నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
నిరుద్యోగులకు డిజిటల్ నైపుణ్యం
Posted On:
14 SEP 2020 2:30PM by PIB Hyderabad
4వ పారిశ్రామిక విప్లవ అవసరాలకు అనుగుణంగా కొవిడ్ అనంతర ప్రస్తుత పరిస్థితుల్ యువతలో డిజట్ నైపుణ్యాన్ని పెంచడం ఎంతో అవసరం. ఇందుకు గాను కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి పరిధిలోని సాధారణ శిక్షణా విభాగం సంచాలకులు(డిజిటి) వారు సాంకేతిక పరిజ్ఞానముతో కూడిన శిక్షణా కార్యక్రమాల నిర్వహించడంలో వాటిని అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను తీర్చిదిద్దడం కోసం డిజిటి ఐబిఎం వారితో జూన్ 2020లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఉద్యోగార్థులకు ఉచితంగా సాంకేతిక పరిజ్ఞానములో శిక్షణను “ స్కిల్స్ బిల్డ్ రిగ్నైట్” కార్యక్రమం క్రింద అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉద్యోగార్థులు లేదా వ్యాపారసమారంభకులకు ఉచిత ఆన్లైన్ కోర్సులు మరియు వారి ఉద్యోగ అవసరాలకు మరియు వ్యాపార అవసరాలకు తగిన సహాయ సహకారాలను అందింస్తుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్టిఐ)ల ద్వారా విద్యార్థులకు మరియు శిక్షకులకు క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఆర్టఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ల్లో శిక్షణ ఇస్తుంది. ఉన్నత విద్యా సంస్థల్ అంకుర సంస్థలకు తగిన వాణిజ్య విలువలు కలిగిన సాంకేతి నైపుణ్యాన్ని మరియు అందుకు తగిన సమాచారం ఇవ్వడం కోసం జూన్ 2020లో ’యుక్తి 2.0’ను ప్రారంభించింది కేంద్ర విద్యాశాఖ.
ఆరోగ్య పరిరక్షణ విషయంలో సాంకేతికతను వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం “ఇ సంజీవని” మరియు “ఇసంజీవని/ఒపిడి”లను ప్రారంభించింది. ఇసంజీవని వైద్యుడు-వైద్యుడు మరియు రోగి-వైద్యుడు(“ఇసంజీవని/ఒపిడి”) ఫోనులో వైద్యుని టెలికన్సల్టేషన్ వంటి రెండు రకాల టెలిమెడిసిన్ సేవలను అందిస్తుంది. డిసెంబర్ 2020నాటికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల(ఏబి-హెచ్డబ్ల్యూసి) కార్యక్రమం క్రింద వీటిని అమలు చేస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న 1.5 కేంద్రాల ద్వారా ’హబ్ అండ్ స్పోక్’ విధానంలో ఈ టెలి కన్సల్టేషన్ విధానాన్ని అమలు పరచాలను ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు మరియు జిల్లా ఆసుపత్రులను గుర్తించారు, ఈ టెలికమ్యూనికేషన్ సేవలను స్పోక్స్ క్రింద ఎస్హెచ్సిలు మరియు పిహెచ్సిలు అందిస్తాయి. ఈ జాతీయ ఇవేదిక క్రింద ఇప్పటి వరకు 12,000 మంది కమ్యూనిటీ ఆరోగ్య అధికారులు మరియు వైద్యులు శిక్షణ పొందారు. ప్రస్తుతం ఈ టెలిమెడిసిన్ సేవలు 10 రాష్ట్రాల్లో 3,000 పైగా కేంద్రాల్లో అందిచబడుతోంది. నవంబర్ 2019 నుండి అతి తక్కువ సమయంలోనే ఈ టెలిమెడిసిన్ ఇసంజీవని మరియు ఇసంజీవని ఒపిడిలు 23 రాష్ట్రాల్లో(75%నికి పైగా జనాభా కలిగిన) అమలు చేయబడుతోంది. కాగా మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలుచేయడానికి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు రెండు రకాల్లోనూ సుమారు 1,50,000 టెలి కన్సల్టేషన్లు పూర్తయ్యాయి.
ఈ రోజు లోక్ సభలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖామాత్యులు శ్రీ ఆర్. కే.సింగ్ వ్రాత ప్రతిలో సమాధానంగా ఈ సమాచారాన్ని ఇచ్చారు.
(Release ID: 1654175)
Visitor Counter : 112