సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సమయంలో పెన్షనర్ల సంక్షేమానికి చర్యలు

Posted On: 17 SEP 2020 5:12PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి (డోనెర్), పిఎంఓ, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి  (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు రాజ్యసభలో వ్రాతపూర్వక సమాధానం ఇస్తూ కోవిడ్ -19 సమయంలో పెన్షనర్ల ప్రయోజనం కోసం అనేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ విభాగం, కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ అయినప్పటి నుండి, పెన్షనర్ల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో జమ అయ్యేలా చూడడం, ఈ సమయంలో వారిని ఆరోగ్యంగానూ,   కోవిడ్-19 మహమ్మారి పట్ల అవగాహనతో ఉంచడానికి చర్యలు చేపట్టారు. 

ఈ సందర్బంగా చేపట్టిన కార్యక్రమాలు:

  • ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గుల్లెరియాతో టెలి-ఇంటరాక్షన్ కోసం 20 నగరాల పింఛనుదారులతో ఒక వెబ్ ఈవెంట్ నిర్వహించారు, దీనిలో కోవిడ్-19కి సంబంధించి అన్ని అంశాలు పెన్షనర్ల భయాన్నితగ్గించడానికి వివరించారు. 
  • పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ, నివారణ చర్యలను సూచిస్తూ యోగాపై మరో వెబ్ ఈవెంట్ సుమారు 20 భారతీయ నగరాలను నిర్వహించింది, ఈ సమయంలో, ఒక యోగా శిక్షకుడు, వారి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చేపట్టాల్సిన చర్యలపై ప్రసంగించారు. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
  • పిపిఓ (పెన్షన్ చెల్లింపు ఆర్డర్) జారీ చేసినప్పటికీ, లాక్డౌన్ కారణంగా సిపిఎఓ లేదా బ్యాంకులకు పంపని సందర్భాలలో పెన్షన్ సకాలంలో క్రెడిట్ అయ్యేలా చూస్తారు. ఈ మేరకు సిపిఎఓకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడానికి ఈ విషయాన్ని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి క్లిష్ట సమయంలో సాధారణ స్థితికి వచ్చే వరకు బ్యాంకులు ఎలక్ట్రానిక్ పద్ధతి ఉపయోగించేలా  కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) తగు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. 
  • ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే పెన్షన్ ప్రయోజనాలు అందేలా నిబంధనల సడలింపు 
  • ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డరును డీజీ లాకర్ తో  అనుసంధానం చేయడం. 
  • జీవిత ధ్రువీకరణ పత్రం (లైఫ్ సర్టిఫికెట్) దాఖలు చేసే గడువును పొడిగించడం. 

*****



(Release ID: 1655871) Visitor Counter : 181