ఉక్కు మంత్రిత్వ శాఖ

సామర్థ్య నిర్మాణం కోసం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ చర్యలు

Posted On: 16 SEP 2020 1:06PM by PIB Hyderabad

దేశంలో, 2030-31 నాటికి 300 ఎంటీపీఏల ముడి ఉక్కు సామర్థ్యాన్ని సాధించాలని 'జాతీయ ఉక్కు విధానం' లక్ష్యంగా పెట్టుకుంది.

(i) దేశీయంగా ఉత్పత్తయిన ఉక్కును ప్రభుత్వ సంస్థలు సేకరించేలా ప్రోత్సహించేందుకు "దేశీయంగా తయారైన ఇనుము&ఉక్కు ఉత్పత్తుల విధానం"
(ii) దేశీయ తుక్కు ఉక్కు లభ్యతను పెంచేందుకు "ఉక్కు తుక్కు విధానం"
(iii) నాణ్యత లేని ఉక్కు తయారీ, దిగుమతులను నిలిపివేసేందుకు ఉక్కు నాణ్యత నియంత్రణ ఆదేశాలు జారీ. ఇప్పటివరకు 113 ఆదేశాలు జారీ
(iv)  ఉక్కు దిగుమతుల ముందస్తు నమోదు కోసం ఉక్కు దిగుమతుల పర్యవేక్షణ వ్యవస్థ
(v) విలువ ఆధారిత ఉక్కు, ఉప, మూలధన వస్తువుల ఉత్పత్తి యూనిట్లను కలిగిన ఉక్కు క్లస్టర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ముసాయిదా విధానం
(vi) ఉక్కు రంగానికి ముడి పదార్థాల లభ్యతపై హామీ ఇచ్చేలా, గనుల మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖతో సన్నిహితంగా ఉక్కు మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. గడువు ముగిసిన ఇనుము ధాతువు గనుల వేలం, పునఃప్రారంభం, ఉక్కు సీపీఎస్‌ఈల ద్వారా తవ్వకం లీజుల పొడిగింపు, సీఐఎల్/బీసీసీఎల్ ద్వారా కోకింగ్ బొగ్గు శుద్ధి కేంద్రాల ఏర్పాటు, కోకింగ్ బొగ్గు గనుల వేలం లేదా కేటాయింపు, కోకింగ్ బొగ్గు దిగుమతుల వైవిధ్యీకరణ వంటి చర్యలను ఆయా మంత్రిత్వ శాఖల ద్వారా ఉక్కు మంత్రిత్వ శాఖ చేపడుతోంది.

 

గతేడాది ఏప్రిల్‌-జులై నెలలతో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌-జులై నెలల్లో 'పూర్తయిన ఉక్కు' వినియోగం:

నెల

మొత్తం 'పూర్తయిన ఉక్కు' మిశ్రమం కాని + మిశ్రమం / స్టెయిన్‌లెస్‌) వినియోగం (వేల టన్నుల్లో)

2019 సంవత్సరం

2020  సంవత్సరం

ఏప్రిల్‌

7333

1092

మే

8850

4720

జూన్

8589

6234

జూలై

8573

7405

 

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు  సమర్పించారు.

***



(Release ID: 1654968) Visitor Counter : 125