హోం మంత్రిత్వ శాఖ

పద్మ అవార్డులు-2020 నామినేషన్లు 2020 సెప్టెంబర్ 15వ తేదీ వరకు స్వీకరిస్తారు

Posted On: 14 SEP 2020 3:30PM by PIB Hyderabad

2021 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డుల ప్రకటన కోసం ఆన్‌లైన్ నామినేషన్లు / సిఫారసులకు రేపు (15 సెప్టెంబర్, 2020) చివరి తేదీ. పద్మ అవార్డుల నామినేషన్లు / సిఫార్సులు పద్మ అవార్డుల పోర్టల్ https: //padmaawards.gov.in లో మాత్రమే ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. 1954 లో స్థాపించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ఈ అవార్డు 'అద్భుత ప్రతిభ' ను గుర్తించటానికి ప్రయత్నిస్తుంది. కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామజిక సేవ, విజ్ఞానశాస్త్రం, ఇంజనీరింగ్, ప్రజావ్యవహారాలు, సివిల్ సర్వీస్, వాణిజ్య, పరిశ్రమలు వంటి అన్ని రంగాలలో / విభాగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు / సేవలకు అవార్డు ఇస్తారు. జాతి, వృత్తి, హోదా, లింగ బేధాలకు ఆస్కారం లేకుండా అందరూ ఈ అవార్డులకు అర్హులే. వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా పిఎస్‌యులతో పనిచేసే వారు, ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు. పద్మ అవార్డులను “పీపుల్స్ పద్మ” గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందువల్ల పౌరులందరూ స్వీయ నామినేషన్ల తో సహా నామినేషన్లు / సిఫార్సులు చేయాలని అభ్యర్థన.

నామినేషన్లు / సిఫారసులను పైన సూచించిన పద్మ పోర్టల్ లో ఉన్న ఫార్మేట్ ‌లో పేర్కొన్న అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉండాలి, ఇందులో కథన రూపంలో (గరిష్టంగా 800 పదాలు) ఒక ఉల్లేఖనంతో సహా సిఫార్సు చేయబడిన ఆమె / అతని  సంబంధిత క్షేత్రం / రంగంలో విశిష్టమైన,అసాధారణమైన విజయాలు / సేవలను స్పష్టంగా పొందుపరచాలి..

అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్రాలు / యుటి ప్రభుత్వాలు, భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, నైపుణ్య సంస్థలు ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయవచ్చని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు & ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని ఈ అవార్డుల కోసం గుర్తించాల్సిందిగా సూచించింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  (www.mha.gov.inవెబ్‌సైట్‌లో 'అవార్డులు, పతకాలు' శీర్షిక క్రింద లభిస్తాయి. ఈ అవార్డులకు సంబంధించిన నియమనిబంధనలు  https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్‌తో అందుబాటులో ఉన్నాయి.

 

*****



(Release ID: 1654172) Visitor Counter : 162