శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జిజ్ఞాస కార్యక్రమం కింద కోవిడ్-19 ను ఎదుర్కోవటానికి సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ శాస్త్ర సాంకేతిక వినియోగంపై వెబినార్
"సైన్స్ నుండి మనం ఆశించే ఏ పరిష్కారంలోనైనా మంచి ఫలితాలను పొందటానికి మనకు ఒక ఉమ్మడి లక్ష్యం, భాగస్వామ్య దృష్టి, సైన్స్ -సమాజం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండాలి" - ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ
Posted On:
09 SEP 2020 9:52AM by PIB Hyderabad
"సామజిక-ఆర్థిక అభివృద్ధిలో సైన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుత మహమ్మారిని సమిష్ఠి స్ఫూర్తితో ఎదుర్కోడానికి ఒక ఉమ్మడి లక్ష్యం ఉండాలి. భాగస్వామ్య దృష్టి ఉండాలి. ఫలితాలు సరైనవి రావడానికి, మనం అనుకున్నవి రావడానికి సైన్స్ - సమాజం మధ్య గొప్ప అనుసంధానం ఉండాలి" అని దుర్గాపూర్ సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ అన్నారు. స్థానిక పాలనావ్యవస్థ ప్రభావంతంగా ఉంటె అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.జమ్మూ కశ్మీర్ పాఠశాల విద్యా శాఖ కింద పని చేస్తున్న సమగ్ర శిక్ష తో కలిసి దుర్గాపూర్ సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ నిర్వహించిన వెబినార్ లో ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ కోవిడ్ నేపథ్యంలో సైంటిఫిక్-టెక్నలాజికల్ అవసరాలపై ప్రసంగించారు. 'జిజ్ఞాస' అనే కార్యక్రమంలో భాగంగా ఈ వెబినార్ నిర్వహించారు.
డాక్టర్ అస్గర్ సమూన్, ఐఏఎస్, ముఖ్య కార్యదర్శి, స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ & స్కిల్ డెవలప్‌మెంట్, జమ్మూ & కాశ్మీర్, డాక్టర్ అంజలి ఛటర్జీ, చీఫ్ సైంటిస్ట్, సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ, ఆ సంస్థ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ హిమాద్రి రాయ్, శ్రీ అవినాష్ యాదవ్, డాక్టర్ నాసిర్ ఉల్ రషీద్, శ్రీ సంజయ్ హన్స్దా కూడా ప్రసంగించారు. వెబినార్ లో 3,500 మంది పాల్గొన్నారు. .
'జిజ్ఞాస' కింద జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ (డాక్టర్) హిరానీ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉన్నత పాఠశాల విద్య, ఐటీఐ, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, స్థాయి విద్యార్థులలో నిబిడీకృతమై ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి శాస్త్ర సాంకేతికతను జోడించి ఆయా రంగాల్లో మంచి ఔత్సాహికులుగా తీర్చి దిద్దడం సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రస్తుత మహమ్మారి చాల సుదీర్ఘంగా సాగేదని, ఇటువంటి సందర్భంలో సైన్స్ ఒక ఎటువంటి మేజిక్ నైనా చేయవచ్చని ఆయన చెప్పారు.
సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ అభివృద్ధి చేసిన శాస్త్ర సాంకేతిక పరిష్కారాలైన పేస్ మాస్కులు, మౌలికమైన ద్రవ సబ్బులు, చేతి శానిటైజెర్లు, స్ప్రేయర్లు, వెంటిలేటర్లు, మొదలైనవి కోవిడ్ మహమ్మారిని నిలువరించడమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా కలిగాయని ప్రొఫసర్ హిరానీ తెలిపారు. స్వచ్ఛమైన నీరు, గాలి, మంచి పర్యావరణం, సరైన వ్యర్థ పదార్థాలు నిర్వహణ వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ చర్యలు కోవిడ్ తదనంతర పరిస్థితులకు కూడా చాల అవసరమని ఆయన చెప్పారు. ఈ ప్రయత్నాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని సూచించారు.
జమ్మూ & కాశ్మీర్, స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ & స్కిల్ డెవలప్‌మెంట్ముఖ్య కార్యదర్శి డాక్టర్ అస్గర్ సమూన్, ఐఏఎస్, మాట్లాడుతూ రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్య విధానాన్ని వివరించారు. సిఎస్ఐఆర్ ల్యాబులు దేశవ్యాప్తంగా ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ లో అందిస్తున్న సహాయం విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తోందని తెలిపారు.
వెబినార్ సందర్భంగా సిఎస్‌ఐఆర్-సిఎమ్‌ఆర్‌ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ అంజలి ఛటర్జీ, సౌరశక్తి ఆధారిత ఇంటెల్లిమాస్ట్, టచ్‌లెస్ ఫౌసెట్, 360డిగ్రీల కార్ ఫ్లషర్, డ్రై ఫాగింగ్ షూ క్రిమిసంహారక,హాస్పిటల్ కేర్ అసిస్టటివ్ రోబోటిక్ పరికరం, ఆసుపత్రుల కోసం కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కోప్స్) గురించి వివరంగా సమర్పించారు. కోవిడ్-19 లో మొదటి స్థాయి రక్షణగా మాస్కులు, శానిటైజర్ల ప్రాముఖ్యత గురించి ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ హిమాద్రి రాయ్ వివరించారు. కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, రోడ్లు క్రిమిసంహారక నడక మార్గం, రోడ్ శానిటైజర్ యూనిట్, న్యూమాటిక్లీ ఆపరేటెడ్ మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక (పోమిడ్) యూనిట్, బ్యాటరీ శక్తితో అభివృద్ధి చేసిన క్రిమిసంహారక యూనిట్లను శ్రీ అవినాష్ యాదవ్ వివరంగా సమర్పించారు. క్రిమిసంహారక స్ప్రేయర్ (బిపిడిఎస్). ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన టచ్ ఫ్రీ సోప్-కమ్-వాటర్ డిస్పెన్సింగ్ సిస్టమ్స్ సంస్కరణలపై సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నాసిర్ ఉల్ రషీద్ సమర్పించారు. కోవిడ్-19 లో సంస్థ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్‌గా అభివృద్ధి చేసిన వెంటిలేటర్లపై శాస్త్రవేత్త శ్రీ సంజయ్ హన్స్ దా వివరించారు.
*****
(Release ID: 1652553)
Visitor Counter : 236