మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎం.హెచ్.ఆర్.డి మార్గనిర్దేశంలో సెకండరీ స్థాయి విద్యార్ధులకు రూపొందించిన ఎన్.సి.ఇ.ఆర్.టి 8 వారాల ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి
Posted On:
15 SEP 2020 12:23PM by PIB Hyderabad
కోవిడ్ 19 కారణంగా ఇళ్లలోనే ఉంటున్న విద్యార్ధులు విద్యా కార్యకలాపాల ద్వారా, తల్లిదండ్రులు, టీచర్ల సహాయంతో అర్ధవంతంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చేసేందుకు , ఎన్.సి.ఇ.ఆర్.టి సంస్థ ఎం.హెచ్.ఆర్.డి మార్గనిర్దేశంలో విద్యార్థులు, టీచర్లు ,తల్లిదండ్రులకు 1 వ తరగతి నుంచి 12 వరకు అన్ని తరగతులకు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలండర్‌ను రూపొందించింది. నాలుగు వారాల ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలండర్ (ఎఎసి), ఆ తదుపరి ప్రైమరి, అప్పర్ ప్రైమరీ స్థాయిలకు 8 వారాల క్యాలండర్‌ను ఇప్పటికే విడుదల చేసింది. సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలకు సంబంధించి నాలుగు వారాల ఎఎసిని ఇంతకు ముందే కేంద్ర విద్యా శాఖ మంత్రి విడుదల చేశారు. ప్రస్తుతం సెకండరీ స్థాయికి తదుపరి 8 వారాల ఎఎసిని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వర్చువల్‌గా ఈరోజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ పోఖ్రియాల్ , ఈ క్యాలండర్, విద్యను ఆసక్తికరంగా, సంతోషకరంగా అందించేందుకు అందుబాటులొ ఉన్న వివిధ సాంకేతిక ఉపకరణాలు, సామాజిక మాధ్యమ ఉపకరణాలను ఉపయోగించడానికి సంబంధించి మార్గదర్శకాలను అందిస్తుందని ఆయన చెప్పారు. దీనిని అభ్యాసకులు, తల్లిదండ్రులు, టీచర్లు ఇంటివద్ద ఉన్నప్పుడు కూడా ఉపయోగించవచ్చని అన్నారు.
అయితే, ఇందుకు సంబంధించి వివిధ ఉపకరణాలైన మొబైల్ ఫోన్, రేడియో, టెలివిజన్, ఎస్.ఎం.ఎస్, వివిధ సామాజిక మాధ్యమాల అందుబాటు స్థాయిలను ఇది పరిగణనలోకి తీసుకుంది. మనలో చాలా మందికి మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చని లేదా వివిధ సామాజిక మాధ్యమాల ఉపకరణాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్, తదితరాల వంటి వాటిని ఉపయోగించక పోవచ్చని అన్నారు. మొబైల్ ఫోన్‌లలో లేదా వాయిస్ కాల్ ద్వారా ఎస్.ఎం.ఎస్ ద్వారా తల్లిదండ్రులు , విద్యార్థులకు మరింత సహాయం చేయడానికిఈ క్యాలెండర్ ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ క్యాలెండర్ అమలు చేయడానికి ప్రాథమిక స్థాయి విద్యార్దులకు తల్లిదండ్రులు తోడ్పడతారని భావిస్తున్నారు..
ఈ క్యాలండర్ దివ్యాంగులైన పిల్లలతో సహా (ప్రత్యేక అవసరాల పిల్లలు) అందరి అవసరాలనూ ఇది తీరుస్తుంది. ఆడియో పుస్తకాలు, రేడియో కార్యక్రమాలు, వీడియో కార్యక్రమాలకు లింక్‌ను అందించనున్నట్టు శ్రీ పోఖ్రియాల్ తెలిపారు.
ఈ క్యాలండర్‌లో వారం వారీగా ప్రణాళిక,సిలబస్ , టెక్స్‌ట్ పుస్తకం నుంచి తీసుకున్న అంశం, చాప్టర్‌కు సంబంధించి ఆసక్తికరమైన, సవాలుతోకూడిన కార్యకలాపాలు ఇందులో ఉంటాయి. అత్యంత ముఖ్యమైనది, ఇది ఆయా థీమ్‌లకు సంబంధించి అభ్యసన ఫలితాలను తెలియజేస్తుంది . ఆయా అంశాలు, వాటి అభ్యసన ఫలితాలను గుర్తించడం వెనుక ఉద్దేశం, విద్యార్ధి అభ్యసన ప్రగతి గురించి టీచర్లు, తల్లిదండ్రుల అంచనా వేయడానికి వీలు కలుగుతుంది. పాఠ్యపుస్తకాలకు మించి ముందుకు వెళ్లడానికి వీలు కలుగుతుంది. క్యాలండర్‌లోని కార్యకలాపాలు అభ్యసన ఫలితాలపై దృష్టిపెడతాయి. ఆ రకంగా విద్యార్థులు తమ రాష్ట్రంలో ,కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపయోగించే ఏ పాఠ్యపుస్తకం, అభ్యసన వనరులనుంచైనా దీనిని సాధించవచ్చు.
