సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆరోగ్య సంరక్షకులకు, ఆస్పత్రులలోని ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు పూచీపడుతూ చర్యలు
Posted On:
16 SEP 2020 1:11PM by PIB Hyderabad
ఆస్పత్రులు , డిస్పెన్సరీలు రాష్ట్ర పరిధిలోని అంశం కిందివైనందున , కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆస్పత్రులను శుభ్రపరచడం, వైద్యవ్యర్ధాల తరలింపువంటి వాటి కారణంగా ఆరోగ్య, భద్రతాపరమైన సమస్యలతో మరణించిన సఫాయి కర్మచారీలకు సంబంధించిన సమాచారం ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు.
ఇన్‌ఫెక్షన్ నిరోధక, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఆస్పత్రులు కూడా ఒక నోడల్ అధికారిని గుర్తించాలి. ఆ అధికారి ఆరోగ్యసంరక్షకుల పరిస్థితిని గమనించాలి. వారు ఇన్‌ఫెక్షన్ బారిన పడేందుకు గల అవకాశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి.హై రిస్కుఎక్స్‌పోజర్ కలిగిన వారిని వారం రోజుల క్వారంటైన్‌లో ఉంచాలి. వారి ఎక్స్‌పోజర్ పరిస్థితిని బట్టి , క్లినికల్ ఫ్రొఫైల్ ఆధారంగా అలాంటి డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్యకార్యకర్తల విషయంలో నోడల్ అధికారి , హెడ్ ఆఫ్ ద డిపార్టమెంట్ (లేదా నియమితులైన సబ్ కమిటీ) మరొ వారం రోజుల క్వారంటైన్ కు నిర్ణయం తీసుకోవచ్చు. కోవిడ్, నాన్ కోవిడ్ కు సంబంధించిన ఆస్పత్రులలో ఆరోగ్య సంరక్షణ చర్యల నిర్వహణకు సంబంధించి 2020 జూన్ 18న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సవివరమైన సూచనలు జారీ చేసింది.
ఆరోగ్య సంరక్షకులు, ఇతర క్షేత్ర స్తాయి వర్కర్ల విషయంలొ పిపిఇలను హేతు బద్ధంగా వినియోగించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పని ప్రదేశంలొ వ్యాధి బారినపడేందుకుగల అవకాశాలను బట్టి ఏరకమైన పిపిఇ ని వాడాలన్నదానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సూచించింది. ఇన్‌ఫెక్షన్ నిరోధం, నియంత్రణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం సూచనలు జారీచేసింది. ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, నిరోధక విధానాలపై ఆస్పత్రుల సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిందిగా రాష్ట్రాలను కోరడం జరిగింది. ఇన్‌ఫెక్షన్ నిరోధానికి సంబంధించి అన్ని కేటగిరీలలోని ఆరోగ్య కార్యకర్తలకు ఐ జిఒటి ప్లాట్‌పారమ్‌పై శిక్షణ ను అందుబాటులో ఉంచారు.
ఈ సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా శాఖ మంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే ఈరోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
***
(Release ID: 1655122)
Visitor Counter : 230