సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అఫ్ అడ్మినిస్ట్రేషన్ 61వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రభుత్వ రంగంలోని 20 విభిన్న సర్వీసులకు చెందిన వారికి మొదటిసారిగా 'ఉమ్మడి' ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తున్న అకాడమీ : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 10 SEP 2020 5:56PM by PIB Hyderabad

గతంలో కేవలం ఐఏఎస్ మరికొన్ని ఇతర సర్వీసుల వరకే ఉన్న శిక్షణ కోర్సు విస్తృతిని ఇంకా పెంచుతూ ముస్సోరీ లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బిఎస్ఎన్ఏఏ) ఇప్పుడు ఉమ్మడి ఫౌండేషన్ కోర్సు చేపట్టిందని, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పిఎంఓ, సిబ్బంది, ప్రజాసమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రభుత్వ రంగానికి చెందిన 20 విభిన్న కోర్సులను అకాడమీ ‘ఉమ్మడి’ ఫౌండేషన్ కోర్సుగా చేపట్టడం ఇది మొదటి సారి అని ఆయన తెలిపారు.

ఇంకా మరి కొన్ని సర్వీసులను కూడా చేర్చి, ఫౌండేషన్ కోర్సు పరిథిని ఇంకా పెంచుతామని ఆయన వెల్లడించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి అనుగుణంగా ఉన్న ఆలోచన అని, అధికారులంతా  ఒక ఉమ్మడి దృక్పథాన్ని, ఒకే దృష్టిని కలిగిఉండాలని కేంద్ర మంత్రి వివరించారు.  

అకాడమీ 61 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూలాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ భారత ఉపఖండంలోనే కాదుమొత్తం ప్రపంచంలోనే ప్రధాన సంస్థలలో ఒకటి అని అన్నారు. గత ఆరు దశాబ్దాల కాలం ఒక సంస్థ చరిత్రలో చాల విశేషమైనదని, సంవత్సరాలుగా అకాడమీ అభివృద్ధి చెందిన విధానం దానిని చెమటోడ్చి పెంచి పోషించిన వారి శ్రమ ఇందుకు తగు సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

వివేకవంతుడైన విద్యావంతుడు, నిర్వాహకుడైన డాక్టర్ సంజీవ్ చోప్రా నాయకత్వంలో ఒక కుటుంబంలా పనిచేస్తున్న అకాడమీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసారు. గడువు కంటే చాలా ముందుగానే వినుత్నమైన ఆలోచనలతో కూడిన శిక్షణ, బోధనా పద్ధతులను రూపకల్పన చేసినందుకు అకాడమీని అభినందించారు. భవిష్యత్ సవాళ్లతో పోరాడటానికి అకాడమీ నిరంతరం మంచి మార్గదర్శకులకు శిక్షణ ఇస్తోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 

పాలనా సంస్కరణల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన విధానాన్ని ప్రస్తావిస్తూడాక్టర్ జితేంద్ర సింగ్, గత సంవత్సరం గుజరాత్ లోని కెవాడియాలో అధికారులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారుఅక్కడ ఆయన ఇలా అన్నారు, “నిష్పాక్షికంగా, నిస్వార్థ స్ఫూర్తితో చేసే ప్రతి ప్రయత్నం న్యూ ఇండియాకు బలమైన పునాది”.

నవ భారతం కలను నెరవేర్చడానికి, 21 వ శతాబ్దపు ఆలోచన, కలలు మన అధికారయంత్రంగానికి ఎంతో అవసరం – అటువంటి అధికారులలో సృజనాత్మక, నిర్మాణాత్మకఉహించేమెళుకువ, వినూత్నమైనచురుకైన, మర్యాదపూర్వకవృత్తిపరమైన. ప్రగతిశీలశక్తివంతమైన, సమర్థవంతమైన, పారదర్శక, సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి గుణగణాలు పెంపొందాలి  అని కేంద్ర మంత్రి అన్నారు.

2017 లో ఎల్‌బిఎస్‌ఎన్‌ఎకు ప్రధానమంత్రి రెండు రోజుల పర్యటన వచ్చిన సందర్భాన్ని మంత్రి ప్రస్తావించారుఅక్కడ 92 వ ఫౌండేషన్ కోర్సు ఆఫీసర్ ట్రైనీలతో విస్తృతంగా సంభాషించారు, కూరుకుపోకుండా బయటకు రావడం, స్థిరమైన అభ్యాసంపై దృష్టి పెట్టడం అనే మంత్రాన్ని వారికి ఇచ్చారు. ఈ వినూత్న ఆలోచనను నెరవేర్చడానికికేంద్ర మంత్రివర్గం ఇటీవలే మిషన్ కర్మయోగి-నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్‌పిసిఎస్‌సిబి) ను ఆమోదించిందినవ భారతం కోసం కొత్త భవిష్యత్తుకు సన్నద్ధం అయ్యే సివిల్ సర్వీస్ ను  రూపొందించడంలో ఎంత దూరమైనా వెళ్ళాల్సి ఉంటుంది.. అని కేంద్ర మంత్రి అన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవటానికి సృజనాత్మకనిర్మాణాత్మకచురుకైన సాంకేతికంగా సాధికారికత కలిగిన నిజమైన కర్మయోగిగా పౌర సేవలను అవతరించే ప్రయత్నం ఇది అని ఆయన అన్నారు. ఔత్సాహిక అభ్యర్థుల సౌలభ్యం కోసం కేంద్ర క్యాబినెట్ కూడా ఇటీవల ఎన్‌ఆర్‌ఏను ఆమోదించిందిఅయితే మిషన్ కర్మయోగి ఒకరు సేవల్లో చేరిన తర్వాత నిరంతరం నేర్చుకోవడంపై దృష్టి సారించాలని చెబుతుందని ఆయన అన్నారు. 

అదేవిధంగాఈ ఏడాది ఏప్రిల్‌లో డిoపిటి కరోనా యోధుల కోసం ప్రత్యేకమైన గవక్షంతో ఒక అభ్యాస వేదికను (https://igot.gov.inప్రారంభించిందనిప్రారంభించిన 10-15 రోజుల్లోనే 25 మందికి పైగా అధికారులు నమోదు చేసుకుని శిక్షణ పొందారని ఆయన అన్నారు. కరోనా మేనేజ్‌మెంట్ కోసం 700 జిల్లాలను పర్యవేక్షించే మరో చొరవ గురించి ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్యువ కలెక్టర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవడంలో ఉన్నతమైన పాత్ర పోషించారు. ఈ అత్యుత్తమ పనితీరుకు ఒక కారణం ఏమిటంటేకేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీలుగా పనిచేసిన ఐఎఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో వారి మార్గదర్శకుల నుండి ఎంతో నేర్చుకున్నారుఇది మోడీ ప్రభుత్వ మొదటి విలక్షణ ఆలోచన.

మహమ్మారి దేశాన్ని కబళించే ముందు ఉన్న పరిస్థితి లాగే పాలనా వ్యవస్థ ప్రస్తుత విపత్కర స్థితిలో కూడా సజావుగానే భారత్ సాగించగలుగుతోందని ప్రపంచానికి రుజువు చేసి చూపించగలిగామని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అకాడమీ కొత్తగా ఉమ్మడి కోర్సును నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం నుండి ఇందుకు పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్, స్వాతంత్ర్య పోరాటంలో అతి తక్కువగా మాత్రమే పరిచయం ఉన్న పోరాట యోధుల గురించి రాసిన పుస్తక సంకలనాన్ని ఆవిష్కరించారు.

<><><><><>



(Release ID: 1653156) Visitor Counter : 112