ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మహమ్మారి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి లోక్‌సభ / రాజ్యసభలో 2020 సెప్టెంబర్ 14 న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తనకు తాను(సుమోటో)గా చేసిన ప్రకటన

Posted On: 14 SEP 2020 12:20PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారి గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఈ రోజు లోక్‌సభ / రాజ్యసభలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తనకు తాను (సుమోటో)గా చేసిన ప్రకటన పూర్తి పాఠం :

1.       కోవిద్ మహమ్మారి గురించి ఈ గౌరవ సభకు ఈ ఏడాది ఫిబ్రవరి, మర్చి లో రెండు సందర్భాల్లో వివరించాను. కోవిడ్ -19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి గౌరవ సభ్యులకు నేను మళ్ళీ వివరించాలనుకుంటున్నాను.

2.    నా చివరి వివరణ నుండి చుస్తే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ -19 ను ఒక మహమ్మారిగా ప్రకటించింది ఈ ప్రజారోగ్య సంక్షోభానికి వ్యతిరేకంగా అత్యవసర, ఉదృత చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలను కోరింది. 

3.   11 సెప్టెంబర్, 2020 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 215 దేశాలు / భూభాగాలు ప్రభావితమయ్యాయి.  డబ్ల్యూహెచ్ఓ  ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2.79 కోట్లకు పైగా ధృవీకరించబడిన కేసులున్నాయి, 9.05 లక్షలకు పైగా మరణాలు సంభవించాయ. కేసుల మరణాల రేటు 3.2% ఉంది. 

 

 4.    2020 సెప్టెంబర్ 11 నాటికి భారతదేశంలో మొత్తం 45,62,414 కేసులు, 76,271 మరణాలు (కేసు మరణాల రేటు 1.67%) నమోదయ్యాయి. 35,42,663 (77.65%) మంది కోలుకున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ, ఒడిశా, అస్సాం, కేరళ, గుజరాత్ నుండి గరిష్ట కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాలన్నీ ఒకటి కంటే ఎక్కువ కేసులను నమోదు చేశాయి. మొత్తం ప్రభుత్వ, మొత్తం సమాజ దృక్పథంతో కోవిడ్-19 ను ఎదుర్కునే చర్యల్లో భాగంగా మా ప్రయత్నంతో, భారతదేశం తన కేసులను మిలియన్‌కు 3,328 కేసులకు, మరణాలను మిలియన్ జనాభాకు 55 కి  పరిమితం చేయగలిగింది, ప్రపంచంలో ప్రభావిత దేశాలతో పోలిస్తే ఇలా నమోదైన అత్యల్ప దేశాల్లో మనం కూడా ఉన్నాం.  

5.    వ్యాధి వ్యాపించే తీరు, సబ్‌క్లినికల్ ఇన్ఫెక్షన్, వైరస్ తొలగింపు కాలం, రోగనిరోధక శక్తి పాత్ర వంటి అనేక ఎపిడెమియోలాజికల్ పారామితులపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి సంక్రమణకు గురైన తర్వాత, ఈ వ్యాధి 1-14 రోజుల మధ్య ఎప్పుడైనా అభివృద్ధి చెందుతుంది. కోవిడ్ ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. మన దేశంలో 92% కేసులలో తేలికపాటి వ్యాధి ఉన్నట్లు నివేదించబడింది. కేవలం 5.8% కేసులలో మాత్రమే ఆక్సిజన్ థెరపీ అవసరమవుతుంది. వ్యాధి కేవలం 1.7% కేసులలో ఇంటెన్సివ్ కేర్ అవసరమయ్యేంత తీవ్రంగా ఉంటుంది.

 

6.   భారతదేశంలో ఈ వ్యాప్తి పెరుగుతున్న పరిమాణం అంటువ్యాధులను నివారించడానికి, ప్రాణాలను కాపాడటానికి, ప్రభావాన్ని తగ్గించడానికి ఒక సమగ్ర వ్యూహం ప్రకారం రూపొందించిన ముందస్తు, చురుకైన, దాని స్థాయిని బట్టి, మొత్తం ప్రభుత్వ, మొత్తం సమాజ దృక్పథంతో చేపట్టే చర్యల అవసరాన్ని నొక్కిచెప్పింది. 

 

7.    కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 సవాలును అత్యున్నత స్థాయి రాజకీయ నిబద్ధతతో చేపట్టింది. గౌరవనీయ ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు ప్రకారం స్వయం ప్రతిపత్తి గల జనతా కర్ఫ్యూగా ప్రారంభించి, ప్రజలంతా భాగస్వామ్యమయ్యేలా ధైర్యంగా తీసుకున్న దేశవ్యాప్త లాక్ డౌన్ నిర్ణయం కోవిడ్-19 ని ఎదుర్కోడానికి దేశమంతా సమిష్టిగా నిలబడిందన్నదానికి సాక్ష్యం. దీని వల్ల కోవిడ్ ఉధృతంగా విజృంభించకుండా మందగించడంతో విజయవంతం అయ్యాము. ఈ నిర్ణయం సుమారు 14–29 లక్షల కేసులను, 37–78 వేల మరణాలను నిరోధించిందని అంచనా. దీనితో పాటు ఈ అదనపు ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించడానికి, మానవ వనరులను పెంచడానికి, దేశంలో పిపిఇలు, ఎన్ -95 మాస్కులు, వెంటిలేటర్లు వంటి కీలక అవసరాలను ఉత్పత్తి చేయడానికిఈ నాలుగు నెలలు సద్వినియోగమయ్యాయి. మార్చి 2020 లో ఉన్నవాటితో పోలిస్తే, ప్రత్యేకించిన ఐసోలేషన్ పడకల పెరుగుదల 36.3 రెట్లు,  ప్రత్యేకించిన ఐసియు పడకలు 24.6 రెట్లు ఎక్కువపెంచగలిగాము. అప్పట్లో పిపిఇ స్వదేశీ తయారీ అవసరం లేనప్పటికీ, అవసరమైన ప్రమాణాలతో, మనం ఇప్పుడు స్వయం సమృద్ధితో ఉన్నాము, ఎగుమతులు చేసే స్థితిలో కూడా ఉన్నాము. వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, మంచి నాయకత్వంతో పరిస్థితిని ఎదురుకొంటున్న గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి దేశవాసుల తరఫున కృతజ్ఞతాభినందనాలు తెలియజేసుకుంటున్నాను.  

