాచరణ గ్రూపు ప్రతినిధి చిత్రా ముఖర్జీ, ఫైనల్ మైల్ కన్సల్టింగ్ సంస్థ చైర్మన్ బిజూ డొమినిక్ తదితరులు కూడా ప్రసంగించారు

*****



(Release ID: 1657026) Visitor Counter : 189