జల శక్తి మంత్రిత్వ శాఖ

"భారతదేశంలో జల వనరుల రంగం అవలోకనం"పై మీడియా ప్రతినిధులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ, కార్యశాల

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2020 5:48PM by PIB Hyderabad

జల వనరుల ప్రణాళిక, వృద్ధి, నిర్వహణలో నీటి రంగం నిపుణులకు శిక్షణ, సామర్థ్యం పెంపు అంశాల్లో.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జల వనరుల విభాగం ఆర్‌డీ&జీఆర్‌ "సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌"లా పనిచేస్తోంది.

    పుణెలోని ఎన్‌డబ్ల్యూఏ.. ఎన్‌జీవోలు, మీడియా ప్రతినిధులకు బసతో కూడిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం, "భారతదేశంలో జల వనరుల రంగం అవలోకనం"పై మీడియా ప్రతినిధులకు శిక్షణ, కార్యశాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. వచ్చే నెల 5-9 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది.

    ఎన్‌డబ్ల్యూఏకు రాకుండా, సొంత ప్రాంతాల నుంచే ఈ కార్యక్రమంలో అభ్యర్థులు పాల్గొనాలి. కార్యక్రమ రుసుము లేదు. ఈ క్రింది లింకుల ద్వారా కార్యక్రమ వివరాలు తెలుసుకోవచ్చు.

కార్యక్రమ బ్రోచర్‌ https://nwa.mah.nic.in/upcoming.htm
నామినేషన్ కాల్ లెటర్ https://nwa.mah.nic.in/upcoming.htm 
కోర్స్‌ నమోదు https://forms.gle/ksbuyHi3AwYHfzHL9

***
 


(రిలీజ్ ఐడి: 1653103) సందర్శకుల సూచీ సంఖ్య : : 157
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , Manipuri , English , Urdu , हिन्दी , Punjabi , Tamil