8.   ఈ వ్యాధికి అడ్డుకట్టవేయడానికి, నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను ప్రారంభించింది. నేను రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నాను. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యుటి అధికారులతో, అన్ని వాటాదారులతో సమస్యలను క్రమం తప్పకుండా అర్థం చేసుకోవడానికి, సమర్థవంతమైన కోవిడ్ నిర్వహణ కోసం రాష్ట్రాలతో సహకరించడానికి గౌరవప్రదమైన ప్రధానమంత్రి మాట్లాడారు. నా అధ్యక్షతన విదేశాంగ మంత్రి, పౌర విమానయాన మంత్రి, హోంమంత్రి, షిప్పింగ్ సహాయ మంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రితో కూడిన మంత్రుల బృందం 2020 ఫిబ్రవరి 3 న వ్యవస్థాపించినప్పటి నుండి  20 సార్లు సమావేశమైంది. కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీ ఆరోగ్య, రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయానం, గృహ, వస్త్ర, ఫార్మా, వాణిజ్య మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సహా ఇతర అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించింది. ప్రధాన మంత్రి, హోం వ్యవహారాల మంత్రి మార్గదర్శనంలో కోవిడ్-19 పై చర్యల విషయంలో నిర్ణయాలు తీసుకోడానికి 11 సాధికార గ్రూపులు ఏర్పాటయ్యాయి. అవి ఈ విభాగాలలో చర్యలు చేపట్టడానికి పని చేస్తాయి. (i) మెడికల్ ఎమర్జెన్సీ ప్లానింగ్, (ii) ఆస్పత్రుల లభ్యత, ఐసొలేషన్, క్వారంటైన్ సౌకర్యం, వ్యాధి నిఘా, పరీక్ష, (iii) అవసరమైన వైద్య పరికరాల లభ్యతను నిర్ధారించడం, (iv) మానవ వనరుల సామర్థ్యం పెంపొందించడం, (v) సరఫరా గొలుసు, లాజిస్టిక్ నిర్వహణ, (vi) ప్రైవేట్ రంగాలతో సమన్వయం, (vii) ఆర్థిక, సంక్షేమ చర్యలు, ( viii) సమాచారం, సమాచార ప్రసారం, ప్రజా అవగాహన, (ix) సాంకేతికత, డేటా నిర్వహణ, (x) ప్రజల సమస్యలు  (xi) లాక్‌డౌన్‌కు సంబంధించిన వ్యూహాత్మక సమస్యలు. ఈ గ్రూపులు ఇటీవల సెప్టెంబర్ 10 న అవసరం మరియు అభివృద్ధి చెందుతున్న దృష్టాంతం ఆధారంగా పునర్వ్యవస్థీకరించారునా స్వంత మంత్రిత్వ శాఖ అభివృద్ధి చెందుతున్న తీరును నిరంతరం సమీక్షిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్‌లు రాష్ట్రాలతో క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు, ఆరోగ్య కార్యకర్తలు, జిల్లా స్థాయి అధికారులతో ఇప్పటివరకు 63 వీడియో సమావేశాలు నిర్వహించాము. సాంకేతిక విషయాలపై ఎంఓఎఫ్హెచ్డబ్ల్యూ కి సలహా ఇచ్చే డీజీహెచ్ఎస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (జెఎంజి) ప్రమాదాన్ని అంచనా వేయడానికి, సంసిద్ధత,ప్రతిస్పందన విధానాలను సమీక్షించడానికి, సాంకేతిక మార్గదర్శకాలను ఖరారు చేయడానికి ఇప్పటివరకు 40 సార్లు సమావేశమైంది.

9.   గతంలో విశ్వమారి, అంటువ్యాధులను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన వ్యూహం, ప్రణాళికలు, విధానాలను అందించింది. ప్రయాణాలు, ప్రవర్తన, మానసిక-సామాజిక ఆరోగ్యం, నిఘా, ప్రయోగశాల మద్దతు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, క్లినికల్ మేనేజ్‌మెంట్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పిపిఇ)ల హేతుబద్ధమైన ఉపయోగం మొదలైన వాటికి సంబంధించిన విస్తృత శ్రేణి విషయాలపై వ్యాధి నియంత్రణ ప్రణాళికలు, మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయి.  

10.   కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి /అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ఇతర చర్యలు తీసుకుంది. ప్రయాణాలకు సంబంధించి మొదటి అడ్వైజరీ ని  2020 జనవరి 17 న జారీ చేసాము, పరిస్థితికి అనుగుణంగా దీనిని శ్రేణి వారీగా సవరిస్తూ వచ్చాము. అన్ని దేశాల నుండి ప్రయాణీకులకు యూనివర్సల్ స్క్రీనింగ్ ప్రవేశపెట్టాము, 2020 మార్చి 23 వరకు (అన్ని వాణిజ్య విమానాలను నిలిపివేసే వరకు) దీనిని కచ్చితంగా అమలు చేశాము. 15,24,266 మంది ప్రయాణికులతో మొత్తం 14,154 విమానాలను విమానాశ్రయాలలో పరీక్షలు నిర్వహించాము. విమానాశ్రయాలతో పాటు, సరిహద్దు దాటే దగ్గర కూడా సుమారు 16.31 లక్షల మందిని, 12 ప్రధాన, 65 మైనర్ ఓడరేవులలో 86,379 మంది వ్యక్తులను పరీక్షించారు.

 

11.    ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏ విమానాశ్రయానికి ఏ విదేశీ విమానాశ్రయం నుండి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాలను బయలుదేరడానికి అనుమతించవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది,2020 మార్చి 22 నుండే ఇది అమలులో ఉంది, అయితే వందే భారత్ మిషన్ విమానాలకు 2020 మే 7 నుండి విదేశాల్లో వివిధ చోట్ల చిక్కుకున్న భారతీయులను తిరిగి ఇక్కడకు తీసుకురావాలనే లక్ష్యంతో అనుమతి ఇచ్చింది కేంద్రం. కమర్షియల్ ప్యాసింజర్ సేర్విలులను పునఃప్రారంభించే లక్ష్యంతో భారతదేశం, పరస్పరం అంగీకరించుకున్న 9 ఇతర దేశాల మధ్య తాత్కాలిక విమాన ప్రయాణ ఏర్పాట్లు (ట్రాన్స్పోర్ట్ బుబుల్ల్స్ప్రారంభమయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ఇరు దేశాల విమానయాన సంస్థలు ఇలాంటి ప్రయోజనాలను పొందుతాయి. 2020 మే 24 న మంత్రిత్వ శాఖ ‘అంతర్జాతీయ రాకపోకలకు మార్గదర్శకాలు’ జారీ చేసింది, వీటిని 2020 ఆగస్టు 2 న సవరించారు

లాక్ డౌన్ 1.0 కి ముందు, భారత ప్రభుత్వం చైనాలోని వుహాన్, డైమండ్ ప్రిన్సెస్ క్రూయిస్ షిప్, జపాన్, ఇరాన్, ఇటలీ, మలేషియా నుండి భారతీయ పౌరులను తరలించింది. వందే భారత్ మిషన్ కింద, 11 సెప్టెంబర్ 2020 లెక్కల ప్రకారం, మొత్తం 12,69,172 మంది ప్రయాణికులను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.

