నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

నైపుణ్య అభివృద్ధికి ఆన్‌లైన్ కోర్సులు

Posted On: 18 SEP 2020 12:40PM by PIB Hyderabad

నైపుణ్యం మరియు వ్యవస్థాపకత శిక్షణా సంస్థలలో కోవిడ్ -19 లాక్డౌన్ తరువాత శిక్షణా కార్యకలాపాల పునఃప్రారంభం చేయడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచనకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్ 8 న ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపిలు)ను విడుదల చేసింది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి) కానీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్లు కానీ ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఎస్‌బియుడి), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద పారిశ్రామిక సాంకేతిక సంస్థలు (ఐటిఐలు), స్వల్పకాలిక శిక్షణా కేంద్రాలు పునఃప్రారంభానికి సన్నద్ధం అవుతున్నాయి. కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి ఈ సంస్థలలో తీసుకోవలసిన నిర్దిష్ట చర్యలకు అదనంగా తీసుకోవలసిన వివిధ సాధారణ ముందు జాగ్రత్త చర్యలను ఎస్ఓపి వివరిస్తుంది.

కోవిడ్-19 మహమ్మారి, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు విస్తృతంగా ప్రవేశించడంతో పాటు, కార్యాలయాల్లో పని రూపురేఖలు కూడా మార్పు వల్ల కొత్త ఆలోచన సరళికి అనుగుణంగా బాధ్యతలలోను, నిర్వహణ తీరు మారిపోయింది. కొత్తగా టెలిమెడిసిన్, శానిటైజేషన్ మొదలైన రంగాలలో కోర్సులు వస్తుండడంతో ఆరోగ్యంతో సహా అన్ని రంగాలలో స్కిల్లింగ్ / రెస్కిల్లింగ్ / అప్‌స్కిల్లింగ్ అవసరం ఇప్పుడు ఏర్పడింది.
ఇతర జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్) తో సహా ఐటిఐల కోసం క్రాఫ్ట్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సిటిఎస్) కింద మొత్తం 137 ట్రేడ్‌లకు 29 ప్రసిద్ధ కోర్సులకు కోర్సువేర్, 71 కోర్సులకు ఇ-లెర్నింగ్ వీడియో కంటెంట్,   క్వశ్చన్ బ్యాంక్ అందించే ప్రణాళిక సిద్ధం అయింది.  ఆన్‌లైన్ పోర్టల్ భారత్‌స్కిల్స్ ద్వారా మంత్రిత్వ శాఖ వీటిని అనుసంధానం చేసి, 9,38,851 మంది ట్రైనీలకు లబ్ది చేకూర్చే ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇంకా 1,31,241 మంది ట్రైనీలు భారత్‌స్కిల్ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ శిక్షణా సదుపాయాలను పొందారు. అదేవిధంగా, మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన నేషనల్ ఇన్స్ట్రక్షనల్ మీడియా ఇన్స్టిట్యూట్ (నిమి) 3080 ఆన్‌లైన్ తరగతులను నిర్వహించి 16,55,953 మందికి శిక్షణ ఇచ్చింది. అంతేకాకుండా, మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డిజిటి) పారిశ్రామిక భాగస్వాములు; క్వెస్ట్ అలయన్స్, ఐబిఎం, నాస్కామ్-మైక్రోసాఫ్ట్, సిస్కో 1,84,296 మంది పాల్గొనే ఆన్‌లైన్ శిక్షణను నిర్వహించాయి. స్వల్పకాలిక శిక్షణలో, ఎన్‌ఎస్‌డిసి స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ కింద చాలా ఎక్కువ మంది ట్రైనీలు దాని ఈ-స్కిల్ ఇండియా -ఇన్ లెర్నింగ్ పోర్టల్ సేవలను ఉపయోగించుకున్నారు, ఇది నైపుణ్యాన్ని ఇంకా పెంచడానికి సాంకేతికతను ప్రభావితం చేస్తుంది, వర్చువల్ లెర్నింగ్, రిమోట్ క్లాస్ రూమ్ వంటి పద్ధతుల ద్వారా నైపుణ్యం సాధించేవారిని వారి అభ్యాసాన్ని వేగవంతం చేస్తుంది.

ఈ సమాచారం రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు. 

****


(Release ID: 1656198) Visitor Counter : 183