ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ్య స‌భ ఎంపి శ్రీ అశోక్ గస్తి క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 17 SEP 2020 11:50PM by PIB Hyderabad

రాజ్య స‌భ ఎంపి శ్రీ అశోక్ గస్తి క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 

“రాజ్య స‌భ ఎంపి శ్రీ అశోక్ గస్తి అంకితభావం క‌లిగిన కార్య‌క‌ర్త‌.  పార్టీ ని క‌ర్నాట‌క లో బ‌ల‌ప‌ర‌చ‌డానికి ఆయ‌న ఎంతో కృషి చేశారు.  సమాజంలోని పేద‌లకు, నిరాద‌ర‌ణ‌కు గురైన వ‌ర్గాల వారికి సాధికార‌త ను క‌ల్పించ‌డం పట్ల  ఆయ‌నలో ఎంతో ఉద్వేగం ఉండేది.  ఆయ‌న మ‌ర‌ణించడం న‌న్నెంతో బాధ‌పెట్టింది.  ఆయ‌న కుటుంబానికి, ఆయ‌న మిత్రుల‌ కు ఇదే నా సంతాపం.  ఓం శాంతి” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***


(Release ID: 1656024)