12.  కమ్యూనిటీ నిఘా మొదట్లో ప్రయాణ సంబంధిత కేసులతో ప్రారంభించాము. తరువాత కమ్యూనిటీ నుండి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడిఎస్పి) ద్వారా నివేదించబడిన కేసుల కోసం అమలు చేశాం. 11 సెప్టెంబర్ 2020 నాటికి, మొత్తం 40 లక్షల మందిని నిఘాలో ఉంచాము, వ్యాధి వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి విస్తృతంగా అన్ని పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్  క్రమం తప్పకుండా వ్యాధి పర్యవేక్షణ నెట్‌వర్క్ ద్వారా చేపట్టారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2020 మార్చి 2, ఏప్రిల్ 4వ తేదీన వరుసగా క్లస్టర్ వ్యాప్తితో పాటు వ్యాధి విస్తృతం కాకుండా అరికట్టడానికి నియంత్రణ ప్రణాళికలను విడుదల చేసింది.  ఈ ప్రణాళికలు ఎప్పటికప్పుడు నవీకరిస్తూ వచ్చారు. వ్యాధి వ్యాప్తి కాకుండా గొలుసును విచ్ఛిన్నం చేయడానికి అమలు చేసే అంశాలు... (i)కంటైన్మెంట్, బఫర్ జోన్‌లను నిర్వచించడం, (ii) కఠినమైన పారమతిలలో నియంత్రణ చర్యలు వర్తింపజేయడం, (iii) కాంటాక్ట్ ద్వారా వచ్చే కేసులను ఉధృతంగా ఇంటింటికి వెళ్లి గుర్తించడం (iv) అనుమానిత, అత్యంత హానికి అవకాశం ఉన్న కేసులను పరీక్షించి, వేరుచేయడం (v) అత్యంత హానికర పరిస్థితుల్లో ఉన్న కాంటాక్ట్స్ క్వారంటైన్ (vi) సాధారణ నివారణ చర్యలపై సమాజ అవగాహన పెంచడానికి ఇంటెన్సివ్ రిస్క్ కమ్యూనికేషన్, సత్వర చికిత్స కోరే అవసరం చూడడం (vii) నిష్క్రియాత్మక ఇన్ఫ్లుఎంజా-లాంటి అనారోగ్యం (ఐఎల్ఐ) / కంటైన్మెంట్ బఫర్ జోన్లలో అతి తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ఎస్ఏఆర్ఐ) నిఘా బలోపేతం 

 

13.  అభివృద్ధి దిశగా, ప్రయోగశాల నెట్‌వర్క్ నిరంతరం బలోపేతం అవుతోంది. జనవరిలో కోవిడ్ కోసం పరీక్షలు చేపట్టడానికి ఒకే ప్రయోగశాల పరిస్థితి నుండి, ప్రస్తుతం 1705 ప్రయోగశాలలు కోవిడ్-19 పరీక్షను నిర్వహించే స్థాయికి పెరిగాయి. లడఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీపం వంటి సంక్లిష్ట ప్రాంతాల్లో ప్రయోగశాలలు స్థాపించాము. ప్రస్తుతం పరీక్ష రోజుకు 1 మిలియన్ పరీక్షలు (ఇది రోజుకు మిలియన్ జనాభాకు 720 పరీక్షలు అని అర్ధం), WHO నిర్దేశించిన దానికంటే చాలా ఎక్కువ. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించింది రోజుకు మిలియన్ జనాభాకు 140 పరీక్షలయితే మన దేశంలో 720 పరీక్షలు జరుగుతున్నాయి. 11 సెప్టెంబర్ 2020 నాటికి మొత్తం 5,51,89,226 నమూనాలను పరీక్షించారు. కోవిడ్ కోసం ప్రయోగశాల విశ్లేషణలు లేదా పరీక్షా యంత్రాల తయారీదారులు గతంలో లేరు, కానీ ఇప్పుడు మనకు రోజుకు 10 లక్షల కిట్ల కంటే ఎక్కువ దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

14.   కోవిడ్ -19 కేసుల యొక్క సరైన నిర్వహణ కోసం, ఆరోగ్య సౌకర్యాల మూడు అంచెల ఏర్పాటు [(i) తేలికపాటి లేదా పూర్వ-రోగలక్షణ కేసుల కోసం ఐసోలేషన్ పడకలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్; (ii) మితమైన కేసులకు ఆక్సిజన్ సౌకర్యం గల ఐసోలేషన్ పడకలతో ప్రత్యేకించిన కోవిడ్ హెల్త్ సెంటర్ (డిసిహెచ్‌సి), (iii) తీవ్రమైన కేసులకు ఐసియు పడకలతో ప్రత్యేకించిన కోవిడ్ హాస్పిటల్ (డిసిహెచ్)] అమలులోకి తెచ్చాము . కేసు నిర్వహణ కోసం ఇఎస్‌ఐసి,రక్షణ శాఖ, రైల్వే, పారామిలిటరీ ఫోర్స్, ఉక్కు మంత్రిత్వ శాఖ  తదితర తృతీయ సంరక్షణ ఆసుపత్రులను కూడా ఈ వినియోగంలోకి తేవడం జరిగింది. 12 సెప్టెంబర్ 2020 నాటికి, ఆక్సిజన్ లేని 13,14,646 ప్రత్యేక ఐసోలేషన్ పడకలు, 15,284 కోవిడ్ ట్రీట్మెంట్ సదుపాయాలు ఏర్పాటయ్యాయి. అలాగే, మొత్తం 2,31,093 ఆక్సిజన్ సపోర్ట్ ఐసోలేషన్ పడకలు, 62,717 ఐసియు పడకలు (32,575 వెంటిలేటర్ పడకలతో సహా) ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాధి ధోరణిని నిరంతరం పర్యవేక్షించడం, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల విశ్లేషణ, భవిష్యత్తు కోసం ముందుగానే ప్రణాళిక చేయడం వంటి చర్యల ద్వారా చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొన్నట్లుగా ఒక పెద్ద సంక్షోభాన్ని నివారించాము. అదనంగా, 5,98,811 పడకలతో మొత్తం 12,826 నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

15. కోవిడ్‌క్లినిక‌ల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీచేసి, క్ర‌మంత‌ప్ప‌కుండా వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు తాజామార్పులతో పెద్ద ఎత్తున పంప‌డం జ‌రిగింది. కోవిడ్ కేసు నిర్వ‌చ‌నం, ఇన్‌ఫెక్ష‌న్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు, లేబ‌రెటరీలో ప‌రీక్ష‌లు, ప్రారంభ‌ద‌శ‌లో చికిత్సకు మ‌ద్ద‌తు, తీవ్ర‌మైన కేసులు, సంక్లిష్ట‌త‌ల నిర్వ‌హ‌ణ‌వంటివి  ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌లో  ఉన్నాయి వైర‌స్‌కు వ్య‌తిరేకంగా చురుకుగా ప‌నిచేసేవి ఏవీ ఇప్ప‌టి వ‌ర‌కూ రుజువు కాలేదు. జ్వ‌రం,ద‌గ్గు ల‌క్ష‌ణాల‌కు తగిన చికిత్స‌, త‌గిన రీహైడ్రేష‌న్‌, అద‌న‌పు ఆక్సిజ‌న్ చికిత్స‌వంటివి చికిత్స‌లో భాగంగా ఉంటున్నాయి. స్వ‌ల్ప స్థాయి(రిస్కు ఎక్కువ ఉన్న కేసులు), ఒక మాదిరికేసుల‌లో, హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను వాడటం జ‌రుగుతోంది. ఇది కూడా ప‌రిమిత శాస్త్రీయ ఆధారాల‌తో జ‌రుగుతోంది. అయితే ఈ మందు ఇండియ‌లో ఇత‌ర జ‌బ్బుల‌కు విస్తృతంగా ఉప‌యోగిస్తున్నారు.ఆ సంద‌ర్భాల‌లో దీనిని ఎక్కువ కాలం కూడా వాడుతూ వ‌స్తున్నారు.దీనికి సుర‌క్షిత‌మైన మందుగా పేరుంది.
దీనికి తోడు తీవ్ర‌మైన కేసుల విష‌యంలో,  క‌న్వ‌ల్‌సెంట్ ప్లాస్మా,టోసిలిజుమాబ్ వాడ‌కానికి సంబంధించి వైద్యుల స‌న్నిహిత ప‌రిశీల‌న‌లో, ఇన్వెస్టిగేష‌న‌ల్ చికిత్స‌కు త‌గిన ప్రొవిజ‌న్లు రూపొందించారు.
 త‌గిన ప్ర‌మాణాల‌తోకూడిన చికిత్సా ప‌ద్ధ‌తుల‌కు సంబంధించి స‌మాచారాన్ని తెలిపేందుకు , చికిత్సా ప‌ద్ధ‌తులు తెలియ‌జేయ‌డానికి, మ‌ర‌ణాల రేటు గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డానికి విస్తృత చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది.ఎఐఐఎంఎస్ క‌రొనా హెల్ప్‌లైన్ 9971876591ను  ఏర్పాటు చేసింది.  మెడిక‌ల్ మేనేజ్‌మెంట్‌పై డాక్ట‌ర్లకు సూచ‌న‌లు ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఎఐఐఎంఎస్ సంస్థ‌, కోవిడ్ -19నేష‌న‌ల్ టెలి క‌న్స‌ల్టేష‌న్‌సెంట‌ర్ (సిఒఎన్‌టిఇసి)ను  నిర్వ‌హిస్తోంది.  ఈ కేంద్రాన్ని +91-9115444155 నెంబ‌ర్ ద్వారా సం‌ప్ర‌దించ‌వ‌చ్చు. కోవిడ్ నియంత్ర‌ణ‌కు సంబంధించి దేశంలోని ఎక్క‌డి నుంచైనా వైద్యులు  ఎయిమ్సు ఫ‌్యాక‌ల్టీసేవ‌ల‌ను  ఉప‌యోగించుకోవ‌చ్చు. సాధార‌ణ ప్ర‌జ‌లూ దీనిని ఉప‌యోగించుకోవ‌చ్చు.
 క్లినిక్‌ల‌లో ఎక్కువ‌మంది జ‌నం గుమికూడ కుండా చూసేందుకు ,వారికిగ‌ల జ‌బ్బుల‌ను న‌యం చేసేందుకు వీలుగా టెలిక‌న్స‌ల్టేష‌న్‌కు సంబంధించి 25-03-2020న టెలిమెడిసిన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేయ‌డం జ‌రిగింది.  ఇది ప‌రిమిత స‌దుపాయాలు క‌లిగిన చోట్ల ఆరోగ్య సంర‌క్ష‌కులు పేషెంట్ల‌కు చికిత్స అందించ‌డానికి వారికి కౌన్సిలింగ్‌కు ఇది ఉప‌క‌రిస్తుంది.

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ‌శాఖ , ఢిల్లీ ఎయిమ్సు క‌ల‌సి ఒక క్లినిక‌ల్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (సిఒఇ)ని ప్రారంభించాయి. ఎయిమ్స్ ‌సంస్థ ఉన్నత‌స్థాయి నోడ‌ల్ ఏజెన్సీగా ఉంది. రాష్ట్ర‌స్థాయి సిఒఇలు క్లినిక‌ల్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్స్‌పై మార్గ‌నిర్దేశం చేస్తాయి. కోవిడ్ కేసుల నిర్వ‌హ‌ణ‌లో డాక్ట‌ర్ల‌కు మార్గ‌నిర్దేశం అవ‌స‌ర‌మైన కీల‌క క్లినిక‌ల్ అంశాల‌కు సంబంధించి రాష్ట్ర‌స్థాయి సిఒఇల‌కు ఎయిమ్స్ సంస్థ వారం వారం వెబినార్లు ఏర్పాటు చేస్తున్న‌ది.  రాష్ట్ర‌స్థాయి సిఒఇలు ఈ స‌మాచారాన్ని జిల్లాస్థాయికి చేర‌వేస్తాయి.
 కోవిడ్‌, నాన్‌కోవిడ్ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు సంబంధించి దూర‌ప్రాంతాల‌వారికి నాణ్య‌మైన చికిత్స అందుబాటులో ఉండేట్టు చూసేందుకు, పెద్ద ఎత్తున టెలిమెడిసిన్‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రిగింది. ఈ సంజీవ‌ని పేరుతో వెబ్ ఆధారిత స‌మ‌గ్ర‌ టెలిమెడిసిన్ ప‌రిష్కారాన్ని 23 రాష్ట్రాలు ఉప‌యోగించుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, దూర దూరంగా ఉండే క‌మ్యూనిటీల ప్ర‌త్యేక ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌కు వీటిని వాడుతున్నారు.
ఐసిఎంఆర్ సంస్థ‌,  కోవిడ్ పై నేష‌న‌ల్ క్లినిక‌ల్ రిజిస్ట్రి ని ఏర్పాటు చేస్తున్న‌‌ది. ఇది కోవిడ్ -19 చికిత్స‌కు సంబంధించిన  స‌మాచారాన్ని , పేషెంట్ల కు చికిత్స త‌ర్వాత ఫ‌లితాన్ని తెలియ‌జేయ‌నుంది.

16. ఇత‌ర ర‌కాలుగా కూడా వాడ‌ద‌గ్గ మందుల‌కు సంబంధించి 13 క్లినిక‌ల్ ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. అలాగే సంప్ర‌దాయ విజ్ఞానాన్ని ఉప‌యోగించి కోవిడ్ -19 చికిత్స‌కు సంబంధించి న పోర్టుఫోలియోను రూపొందించ‌డం జ‌రుగుతోంది.  ఇమ్యునో మాడ్యులేట‌ర్ సెప్సివాక్ రెండో ద‌శ క్లినిక‌ల్‌ప‌రీక్ష‌లు విజ‌య‌వంతంగా పూర్తి అయ్యాయి. ఫైటో ఫార్మ‌సూటిక‌ల్ ఎసిక్యుహెచ్ రెండోద‌శ క్లినిక‌ల్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.అశ్వ‌గంధ‌కు సంబంధించి ప్రొఫిలాక్టిక్‌ప‌రీక్ష‌లు, గుడుచి+ పిప్ప‌లి,  యాష్టి మ‌ధు, పాలీ హెర్బ‌ల్ ఆయుష్‌ ఔష‌ధం (ఆయుష్ -64) ను ఒక మాదిరి అనారోగ్యంతో ఉన్న కోవిడ‌ద్ -19పేషెంట్ల పై ప్ర‌యోగాల‌కు ప్ర‌ణాళిక రూపొందించ‌బ‌డింది.
ఈ వ్యాధిని అరిక‌ట్టే ఆయుధాల‌లో స‌రైన వాక్సిన్ ఒక ఖ‌చ్చిత‌మైన ఉప‌క‌రణం కాగ‌ల‌దు. ఈ దిశ‌గా అంద‌ర్జాతీయంగా 145 కాండిడేట్ వాక్సిన్లు  ప్రీ క్లినిక‌ల్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతం 35 వాక్సిన్లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్ లో ఉన్నాయి. ఇండియాలో ప్ర‌ధాన దృష్టి కోవిడ్ -19 వాక్సిన్ అభివృద్ధిపై పెట్ట‌డం జ‌రిగింది. 30కి పైగా వాక్సిన్ కాండిడేట్లకు మ‌ద్ద‌తు నివ్వ‌డం జ‌రిగింది. వీటి అభివృద్ధి వివిధ ద‌శ‌ల‌లో ఉంది. మూడు కాండిడేట్ వాక్సిన్లు మొద‌టి,రెండ‌వ‌, మూడ‌వ అడ్వాన్సుడు ద‌శ‌లో ఉన్నాయి. 4కు పైగా ప్రీ క్లినిక‌ల్ డ‌వ‌ల‌ప్ మెంట్ ద‌శ‌లో ఉన్నాయి.
కోవిడ్ 19 బ‌యో రిపాజిట‌రీల‌ను కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.ఇవి 40 వేల శాంపిళ్ల‌ను సేక‌రించాయి.వీటిని ప‌రిశోధ‌కుల‌కు, ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు త‌గిన పరీక్ష‌లు, చికిత్స , వాక్సిన్ రూప‌క‌ల్ప‌న‌కు అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది.
కోవిడ్ వాక్సిన్‌సేక‌ర‌ణ‌, పంపిణీని స‌మ‌న్వ‌యం చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం 2020 ఆగ‌స్టు 7న  కోవిడ్ 19 వాక్సిన్ వాడ‌కానికి సంబంధించి ఒక జాతీయ నిపుణ‌ల బృందాన్ని నీతి ఆయోగ్ మెంబ‌ర్ (హెల్త్‌) అధ్య‌క్ష‌త‌న  ఏర్పాటు చేసింది.


17. ఆయుష్ మంత్రిత్వ‌శాఖ వివిధ చ‌ర్య‌ల ద్వారా కోవిడ్ -19ను ఎదుర్కోవ‌డం, దాని నిర్వ‌హ‌ణ‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది.రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డానికి, వ్యాధి బారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి  ప‌లు మార్గ‌ద‌ర్వ‌కాల‌ను మంత్రిత్వ‌శాఖ ‌సూచించింది. వివిధ వైద్య‌వ్య‌వ‌స్థల ద్వారా ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ఆరోగ్య సూచ‌న‌ల‌ను జారీచేసింది. రోగ‌నిరోధ‌క‌త‌, రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంపున‌కు సంబంధించిన స‌మాచారాన్ని8 విదేశీ భాష‌ల‌లోకి త‌ర్జుమా చేసి భార‌తీయ ఎంబ‌సీల‌కు పంప‌డం జ‌రిగింది.వివిధ ఆయుష్ ఆస్ప‌త్రుల‌ను క్వారంటైన్ కేంద్రాలుగా , ఐసొలేష‌న్ కేంద్రాలుగా, కోవిడ్ కేర్ సెంట‌ర్లుగా , కోవిడ్ ఆరోగ్య కేంద్రాలుగా మార్చ‌డం జ‌రిగింది. సుమారు 8.5 ల‌క్ష‌ల మంది ఆరోగ్య‌రంగానికి చెందిన వారు covidwarriors.gov.in పై త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. ఆయుష్ మంత్రిత్వ‌శాఖ అంత‌ర్ విభాగ ఆయుష్ ప‌రిశోధ‌న అభివృద్ధి టాస్క్‌ఫొర్సును ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫొర్సు  ఆయుష్ మందుల రొగ‌నిరోధ‌క అధ్య‌య‌నాల‌కు సంబంధించి క్లినిక‌ల్‌ల రీసెర్చి ప్రోటోకాల్స్ రూపొందించింది. అలాగే కోవిడ్ -19 పాజిటివ్ కేసుల‌కు సంబంధించి అద‌న‌పు చ‌ర్య‌ల‌కు ప్రోటోకాల్స్ రూపొందించింది.  ఆయుష్ మందుల‌తో ప్రొఫిలాక్సిస్ చికిత్స‌కు ఆయుష్‌-సిఎస్ఐఆర్ సంయుక్త అధ్య‌య‌నాలు చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఆయుష్ మంత్రిత్వశాఖ కింద‌గ‌ల‌ ఆయుష్ రిసెర్చ్ కౌన్సిళ్లు, జాతీయ సంస్థ‌ల ద్వారా ఆయుష్ చర్య‌లు ఏమేర‌కు రోగ‌నిరోధ‌క‌త పెంచుతున్నాయ‌న్న‌దానిపై కంటైన్‌మెంట్‌జోన్ల లోని ఎంపిక చేసిన ప్ర‌జ‌ల‌పై అధ్య‌య‌నం జరుగుతోంది.
ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌, కోవిడ్ -19ను అరిక‌ట్టేందుకు మొబైల్ అప్లికేష‌న్ యాప్ ఆయుష్‌సంజీవ‌ని యాప్ ద్వారా ఆయుష్ స‌ల‌హాలు, సూచ‌న‌లు, ఆమోదానికి సంబంధించి ప్ర‌భావాన్ని తెలుసుకుంటోంది.


18. రాష్ట్రాల‌ను త‌మ వ‌ద్ద గ‌ల వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ ప‌రిక‌రాల స్టాక్ ప‌రిస్థితిని  గ‌మ‌నించుకోవ‌ల‌సిందిగా, వాటిని స‌మీక‌రించుకోవ‌ల‌సిందిగా సూచించ‌డం జ‌రిగింది.  ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్ర ప్రభుత్వం 1.92 కోట్ల పిపిఇల‌కు ఆర్డ‌ర్లు పెట్టింది. మంత్రిత్వ‌శాఖ 2020 సెప్టెంబ‌ర్ 11 నాటికి 1.39 కోట్ల పిపిఇ కిట్ల‌ను , 3.43 కోట్ల ఎన్‌.95 మాస్కుల‌ను రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేసింది.
డిపార్ట‌మెంట్ ఆఫ్ ఫార్మ‌సూటిక‌ల్సు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్ప‌త్తిని  ఎన్నో రెట్లు పెంచింది. 2020 సెప్టెంబ‌ర్ 11 నాటికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ 10.84 కోట్ల హైడ్రాక్సీ క్లోరొక్విన్ టాబ్లెట్ల‌ను రాష్ట్రాల‌కు , కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేసింది.  ఇండియా దీనిని 140 దేశాల‌కు ఎగుమ‌తి చేసింది కూడా.
ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు, కేంద్ర ప్ర‌భుత్వం , 60,948 వెంటిలేట‌ర్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. 2020 సెప్టెంబ‌ర్ 11 నాటికి రాష్ట్రాల‌కు 32,109 వెంటిలేట‌ర్లు కేటాయించ‌డం జ‌రిగింది. అందులో 30,170 వెంటిలేట‌ర్ల‌ను రాష్ట్రాల‌కు చేరవేశారు.ఆక్సిజ‌న్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌లో దేశం స్వ‌యం స‌మృద్ధితో ఉంది. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ ఇప్ప‌టివ‌ర‌కూ 1,02,400 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను వివిధ ‌రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల‌కోసం సేక‌రించి, వాటిని స‌ర‌ఫ‌రా చేసింది.  దీనికి తోడు ఆక్సిన్ కాన్‌స‌న్‌ట్రేట‌ర్ల‌ను కూడా రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రాచేయ‌డం జ‌రుగుతోంది.


19. వివిధ రంగాలు, వివిధ విభాగాల‌లో పెద్ద సంఖ్య‌లో కోవిడ్ వారియ‌ర్ల‌ను గుర్తించి వారికి శిక్ష‌ణ‌నివ్వ‌డం ప్ర‌భుత్వం ముందున్న ప్ర‌ధాన స‌వాళ్ల‌లో ఒక‌టి.వీరిని కోవిడ్‌సంబంధిత ప‌నిలో మాత్ర‌మే కాక ఇత‌ర అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల నిర్వ‌హ‌ణ‌లో కూడా వినియోగించ‌వ‌ల‌సి ఉంటుంది.  ర‌క్ష‌ణ‌, ఆయుష్‌, ఎన్‌.సి.సి, ఎన్‌.ఎస్‌.ఎస్‌.ఎన్‌.వై.కె. ప్ర‌భుత్వం రంగ సంస్థ‌లు, ప్రైవేటు రంగం నుంచి మాన‌వ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ జ‌రిగింది.
ప‌లు ప‌రిమితులు, స‌వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ, కోవిడ్ పోరాట‌యోధులు మాన‌వాళికి సేవ‌చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. డాక్ట‌ర్లు,న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ క్షేత్ర‌స్థాయి సిబ్బంది, సెక్యూరిటీ, పోలీసులు, శానిట‌రీ వ‌ర్క‌ర్లు, వాలంటీర్లు,జ‌ర్న‌లిస్టులు, కోవిడ్ నుంచి మ‌న దేశ ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశారు. వారు అందించిన సేవ‌ల‌కు వారికి అభినంద‌న‌లు తెలుపుతూ ఆ విష‌యాన్ని రికార్డుచేయాల్సిందిగా ఈ అత్యున్న‌త స‌భ‌ను నేను కోరుతున్నాను.
    ఆరోగ్య సేవ‌ల లోనివారు  త‌మ విధుల‌ను నిర్వ‌ర్తించ‌డంలో వేధింపుల‌కు, హింస‌కు, ప్రాణాల‌కే ప్ర‌మాద‌క‌రమైన ప‌రిస్తితుల‌ను ఎదుర్కొన్న సంద‌ర్భాలు ఉన్నాయి. దీనిని అధిగ‌మించ‌డానికి , వారి కృషికి అండ‌గా నిల‌వ‌డానికి భార‌త ప్ర‌భుత్వం అంటు వ్యాధుల (స‌వ‌ర‌ణ‌) ఆర్డినెన్సు 2020ని 2020 ఏప్రిల్ 22 న తీసుకు వ‌చ్చింది.
ఆస్ప‌త్రుల‌లో పేషెంట్ల‌కు స‌హాయ‌ప‌డే వైద్య సిబ్బంది తో పాటు వివిధ రకాల మాన‌వ వ‌న‌రుల సామర్ధ్యాన్ని పెంపొందించ‌డం, అలాగే వైద్యేత‌ర వ్య‌క్తులు, కోవిడ్ వ్యాప్తిని క‌నిపెట్టి తెలియ‌జేసే క్షేత్ర స్థాయికార్య‌క‌ర్త‌లు , లాజిస్టిక్స్ వంటి వాటి సామ‌ర్ధ్యం పెంచేందుకు  డి.ఒ.పి.టి నిర్వ‌హిస్తున్న ఐజిఒటి- దీక్షా (ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం)  (https://igot.gov.in/igot/) లో మాడ్యూళ్లను అందుబాటులో ఉంచ‌డం జరిగింది. శిక్ష‌ణ మాడ్యూళ్ల‌ను ప్రాంతీయ భాష‌ల‌లోకి అనువదించారు.  సుమారు 29.15 ల‌క్ష‌ల మంది వివిధ కోర్సుల‌కు రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. వీరిలో 5,699 మంది వైద్యులు, 86,018 మంది ఆయుష్ ప్రొఫెష‌న‌ల్స్‌, 5,881 మంది ఫ్రంట్ లైన్‌వ‌ర్క‌ర్లు , 2,70,736 మంది వాలంటీర్లు, 25,42,892 మంది ఇత‌ర వ్య‌క్తులు ఉన్నారు. సుమారు 18.96 ల‌క్ష‌ల‌మంది కోర్సును పూర్తి చేయ‌డం ఐ జిఒటి- దీక్షా ప్లాట్‌ఫారం ద్వారా జ‌రిగింది.  శిక్ష‌ణ ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన వ‌న‌రులను వైద్య‌, వైద్యేత‌ర వ్య‌క్తుల‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ వెబ్‌సైట్‌లో ఉంచ‌డం జ‌రిగింది.
మ‌నం ఇప్ప‌డు ప‌ర్య‌ట‌న సంబంధిత కేసుల‌ను అదుపుచేయ‌డం ద‌గ్గ‌ర నుంచి క్ల‌స్ట‌ర్లలో నియంత్రించ‌డం, స్థానిక వ్యాప్తి నుంచి పెద్ద ఎత్తున ప‌ట్ట‌ణ‌, ప‌ట్ట‌ణ శివారు , గ్రామీణ ప్రాంతాల‌లో వైరస్‌విజృంభించ‌కుండా క‌ట్ట‌డి చేసే దిశ‌గా క‌దులుతున్నాం.   ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు అనారొగ్యం పాలుకాకుండా, పెద్ద‌సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించ‌కుండా  చూసేలా, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ప్ర‌భుత్వం నిరంత‌ర కృషి అవ‌స‌రం. అలాగే గ‌ర్భిణులు, పిల్ల‌ల ఆరోగ్యం, వాక్సిన్ ద్వారా నియంత్రించ‌గ‌ల వ్యాధులు, సాంక్ర‌మికేత‌ర వ్యాధులు, టిబి, కాలాఅజ‌ర్‌, మ‌లేరియా వంటి వాటిని అదుపుచేయ‌డంలో సాధించిన విజ‌యాల‌ను కాపాడుకోవ‌డం కూడా ఎంతైనా అవ‌స‌రం.
అందువ‌ల్ల కోవిడ్‌యేత‌ర అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల నిర్వ‌హ‌ణ‌పై కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్ట‌డం జ‌రుగుతోంది.


20. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ వెబ్‌సైట్‌ను రోజూ అప్‌డేట్ చేయ‌డం జ‌రుగుతోంది. దేశంలో కోవిడ్ -19 వ్యాప్తికి సంబంధించిన స‌మాచారాన్ని దేశ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు దీని ద్వారా స‌మాచారం ఇస్తున్నారు. రెగ్యుల‌ర్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు , మీడియా స‌మావేశాలూ జ‌రుగుతున్నాయి. క‌మ్యూనికేష‌న్ మెటీరియ‌ల్‌, ఉప‌క‌ర‌ణాలు అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది.( పాంప్లెట్లు, పోస్ట‌ర్లు, ఆడియో, ఎవి ఫిల్ములు). కోవిడ్ -19 మ‌హ‌మ్మారిగురించి, దానిని నిరోధించేందుకు ప్ర‌జ‌లు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌లు, దీని చుట్టూ ప్ర‌చారంలొ ఉన్న అపొహ‌లు, వ్యాధికి గురైన వారి ప్ర‌తిష్ఠ‌కు మ‌చ్చ‌తెచ్చే చ‌ర్య‌ల వంటివాటిని  ఎదుర్కోవ‌డం, హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను విస్తృతంగా ప్ర‌చారంచేయ‌డం వంటివి ఈ మెటీరియ‌ల్ లో ఉన్నాయి. క‌మ్యూనికేష‌న్ మెటీరియ‌ల్‌ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌వెబ్‌సైట్‌లో పెట్ట‌డం జ‌రిగింది. సోష‌ల్‌మీడియా ద్వారా దీనిని ప్ర‌చారం చేయ‌డం జ‌రుగుతోంది. చేయ‌ద‌గిన‌,చేయ‌కూడ‌ని వాటిపై ఎస్‌.ఎం.ఎస్‌ల‌ద్వారా విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు. (550 కోట్ల ఎస్ఎంఎస్ లు పంపారు.) కాల‌ర్ ట్యూన్‌మెసేజ్‌లు 13 భాష‌ల‌లో117 కోట్ల‌ టెలికం స‌బ్ స్క్ర‌యిబ‌ర్ల‌కు చేరాయి.
తొలినాళ్ల‌లొ ఒక ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్ , హెల్ప్‌లైన్ (1075)ను ప్రారంభింప‌బ‌డింది. ప్ర‌జ‌ల‌కు మార్గ‌నిర్దేశం చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు దీనిని అద్భుతంగా ఉప‌యోగించుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ 41.04 ల‌క్ష‌ల కాల్స్ ను ఈ హెల్ప్‌లైన్ అందుకుంది.


21. డిపార్ట‌మెంట్ ఆఫ్ బ‌యో టెక్నాల‌జీ, డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, సిఎస్ ఐ ఆర్‌, డిపార్ట‌మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చి
కోవిడ్ -19 కు సంబంధించి స‌మ‌గ్ర శాస్త్ర‌, సాంకేతిక ప‌రిష్కారాల చైన్‌ను  విద్యారంగం, ప‌రిశోధ అభివృద్ధి ల్యాబ్‌లు, ప‌రిశ్ర‌మ‌, స్టార్ట‌ప్‌లు, ఎన్‌.జి.ఒల ద్వారా క‌‌వ‌ర్‌చేశాయి.
ఈ ప‌రిష్కారాలలో, ప్ర‌వ‌ర్త‌న‌పై మౌలిక శాస్త్రీయ అధ్య‌య‌నం, వ్యాప్తి,వైర‌స్ ప్ర‌భావం, మ‌హ‌మ్మారికి సంబంధించి గ‌ణిత న‌మూనా, ఇక ఉత్ప‌త్తుల విష‌యంలో ప్ర‌పంచ శ్రేణి వెంటిలేట‌ర్లు, డ‌యాగ్నస్టిక్ కిట్‌లు, వాక్సిన్‌లు, చికిత్స‌, యాంటీ వైర‌ల్ కోటింగ్‌లు, క్రిమిర‌హితాలు, పిపిఇలు మాస్కులు, మొబైల్ టెస్టింగ్ బూత్‌లు, ఆస్ప‌త్రులు , కృత్రిమ మేధ ఆధారిత ఉప‌క‌ర‌ణాలు, ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అంద‌జేయ‌డం వంటివి ఉన్నాయి.
 ఈ ప్ర‌యోజ‌నాల సాధ‌న కోసం , 110 కి పైగా  టెక్నాల‌జీ స్టార్ట‌ప్‌లు, వాణిజ్య ఉత్ప‌త్తి కోసం 20  కిపైగా ప‌రిశ్ర‌మ‌ల‌ను  గుర్తించడానికి,  మ‌ద్ద‌తు ఇచ్చేందుకు మ‌న మొత్తం స్టార్ట‌ప్ వ్య‌వ‌స్థ‌ను స‌మ‌గ్రంగా ప‌రిశీలించ‌డం జ‌రిగింది. వైర‌స్ తీరుతెన్నుల‌కు సంబంధించిన అన్ని అంశాల‌లో సుమారు 150 కి పైగా ప్రాజెక్టులు ప్రారంభ‌మ‌య్యాయి.


22.  మారుతున్న ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు తాజా స‌మాచారం తెలుసుకునేందుకు భార‌‌త ప్ర‌భుత్వం క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కేంద్ర కార్యాల‌యంతో, ప్రాంతీయ కార్యాల‌యం, మ‌న దేశంలోని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కార్యాల‌యంతో సంప్ర‌దిస్తూ ఉంది. కోవిడ్ మ‌హ‌మ్మారి విసిరిన స‌వాలును ఎదుర్కోవ‌డంలో భార‌త ప్ర‌భుత్వం ఇత‌ర దేశాల‌కు మ‌ద్ద‌తు నిచ్చింది. కోవిడ్ కు జి-20, బ్రిక్సు స్పంద‌న  విష‌యంలొ ఇండియా కీల‌క పాత్ర పోషించింది. అలాగే సార్క్ పొరుగు దేశాల‌కు అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల‌లో ఇండియా త‌న‌వంతు మద్ద‌తునిస్తోంది.


23.  భ‌విష్య‌త్తులో ఇలాంటి మ‌హ‌మ్మారులు, వ్యాధుల‌ను ఎదుర్కొవ‌డానికి , లోపాల‌ను గుర్తించి , ప్ర‌భుత్వం ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌ను నిర్మిస్తోంది. దీనిని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి ఆత్మ‌నిర్బ‌ర్ స్వాస్త్ భార‌త్ యోజ‌న కింద‌ 65,560.98 కోట్ల రూపాయ‌ల వ్య‌య ఆర్థిక మెమ‌రాండం  ప‌రిశీల‌న‌లో ఉంది. ఇందులో ప‌రిశోధ‌న‌, ఆరోగ్య ర‌క్ష‌ణ‌,  మ‌హ‌మ్మారుల నియంత్ర‌ణ పై ప్ర‌ధాన దృష్టితో ప్ర‌జారోగ్య మౌలిక స‌దుపాయాల  వృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి.


24. కోవిడ్ పై పోరాటం ఇంకా ముగిసి పోలేదని గౌర‌వ పార్ల‌మెంటు స‌భ్యుల‌కు తెలియ‌జేసుకుంటున్నాను. ఒక‌వైపు మ‌నం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించేందుకు అన్‌లాక్ ద‌శ‌లో ఉన్నాం. అలాగే స‌మ‌తూకంతో కూడిన వైఖ‌రిని అనుస‌రిస్తున్నాం.  కోవిడ్ వైర‌స్‌వ్యాప్తిని నియంత్రించేందుకు. దాని వ్యాప్తి గొలుసును తెంచేందుకు నిరంత‌రం క‌మ్యూనిటీ మ‌ద్ద‌తు అవ‌స‌రం.
కోవిడ్ నియంత్ర‌ణ‌కు సంబంధించి త‌గిన ప్ర‌వర్త‌న క‌లిగి ఉండేలా మీ మీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో  ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకువ‌చ్చేందుకు మీ మ‌ద్ద‌తు ఎంతో అవ‌స‌రం.
ముఖానికి మాస్కు ధ‌రించ‌డం, త‌ర‌చూ చేతులు శుభ్రం చేసుకుంటుండ‌డం, శ్వాసకుసంబంధించిన మెరుగైన ప‌ద్ధ‌తులు పాటించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం- 2గ‌జ్‌కి దూరి ని సామాజిక వాక్సిన్‌గా పరిగ‌ణించ‌డం, వంటి సుల‌భ‌మైన ప్ర‌జారోగ్య చ‌ర్య‌లు పాటించిన‌ట్ట‌యితే,  అది కోవిడ్ వ్యాప్తిని నియంత్రించ‌డానికి, అరిక‌ట్డడానికి స‌హాయ‌ప‌డుతుంది.


25. దేశంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటోంద‌ని ఈ స‌భ‌కు తెలియ జేస్తున్నాను.

***

 


(Release ID: 1654166) Visitor Counter : 616