ఇది ప్రయోగాత్మక అభ్యసన కార్యకలాపాలైన ఆర్ట్స్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎక్సర్‌సైజెస్, యోగ, ప్రీ ఒకేషనల్ స్కిల్ తదితరాలపై కూడా దృష్టిపెడుతుంది ఈ క్యాలండర్ లో తరగతి వారీగా, సబ్జక్ట్ వారీగా టేబుల్ రూపంలో కార్యకలాపాలు ఉంటాయి. ఈ క్యాలండర్ నాలుగు బాషా సబ్జెక్లులైన హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, సంస్కృతం ,సబ్జెక్టులకు సంబంధించినది. ఈ క్యాలండర్ ఉపాధ్యాయులు,విద్యార్ధులు, తల్లిదండ్రులపై ఆందోళనను ,ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.క్యాలండర్ చాప్టర్ వారీగా ఈపాఠశాలలో,ఎన్ఆర్ ఒ ఇఆర్, భారత ప్రభుత్వ దీక్షా పోర్టల్ లో అందుబాటులో ఉన్న లింక్‌లను సూచిస్తుంది.
అన్ని కార్యకలాపాలు సూచనాత్మకమైనవి, అదే వరుస తప్పనిసరిగా పాటించాలన్న నియమం కూడా లేదు. టీచర్లు, తల్లిదండ్రులు క్యాలండర్‌లో పేర్కొన్న వరుసక్రమం ప్రకారం కాక, విద్యార్దికి ఆసక్తికరంగా ఉన్న కార్యకలాపాల ప్రకారం చేపట్టవచ్చు.
టివిఛానల్ స్వయం ప్రభ (కిషోర్ మంచ్)( ఉచిత డిటిహెచ్ ఛానల్ 128, డిష్ టివి ఛానల్ 950,సన్ డైరక్ట్ 793చ .జియో టివి , టాటా స్కై 756, ఎయిర్ టెల్ ఛానల్ 440,వీడియోకాన్ చానల్ 477 పై అందుబాటులో ఉంటుంది.) ద్వారా విద్యార్ధులు , తల్లిదండ్రులు, టీచర్లకు ఎన్.సి.ఇ.ఆర్.టి ఇప్పటికే లైవ్ ఇంటరాక్టివ్ సెషన్‌లను నిర్వహిస్తొంది.ప్రతిరోజూ సోమవారం నుంచి శనివారం వరకు ఒకటొ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ప్రతి క్లాసుకు వారంలో ఒక గంట లైవ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటల మధ్య నిర్వహిస్తున్నారు. 11 వ తరగతి, 12 వ తరగతి విద్యార్ధులకు ప్రతి తరగతికి వారంలో రెండు గంటల లైవ్ సెషన్‌కు అవకాశం దొరుకుతుంది. వీక్షకులతొ మాట్లాడడంతోపాటు , ఆయా అంశాలపై బోధనతోసహా ప్రత్యక్షంగా చేతితో చేసి చూపించడం వంటివి ఇందులో ఉంటాయి. ఎఎసి ఫీచర్లను వీడియో కాన్పరెన్సు ద్వారా ఎస్.సి.ఇ.ఆర్‌టిలు, ఎస్ఇఇలకు ,విద్యా డైరక్టరేట్‌లకు , కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌లు, నవొదయ విద్యాలయ సమితులు, సిబిఎస్‌యిలకు వివరించడం జరిగింది. సెకండరీ స్థాయికి సంబంధించి 8 వారాల క్యాలండర్‌ను ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారికోసం ఎన్.సి.ఇ.ఆర్.టి వెబ్‌సైట్ లో ఉంచడం జరిగింది.
ఇది ఆన్‌లైన్ బోధన-అభ్యాస వనరులను ఉపయోగించి కోవిడ్ -19 తో వ్యవహరించడానికి అవసరమైన సానుకూల మార్గాలను తెలుసుకోవడానికి మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు , తల్లిదండ్రులకు సాధికారత కల్పిస్తుంది. ఇంట్లోనే పాఠశాల విద్యను పొందడంలో ఇది వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరుస్తుంది .
***
(Release ID: 1654563)
Visitor Counter : 221
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam