ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో తగినంత ఆక్సిజన్ లభ్యత ఉండేలా చూడాలని 7 పెద్ద రాష్ట్రాలను కోరిన - కేంద్ర ఆరోగ్య, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం, ఫార్మాస్యూటికల్స్ శాఖల కార్యదర్శులు
Posted On:
13 SEP 2020 5:57PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ, డి.పి.ఐ.ఐ.టి., ఫార్మాస్యూటికల్స్ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ కార్యదర్శులు, పరిశ్రమల శాఖ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. ఈ రాష్ట్రాల్లోని అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో తగినంత ఆక్సిజన్ లభ్యత మరియు ఎటువంటి నిబంధనలు లేకుండా ఆయా రాష్ట్రాల్లోనూ, రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ కదలికలను నిర్ధారించడం ఈ సమావేశం యొక్క లక్ష్యం.
ఈ కార్యక్రమంలో చివరిగా, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్, ఈ సమావేశంలో పాల్గొన్నవారినందరినీ ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా, రాష్ట్రాలకు ప్రత్యేకంగా సూచించిన సలహాలు :-
1. సదుపాయాల వారీగా / ఆసుపత్రుల వారీగా ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవాలి, సమయానుసారంగా తిరిగి నింపడానికి ముందస్తు ప్రణాళికను నిర్ధారించుకోవాలి, తద్వారా నిల్వ లేకపోవడాన్ని నివారించవచ్చు.
2. రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల మధ్య మెడికల్ ఆక్సిజన్ కదలికలపై ఎటువంటి ఆంక్షలు లేకుండా నిర్ధారించుకోవాలి.
3. నగరాల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్.ఎం.ఓ) ట్యాంకర్ల కదలికల కోసం “గ్రీన్ కారిడార్” ఏర్పాటు చేయాలి.
4. ఆసుపత్రులు మరియు సంస్థలు ఆక్సిజన్ సరఫరా కోసం, ఆక్సిజన్ తయారీదారులతో, దీర్ఘకాలిక టెండర్ / కాంట్రాక్ట్ ఒప్పందాన్ని కలిగి ఉండాలి, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అందువల్ల, ఆక్సిజన్ సరఫరా కదలికలపై రాష్ట్రాలు ఆంక్షలు విధించకూడదు.
5. ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా అయ్యేందుకు వీలుగా, తయారీదారులు మరియు సరఫరాదారులకు చెల్లించాల్సిన బిల్లులను సకాలంలో చెల్లించేలా చూసుకోండి.
6. విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలను మెరుగుపరచండి. ఆక్సిజన్ తయారీ యూనిట్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను నిర్ధారించండి.
7. ఆక్సిజన్ నింపే కేంద్రాలకు సిలిండర్లను పంపేటప్పుడు నిబంధనల ప్రకారం ఆక్సిజన్ సిలిండర్లను సరైన క్రిమిసంహారకాలతో శుభ్రం చేసేలా నిర్ధారించుకోండి.
8. ఆక్సిజన్ సేకరణ కోసం ఉక్కు పరిశ్రమ యూనిట్లతో సమర్థవంతమైన సమన్వయం కలిగి ఉండాలి. ఎందుకంటే, రోజుకు 6,400 మెట్రిక్ టన్నులు అందించే ఆక్సిజన్ తయారీదారులతో పాటు ఉక్కు పరిశ్రమలు కూడా రోజుకు 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి.
*****
(Release ID: 1653885)
Visitor Counter : 214